- Home
- Sports
- Cricket
- ఒక్క మ్యాచ్ ఆడకపోయినా దీపక్ చాహార్ పర్సులోకి రూ.14 కోట్లు... బీసీసీఐ కొత్త పాలసీతో...
ఒక్క మ్యాచ్ ఆడకపోయినా దీపక్ చాహార్ పర్సులోకి రూ.14 కోట్లు... బీసీసీఐ కొత్త పాలసీతో...
ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో ఏకంగా రూ.14 కోట్లు పెట్టి, ఆల్‌రౌండర్ దీపక్ చాహార్‌ని కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. ఇండియా, వెస్టిండీస్ మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తూ గాయపడ్డాడు దీపక్ చాహార్...

దీపక్ చాహార్ గాయం నుంచి కోలుకోవడానికి నాలుగైదు వారాల సమయం పడుతుందని తేలడంతో ఐపీఎల్ 2022 సీజన్ ఫస్టాఫ్‌కి అందుబాటులో ఉండడని టాక్ వినిపించింది...
ఐపీఎల్ 2022 సీజన్‌లో వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడిన చెన్నై సూపర్ కింగ్స్, దీపక్ చాహార్ రీఎంట్రీ ఎప్పుడిస్తాడా? అని ఆశగా ఎదురుచూసింది...
అయితే పాత గాయం నుంచి కోలుకునే క్రమంలో ఎన్‌సీఏలో శిక్షణ తీసుకుంటున్న దీపక్ చాహార్... మరోసారి గాయపడడంతో సీజన్ మొత్తానికి దూరమయ్యాడు...
వెన్ను గాయంతో బాధపడుతున్న దీపక్ చాహార్ మరో నాలుగు నెలల పాటు క్రికెట్‌కి దూరం కాబోతున్నట్టు ప్రకటించింది బీసీసీఐ. దీంతో అతను టీ20 వరల్డ్ కప్ 2022 నాటికి జట్టుకి అందుబాటులో ఉంటాడా? అనేది అనుమానంగా మారింది...
ఐపీఎల్ 2022 మెగా వేలంలో రూ.16 కోట్లకు రవీంద్ర జడేజాని, రూ.12 కోట్లకు ఎమ్మెస్ ధోనీని రిటైన్ చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్... రూ.14 కోట్లు పెట్టి దీపక్ చాహార్‌ని కొనుగోలు చేయడం హాట్ టాపిక్ అయ్యింది...
గాయం కారణంగా ఐపీఎల్ 2022 మొత్తానికి దూరం కావడంతో దీపక్ చాహార్... వేలంలో దక్కించుకున్న రూ.14 కోట్ల పరిస్థితి ఏంటి? ...
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ గ్రేడ్ సీ ప్లేయర్ల లిస్టులో చోటు దక్కించుకున్న దీపక్ చాహార్, తాజా ఇన్సూరెన్స్ పాలసీ కారణంగా వేలంలోని దాదాపు పూర్తి మొత్తం అందుకోబోతున్నాడు...
‘బీసీసీఐ, ఐపీఎల్ పాలసీ కాంట్రాక్ట్ ప్రకారం ప్లేయర్లు అందరూ ప్రీమియం చెల్లించాలి. దీపక్ చాహార్ కాంట్రాక్ట్ ప్లేయర్ కావడంతో అతను రూ.14 కోట్లు మొత్తం కాకపోయినా, దాదాపు పూర్తి మొత్తాన్ని అందుకోబోతున్నాడు...’ అంటూ కామెంట్ చేశారు బీసీసీఐ అధికారి...
అదే బీసీసీఐ కాంట్రాక్ట్ పొందని ప్లేయర్లు గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరమైతే ఒక్క రూపాయి కూడా పొందలేరు. కేవలం బీసీసీఐ కాంట్రాక్ట్ ఉన్న ప్లేయర్లు మాత్రం ఒక్క మ్యాచ్ ఆడకపోయినా పూర్తి పాలసీ మొత్తం అందుకుంటారు.