- Home
- Sports
- Cricket
- ఆ క్యాచ్, ఏబీడీకే అంకితం! దినేశ్ కార్తీక్ ఆడిన ఇన్నింగ్స్ కూడా అతనికే... - విరాట్ కోహ్లీ కామెంట్స్...
ఆ క్యాచ్, ఏబీడీకే అంకితం! దినేశ్ కార్తీక్ ఆడిన ఇన్నింగ్స్ కూడా అతనికే... - విరాట్ కోహ్లీ కామెంట్స్...
ఐపీఎల్‌లో గత రెండు సీజన్ల మాదిరిగానే ఫస్టాఫ్‌ని పాజిటివ్‌గా ప్రారంభించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఫాఫ్ డుప్లిసిస్ కెప్టెన్సీలో ఆడిన ఆరు మ్యాచుల్లో నాలుగు విజయాలు అందుకుని టాప్ 3లో నిలిచింది...

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టాపార్డర్ విఫలమైనా గ్లెన్ మ్యాక్స్‌వెల్, దినేశ్ కార్తీక్ మెరుపు హాఫ్ సెంచరీల కారణంగా 189 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది ఆర్‌సీబీ...
34 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 66 పరుగులు చేసిన దినేశ్ కార్తీక్ మరోసారి నాటౌట్‌గా నిలవగా... గ్లెన్ మ్యాక్స్‌వెల్ 34 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 55 పరుగులు చేశాడు. షాబాజ్ అహ్మద్ 32 పరుగులతో అజేయంగా నిలిచాడు...
190 పరుగుల లక్ష్యఛేదనలో 173 పరుగులకి పరిమితమైంది ఢిల్లీ క్యాపిటల్స్. డేవిడ్ వార్నర్ 38 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 66 పరుగులు చేయగా రిషబ్ పంత్ 17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 34 పరుగులు చేశాడు...
సిరాజ్ బౌలింగ్‌లో రిషబ్ పంత్ పట్టిన ఓ క్రాకింగ్ షాట్‌ని గాల్లోకి ఎగురుతూ ఒంటి చేత్తో ఒడిసి పట్టుకున్నాడు విరాట్. కోహ్లీ సూపర్ క్యాచ్ కారణంగా పంత్ వికెట్ కోల్పోయిన ఢిల్లీ, లక్ష్యఛేదనలో విఫలమైంది...
తాను పట్టిన సింగిల్ హ్యాండ్ సూపర్ మ్యాన్ క్యాచ్‌ని ‘మిస్టర్ 360’, ఆర్‌సీబీ మాజీ క్రికెటర్ ఏబీ డివిల్లియర్స్‌కి అంకితం ఇచ్చాడు విరాట్ కోహ్లీ...
‘నేను పట్టిన క్యాచ్ ఏబీడీకి అంకితం. అలాగే దినేశ్ కార్తీక్ ఆడిన ఫెంటాస్టిక్ ఇన్నింగ్స్ కూడా ఏబీకే అంకితం... ఇవన్నీ ఏబీ డివిల్లియర్స్ ఒక్కడే చేసేవాడు, ఇప్పుడు ఇద్దరు ముగ్గురు కలిసి చేయాల్సి వస్తోంది...
ఏబీ డివిల్లియర్స్ స్థానాన్ని భర్తీ చేయడం ఏ ఒక్కరి వల్ల కాదు, ఇద్దరు ముగ్గురు కావాల్సిందే... దినేశ్ కార్తీక్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు.
Virat Kohli
అతనికి టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కితే, అది టీమ్‌కి ఎక్స్‌ట్రా ఎనర్జీ ఇస్తుంది...’ అంటూ కామెంట్ చేశాడు విరాట్ కోహ్లీ...