- Home
- Sports
- Cricket
- రూ.9.25 కోట్లకు కొని, కూర్చోబెట్టారు... ఐపీఎల్ 2022లో లక్నోకి లక్కీ ప్లేయర్‌గా మారిన కృష్ణప్ప గౌతమ్..
రూ.9.25 కోట్లకు కొని, కూర్చోబెట్టారు... ఐపీఎల్ 2022లో లక్నోకి లక్కీ ప్లేయర్‌గా మారిన కృష్ణప్ప గౌతమ్..
ఐపీఎల్ 2021 మెగా వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న అన్‌క్యాప్డ్ ప్లేయర్ కృష్ణప్ప గౌతమ్. ఐపీఎల్ 2018 నుంచి 2020 వరకూ రాజస్థాన్ రాయల్స్‌కి రూ.6.20 కోట్లకు ఆడిన కృష్ణప్ప గౌతమ్‌ని రూ.9.25 కోట్లకు కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన రికార్డు ఉన్న కృష్ణప్ప గౌతమ్‌ని, ఎమ్మెస్ ధోనీ ఎలా వాడతాడు? అనేది ఆసక్తికరంగా మారుతుందని ఆశించారు క్రికెట్ ఫ్యాన్స్...
ఇంగ్లాండ్‌తో సిరీస్‌కి నెట్ బౌలర్‌గా ఎంపికైన కృష్ణప్ప గౌతమ్‌కు ఐపీఎల్ 2021 మినీ వేలంలో భారీ ధర దక్కింది. బేస్ ప్రైజ్ రూ.20 లక్షలతో మొదలైన కృష్ణప్ప గౌతమ్‌ను కొనుగోలు చేసేందుకు రాయల్ ఛాలెంజర్స్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ పోటీపడ్డాయి. ఆఖరికి చెన్నై సూపర్ కింగ్స్ రూ.9 కోట్ల 25 లక్షల భారీ మొత్తానికి అతన్ని దక్కించుకుంది.
అయితే ఐపీఎల్ 2021 సీజన్ వేలంలో రూ.9.25 కోట్లకు కొన్న కృష్ణప్ప గౌతమ్‌ని ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడించలేదు చెన్నై సూపర్ కింగ్స్...
కుర్రాళ్లకు అవకాశాలు ఇవ్వడానికి ఏ మాత్రం ఇష్టపడని మాహీ, సీనియర్లను ఆడించడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడు. ఈ కారణంగానే రూ.9 కోట్ల ప్లేయర్, ఒకే ఒక్క మ్యాచ్‌లో సబ్‌స్టిట్యూట్‌గా ఫీల్డర్‌గా కనిపించి, ఓ క్యాచ్ జారవిడిచాడు...
ఐపీఎల్ 2021 సీజన్ ఎఫెక్ట్‌తో 2022 మెగా వేలంలో రూ.90 లక్షలు మాత్రమే దక్కించుకున్నాడు కృష్ణప్ప గౌతమ్. అయితే కొత్త ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్‌కి లక్కీ ప్లేయర్‌గా మారాడు కృష్ణప్ప గౌతమ్.
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 61 పరుగులు చేసిన పృథ్వీషాని మొదటి ఓవర్‌లోనే అవుట్ చేసి, లక్నోకి తొలి బ్రేక్ అందించిన కృష్ణప్ప గౌతమ్, రిషబ్ పంత్‌ని పరుగు తీయకుండా నియంత్రించి మెయిడిన్ ఓవర్ వేశాడు.
రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో చెలరేగిపోయాడు కృష్ణప్ప గౌతమ్. తొలి బంతికే దేవ్‌దత్ పడిక్కల్‌ని అవుట్ చేసిన గౌతమ్, ఐదో బంతికి అద్భుతమైన టర్న్‌తో వాన్ దేర్ దుస్సేన్‌ని క్లీన్ బౌల్డ్ చేశాడు... ఆ ఓవర్‌లో 3 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు కృష్ణప్ప గౌతమ్...
కృష్ణప్ప గౌతమ్ వేసిన మూడో ఓవర్‌లో సిమ్రాన్ హెట్మయర్ ఇచ్చిన క్యాచ్‌ని లాగ్ ఆన్‌లో కృనాల్ పాండ్యా జారవిడిచాడు. లేదంటే గౌతమ్ ఖాతాలో మరో వికెట్ చేరి ఉండేది...
33 ఏళ్ల వయసులో టీమిండియా తరుపున ఆరంగ్రేటం చేసేందుకు ఆశగా ఎదురుచూస్తున్న కృష్ణప్ప గౌతమ్‌కి ఈ సీజన్ ద్వారా ఆ కోరిక త్వరలోనే తీరుతుందని గట్టి నమ్మకంతో ఉన్నాడు...