ఐసీయూలో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీషా... ఆరోగ్య పరిస్థితిపై అప్‌డేట్ ఇస్తూ...
ఐపీఎల్ 2022 సీజన్‌లో టైటిల్ ఫెవరెట్‌గా బరిలో దిగిన జట్లలో ఢిల్లీ క్యాపిటల్స్ ఒకటి. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఆశించిన స్థాయిలో పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయింది. 10 మ్యాచుల్లో 5 మ్యాచులు గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఊహించని షాక్ తగిలింది...

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో యంగ్ సెన్సేషనల్ ఓపెనర్ పృథ్వీ షా లేకుండా బరిలో దిగింది ఢిల్లీ క్యాపిటల్స్. ఫామ్‌లో లేకపోయినా పృథ్వీ షా టాలెంట్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌పై బోలెడంత నమ్మకం ఉంది... అలాంటి పృథ్వీ షాని ఎందుకు పక్కనబెట్టారనే ప్రశ్న అభిమానులను వెంటాడింది...
పృథ్వీ షా స్థానంలో జట్టులోకి వచ్చిన మన్‌దీప్ సింగ్... 5 బంతులాడి డకౌట్ అయ్యాడు. దీంతో పృథ్వీషా మరో సారి ట్రెండింగ్‌లో నిలిచాడు? పృథ్వీ షాకి గాయమైందా? ఎందుకు ఆడడం లేదని సోషల్ మీడియాలో పోస్టులు తెగ వైరల్ అయ్యాయి...
అదీకాకుండా ఢిల్లీ క్యాపిటల్స్ బృందంలో కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయనే వార్త, అభిమానుల ఆందోళనను మరింత పెంచేసింది. కొందరైతే పృథ్వీ షా కరోనా బారిన పడ్డాడంటూ పుకార్లు సృష్టించారు...
ఎట్టకేలకు తన అభిమానులకు సమాధానం ఇచ్చాడు పృథ్వీ షా... ‘నాకు జ్వరం వచ్చి ఆసుపత్రిలో చేరాను. ప్రస్తుతం కోలుకుంటున్నాను. త్వరలోనే మళ్లీ ఆడతాను... మీ అభిమానాన్ని ధన్యుడిని’ అంటూ పోస్టు చేశాడు పృథ్వీ షా...
ఐపీఎల్ 2022 సీజన్‌లో 9 మ్యాచులు ఆడిన పృథ్వీ షా... 2 హాఫ్ సెంచరీలతో 259 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో డేవిడ్ వార్నర్‌తో కలిసి ఓపెనింగ్ చేస్తున్న పృథ్వీషా, సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్‌ని మిస్ అవుతున్నట్టు కనిపిస్తోంది...
ఐపీఎల్ 2022 షెడ్యూల్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, నేడు చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్ ఆడాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు ఢిల్లీ బృందంలో ఓ నెట్ బౌలర్ కరోనా బారిన పడినట్టు తేలింది...
దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ మొత్తానికి కరోనా పరీక్షలు నిర్వహించారు అధికారులు. ఈ పరీక్షల్లో ప్లేయర్లు అందరూ నెగిటివ్‌గా తేలడంతో మ్యాచ్ సజావుగా సాగనుంది...
ఢిల్లీ క్యాపిటల్స్ బృందంలో కరోనా కేసులు వెలుగుచూడడం ఇది మూడోసారి. ఇంతకుముందు ఢిసీ ఫిజియో ప్యాట్రిక్ ఫార్‌హర్ట్ కరోనా పాజిటివ్‌గా తేలగా, ఆ తర్వాత మూడు రోజులకు ప్లేయర్లు మిచెల్ మార్ష్, టిమ్ సిఫర్ట్‌తో పాటు సహాయక సిబ్బందికి కూడా కరోనా సోకింది..