- Home
- Sports
- Cricket
- ఆయన్ని ఇలా చూడలేకపోతున్నా... విరాట్ కోహ్లీ ఫామ్‌పై బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ కామెంట్...
ఆయన్ని ఇలా చూడలేకపోతున్నా... విరాట్ కోహ్లీ ఫామ్‌పై బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ కామెంట్...
ఐపీఎల్ 2022 సీజన్‌లో భారత స్టార్ల అట్టర్ ఫ్లాప్ ప్రదర్శన కొనసాగుతూ వస్తోంది. భారత మాజీ సారథి విరాట్ కోహ్లీతో పాటు ప్రస్తుత సారథి రోహిత్ శర్మ, స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా, రిషబ్ పంత్ ఎవ్వరూ స్థాయిని తగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతున్నారు. ముఖ్యంగా విరాట్ ఫామ్ అయితే ఫ్యాన్స్‌ని తీవ్ర నిరుత్సాహానికి గురి చేస్తోంది...

ఐపీఎల్ కెరీర్‌లో 6499 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, మరో పరుగు చేస్తే 6500 పరుగులు చేసిన మొట్టమొదటి క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేస్తాడు. ఐపీఎల్‌లో 6 వేల పరుగులు చేసిన మొదటి ప్లేయర్ విరాట్ కోహ్లీ కాగా, ఈ సీజన్‌లో శిఖర్ ధావన్ కూడా ఆ మైలురాయిని అందుకున్నాడు...
ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్ తొలి బంతికే జగదీశ సుచిత్ బౌలింగ్‌లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు విరాట్ కోహ్లీ. ఈ సీజన్‌లో విరాట్ కోహ్లీకి ఇది మూడో డకౌట్ కావడం విశేషం...
2008 నుంచి 2021 వరకూ మూడు సార్లు మాత్రమే గోల్డెన్ డకౌట్ అయిన విరాట్ కోహ్లీ, ఈ సీజన్‌లో ఇప్పటికే మూడు సార్లు ఇలా తొలిబంతికే అవుటై పెవిలియన్ చేరాడు. మరో రెండు సార్లు రనౌట్ అయ్యాడు...
‘విరాట్ కోహ్లీని ఇలా మొదటి బంతికే డకౌట్ అవ్వడం చూసి చాలా డిస్సాపాయింట్ అయ్యాను. అయితే ఇదే ఆయన విలువను ఏ మాత్రం తగ్గించదు. ఆయన ఇప్పుడు, ఎప్పుడూ గొప్ప క్రికెటరే...
త్వరలో టీమిండియా టీ20 వరల్డ్ కప్ ఆడబోతోంది. అందుకే ఆయన వీలైనంత త్వరగా ఫామ్‌లోకి రావాలని కోరుకుంటున్నా. విరాట్, వరల్డ్‌లో బెస్ట్ బ్యాట్స్‌మెన్లలో ఒకడు...
ఆయనకి ఇది ఐపీఎల్ 2022 సీజన్‌లో మూడో గోల్డెన్ డక్, ఇది నేనస్సలు ఊహించలేదు. ఈరోజు కోహ్లీ ఓ పెద్ద ఇన్నింగ్స్ ఆడతాడని అనుకున్నా... విరాట్‌ని ఇలా చూడలేకపోతున్నా...
Ranveer Singh
టీ20 వరల్డ్ కప్‌కి ముందు విరాట్ కోహ్లీ ఫుల్ ఛార్జ్‌గా ఉంటాడని అనుకుంటున్నా. ఆ మెగా టోర్నీకి ముందు కోహ్లీ ఫామ్‌లోకి రావడం... టీమిండియాకి చాలా అవసరం..’ అంటూ కామెంట్ చేశాడు బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్...
విరాట్ కోహ్లీ గోల్డెన్ డకౌట్ అయినా ఫాఫ్ డుప్లిసిస్, రజత్ పటిదార్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, దినేశ్ కార్తీక్‌ల కారణంగా 192 పరుగుల భారీ స్కోరు చేసిన ఆర్‌సీబీ, సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 67 పరుగుల తేడాతో భారీ విజయం అందుకుని పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి దూసుకెళ్లింది..