- Home
- Sports
- Cricket
- ముగ్గురు గర్ల్‌ఫ్రెండ్స్, ముగ్గురు పిల్లలు... లైఫ్ అంటే డీజే బ్రావోదే! ఒక్కో సీజన్‌కి ఒక్కో లవర్‌తో వస్తూ...
ముగ్గురు గర్ల్‌ఫ్రెండ్స్, ముగ్గురు పిల్లలు... లైఫ్ అంటే డీజే బ్రావోదే! ఒక్కో సీజన్‌కి ఒక్కో లవర్‌తో వస్తూ...
సింగిల్ కింగులం అని పాటలు పాడుకున్నా, ఒంటరి జీవితం కాస్త బోరింగ్ గానే ఉంటుంది. లవర్ ఉన్నవాళ్లను చూస్తూ ఈర్ష్య ఆటోమేటిక్‌గా పుట్టుకొస్తుంది. అలాంటిది ఒక్కడికి ముగ్గురు గర్ల్‌ఫ్రెండ్స్ ఉంటే! ఒక్క గర్ల్‌ఫ్రెండ్ లేక మనం ఏడుస్తుంటే, వీరికి ముగ్గురా? అని కుళ్లుకుంటాం... ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ మేట్స్ పరిస్థితి ఇదే...

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, గుజరాత్ లయన్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి జట్లకి ఆడిన డీజే బ్రావో... ఈ సీజన్‌లో బ్యాటుతో పెద్దగా రాణించలేకపోయినా బౌలింగ్‌లో సత్తా చాటాడు...
10 మ్యాచుల్లో 16 వికెట్లు తీసిన డీజే బ్రావో, బ్యాటింగ్‌లో 23 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో బ్రావోకి మంచి ఆల్‌రౌండ్ రికార్డు ఉంది...
161 ఐపీఎల్ మ్యాచుల్లో 1560 పరుగులు చేసిన బ్రావో, 183 వికెట్లు పడగొట్టాడు. లసిత్ మలింగ 170 వికెట్లను అధిగమించిన బ్రావో, ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు...
38 ఏళ్ల డీజే బ్రావోకి ఇంకా పెళ్లి కాలేదు. అయితే మనోడు సింగిల్ కాదు. బ్రావోకి ఏకంగా ముగ్గురు గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారు. పెళ్లికాకపోయినా ఈ ముగ్గురికీ ముగ్గురు పిల్లలు కూడా పుట్టారు...
బ్రావోకి ఇద్దరు కొడుకులు, ఓ కూతురు ఉన్నారు. ఐపీఎల్‌తో పాటు బిగ్‌బాష్ లీగ్, పాకిస్తాన్ సూపర్ లీగ్ వంటి లీగుల్లో ఆడే బ్రావో, ఎక్కడికి వెళ్లినా గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి వెళ్తాడు...
అయితే ఒకేసారి ఇద్దరు, ముగ్గురు గర్ల్‌ఫ్రెండ్స్‌ని తీసుకెళ్లకుండా... ఒక్కో సీజన్‌కి ఒక్కో గర్ల్‌ఫ్రెండ్‌కి టూర్‌కి వస్తుంటాడు బ్రావో. దీంతో మనోడి ఎంజాయ్‌మెంట్‌ని చూసి తెగ ఫీలైపోతుంటారట సీఎస్‌కే ప్లేయర్లు...
‘మా జట్టులో డ్వేన్ బ్రావోకి ముగ్గురు గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారు. అతనికి ముగ్గురితోనూ పిల్లలు కూడా ఉన్నారు. ఆ ముగ్గురిలో ఎవ్వరినీ బ్రావో పెళ్లి చేసుకోలేదు... ఐపీఎల్‌లో ఒక్కో సీజన్‌కి ఓ గర్ల్‌ఫ్రెండ్‌ను తీసుకొని వస్తాడు.. మా జట్టులోని ప్లేయర్లు అందరూ బ్రావోని చూసి కుళ్లుకుంటూ ఉంటారు... ’ అంటూ చెప్పుకొచ్చాడు సీఎస్‌కే ప్లేయర్ దీపక్ చాహార్...
బాలీవుడ్ హీరోయిన్, మాజీ మిస్ ఇండియా వరల్డ్ నటాశా సూరీతో కూడా డీజే బ్రావోకి రిలేషన్ ఉందని వార్తలు వచ్చాయి. అయితే నటాశా మాత్రం బ్రావో తనకి కేవలం మంచి మిత్రుడు మాత్రమేనని తేల్చేసింది...
తనకి క్రికెట్ పెద్దగా నచ్చేది కాదని, కేవలం పీటీ టీచర్ హాట్‌గా ఉందని, ఆమెను చూడొచ్చనే ఉద్దేశంతోనే క్రికెట్ ఆడేవాడినని చెప్పిన డ్వేన్ బ్రావో, రాపర్‌గానూ మంచి సక్సెస్ సాధించాడు...
ఏదేమైనా లైఫ్‌ని ఎలా ఎంజాయ్ చేయాలో ఈ వెస్టిండీస్ క్రికెటర్లను చూసి నేర్చుకోవాలని అంటున్నారు రొమాంటిక్ జనాలు...