- Home
- Sports
- Cricket
- ఐపీఎల్ క్యాన్సిల్ చేసేయండి సార్... ట్రెండ్ చేస్తున్న ముంబై ఇండియన్స్, సీఎస్‌కే ఫ్యాన్స్...
ఐపీఎల్ క్యాన్సిల్ చేసేయండి సార్... ట్రెండ్ చేస్తున్న ముంబై ఇండియన్స్, సీఎస్‌కే ఫ్యాన్స్...
ఐపీఎల్‌లో భారీ ఫాలోయింగ్, క్రేజ్ ఉన్న టీమ్స్ చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్. రోహిత్ శర్మ సారథిగా వ్యవహరించే ముంబైకి, ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీ నాలుగు టైటిల్స్ గెలిచిన సీఎస్‌కేకి జనాల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది...

ఐపీఎల్ 2022 సీజన్‌లో ఇప్పటికే 29 మ్యాచులు ముగిసాయి. 74 మ్యాచుల సుదీర్ఘ సీజన్ అయినా ఇప్పటికే ప్లేఆఫ్స్ చేరే జట్ల గురించి ఓ అంచనా, క్లారిటీ వచ్చేసింది అభిమానులకు...
ఈ సీజన్‌లో ఇప్పటిదాకా ఒక్క విజయం కూడా అందుకోలేకపోయింది ముంబై ఇండియన్స్. రోహిత్ శర్మ కెప్టెన్సీలో గత 9 సీజన్లలో 5 సార్లు టైటిల్ గెలిచిన ముంబై నుంచి ఈ రకమైన పర్ఫామెన్స్ ఎవ్వరూ ఊహించలేకపోయారు...
మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలో దిగిన చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఆరు మ్యాచుల్లో ఒకే ఒక్క విజయం మాత్రమే అందుకోగలిగింది. 5 మ్యాచుల్లో ఓడి పాయింట్ల పట్టికలో ముంబై తర్వాత ఆఖరి స్థానంలో నిలిచింది.
దీంతో ఐపీఎల్‌ను క్యాన్సిల్ చేయాలని డిమాండ్ చేస్తూ ‘Cancel IPL’ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు...
ఆర్‌సీబీతో మ్యాచ్‌కి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ఫిజియో ప్యాట్రిక్ ఫార్‌హర్ట్ కరోనా పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ప్లేయర్లకు కరోనా పరీక్షలు నిర్వహించినా పాజిటివ్ రాకపోవడంతో ఆర్‌సీబీతో మ్యాచ్ కూడా ఆడింది ఢిల్లీ..
తాజాగా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌కి పూణేకి బయలుదేరే ముందు ఆటగాళ్లకు మరోసారి కరోనా పరీక్షలు చేయగా ఓ విదేశీ ఆటగాడికి, మరో సహాయక సిబ్బందికి పాజిటివ్ వచ్చినట్టు సమాచారం...
దీంతో పూణే ప్రయాణాన్ని వాయిదా వేసిన ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్, క్వారంటైన్‌లో గడుపుతోంది. దీంతో కరోనా క్లిష్ట సమయంలో ఐపీఎల్ అవసరమా? దాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పోస్టులు చేస్తున్నారు ముంబై ఇండియన్స్, సీఎస్‌కే ఫ్యాన్స్...
ఐపీఎల్ 2021లో కూడా సరిగ్గా 29 మ్యాచులు ముగిసిన తర్వాత కరోనా కేసులు వెలుగు చూడడం, అర్ధాంతరంగా సీజన్‌ని నిలిపివేసి... నాలుగు నెలల తర్వాత యూఏఈ వేదికగా నిర్వహించడం చేసింది బీసీసీఐ...
అయితే ఈసారి కూడా అలాంటి పరిస్థితి వస్తే, బీసీసీఐకి కోట్ల రూపాయాల్లో నష్టం వచ్చే అవకాశం ఉంది. 10 ఫ్రాంఛైజీలతో 74 రోజుల పాటు సాగే ఐపీఎల్ 2022 సీజన్ ద్వారా వేల కోట్లు ఆర్జించాలని టార్గెట్‌గా పెట్టుకుంది బీసీసీఐ..