- Home
- Sports
- Cricket
- వీడిని ఇంకేలా మార్చాలి... కేన్ విలియంసన్ అవుట్ అవ్వగానే తల పట్టుకున్న బ్రియాన్ లారా...
వీడిని ఇంకేలా మార్చాలి... కేన్ విలియంసన్ అవుట్ అవ్వగానే తల పట్టుకున్న బ్రియాన్ లారా...
ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్స్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒకటి. 2016లో టైటిల్ గెలిచిన సన్‌రైజర్స్, 2018 సీజన్‌లో రన్నరప్‌గా నిలిచింది. 2019, 2020 సీజన్లలోనూ ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించింది. అయితే అదంతా గతం. ఇప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటతీరు మాత్రం అంత గొప్పగా లేదు... ముత్తయ్య మురళీధరన్, బ్రియాన్ లారా, డేల్ స్టెయిన్ వంటి దిగ్గజ క్రికెటర్లు కోచ్‌లుగా ఉన్నా... సన్ రైజ్ అవ్వడం లేదు...

శిఖర్ ధావన్ ఢిల్లీ క్యాపిటల్స్‌కి వెళ్లిన తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ భారాన్ని దాదాపుగా డేవిడ్ వార్నర్ ఒక్కడే మోసేవాడు. ఆ తర్వాత జానీ బెయిర్ స్టో, కేన్ విలియంసన్ అప్పుడప్పుడూ మెరిసేవాళ్లు...
2018 సీజన్‌లో డేవిడ్ వార్నర్ లేని సమయంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ని ఫైనల్ చేర్చాడు కేన్ విలియంసన్. 17 మ్యాచుల్లో 735 పరుగులు చేసి బ్యాట్స్‌మెన్‌గానూ దుమ్ముదులిపాడు...
ఈ పర్ఫామెన్స్ కారణంగానే ఐపీఎల్ 2021 సీజన్‌లో మొదటి ఆరు మ్యాచుల్లో ఐదు ఓటములు ఎదుర్కొన్న తర్వాత డేవిడ్ వార్నర్‌ని కాదని కేన్ విలియంసన్‌కి కెప్టెన్సీ అప్పగించింది సన్‌రైజర్స్ హైదరాబాద్...
ఓటములను కారణంగా చూపించిన టీమ్ సెలక్షన్ విషయంలో డేవిడ్ వార్నర్ చేసిన కామెంట్లు, సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ మేనేజ్‌మెంట్‌కి కోపాన్ని తెప్పించాయని, అందుకే వార్నర్ భాయ్‌ని కెప్టెన్సీ నుంచి తప్పించి, టీమ్ నుంచి బయటికి పంపించారనేది అందరికీ తెలిసిన విషయమే...
అయితే స్లో బ్యాటింగ్ చేస్తున్నాడని, ఇంతకుముందులా పరుగులు చేయలేకపోతున్నాడని చెప్పి డేవిడ్ వార్నర్‌ని సన్‌రైజర్స్ టీమ్‌కి దూరం చేసింది మేనేజ్‌మెంట్. అయితే కేన్ విలియంసన్, ఐపీఎల్ 2021 సీజన్‌లో వార్నర్ ఆడిన దాని కంటే ఘోరంగా ఆడుతున్నాడు...
ఐపీఎల్ 2022 సీజన్2లో 12 మ్యాచులు ఆడిన కేన్ విలియంసన్, 208 పరుగులు చేశాడు. యావరేజ్ 17.33 కాగా స్ట్రైయిక్ రేటు 92 మాత్రమే. కనీసం 100+ స్ట్రైయిక్ రేటు కూడా మెయింటైన్ చేయలేకపోతున్న కేన్ విలియంసన్, ఓపెనర్‌గా వస్తూ విలువైన పవర్ ప్లేలో బంతులను వృథా చేస్తున్నాడు...
గోల్డ్ కోసం వెతుకుతూ డైమండ్ పొగొట్టుకున్నాడనే సామెత చెప్పినట్టుగా కేన్ మామ ఏదో చేస్తాడనే ఆశతో బ్యాటింగ్‌లో అదరగొట్టే డేవిడ్ వార్నర్‌ని సన్‌రైజర్స్ బయటికి పంపిందని తెగ బాధపడిపోతున్నారు ఆరెంజ్ ఆర్మీ అభిమానులు...
కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 17 బంతులాడి ఓ ఫోర్‌తో 9 పరుగులు చేసిన కేన్ విలియంసన్, ఆండ్రే రస్సెల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. విలియంసన్ బౌల్డ్ కాగానే డగౌట్‌లో కూర్చున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ కోచ్ బ్రియాన్ లారా తలపట్టుకోవడం విశేషం...
మ్యాచులు మారుతున్నా కేన్ విలియంసన్ ఆటతీరు మారకపోవడంతో బ్రియాన్ లారా బాగా డిస్సపాయింట్ అవుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఇంతకుముందు మార్కో జాన్సెన్ బౌలింగ్ చేస్తున్న సమయంలో డగౌట్‌లో ఉన్న ముత్తయ్య మురళీధరన్, ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే..