- Home
- Sports
- Cricket
- అప్పుడు మిడిల్ ఆర్డర్ సమస్య, ఇప్పుడు ఓపెనింగ్... ఐపీఎల్ 2022లోనూ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ని వీడని...
అప్పుడు మిడిల్ ఆర్డర్ సమస్య, ఇప్పుడు ఓపెనింగ్... ఐపీఎల్ 2022లోనూ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ని వీడని...
ఐపీఎల్ 2021 సీజన్‌లో అట్టర్ ఫ్లాప్ పర్ఫామెన్స్ తర్వాత టీమ్‌లో పెను మార్పులు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఇన్నాళ్లు టీమ్‌కి భారంగా ఉన్న మనీశ్ పాండే, విజయ్ శంకర్ వంటి ప్లేయర్లందరినీ వేలానికి విడుదల చేసిన ఎస్‌ఆర్‌హెచ్, చాలా వరకు కొత్త ప్లేయర్లతో ఐపీఎల్ 2022 సీజన్ బరిలో దిగింది...

రాహుల్ త్రిపాఠి, అయిడిన్ మార్క్‌రమ్, నికోలస్ పూరన్ వంటి ప్లేయర్ల రాకతో సన్‌రైజర్స్ హైదరాబాద్ మిడిల్ ఆర్డర్ బలంగా మారింది. ఇన్నాళ్లు వేధించిన మిడిల్ ఆర్డర్ సమస్యకు ఓ పరిష్కారం దొరికినట్టైంది...
అయితే ఐపీఎల్ 2022 సీజన్‌లో ఓపెనింగ్ వైఫల్యం సన్‌రైజర్స్‌ను తీవ్రంగా వెంటాడుతోంది. కెప్టెన్ కేన్ విలియంసన్ ఈ సీజన్‌లో ఘోరంగా విఫలమవుతున్నాడు...
ఐపీఎల్ 2022 సీజన్‌లో 10 మ్యాచులు ఆడిన కేన్ విలియంసన్, 195 పరుగులు చేశాడు. యావరేజ్ 19.50 కాగా స్ట్రైయిక్ రేటు కేవలం 99.49గా ఉంది. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ మాత్రం కాస్త బాగానే ఆడుతున్నాడు...
10 మ్యాచుల్లో 32.4 సగటుతో 324 పరుగులు చేసిన అభిషేక్ శర్మ, 134 స్ట్రైయిక్ రేటుతో పరుగులు చేస్తూ పర్వాలేదనిపిస్తున్నాడు. ఈ సీజన్‌లో అభిషేక్ శర్మ రెండు హాఫ్ సెంచరీలు కూడా చేశాడు...
ఇంతకుముందు సీజన్లలో డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టో కలిసి సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఓపెనర్లుగా వ్యవహరించేవాళ్లు. బెయిర్ స్టో లేని మ్యాచుల్లో వృద్ధిమాన్ సాహా లేదా కేన్ విలియంసన్ ఓపెనర్లుగా వచ్చేవాళ్లు...
సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున మూడు ఆరెంజ్ క్యాపులు గెలిచిన డేవిడ్ వార్నర్, టాపార్డర్‌లో అద్భుతంగా రాణించేవాడు. ఇంకో మాటలో చెప్పాలంటే సన్‌రైజర్స్ గెలిచిన మ్యాచుల్లో మెజారిటీ బ్యాటింగ్ కాంట్రిబ్యూషన్ మొత్తం వార్నర్‌దే...
డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టోలను మెగా వేలానికి విడుదల చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్... కేన్ విలియంసన్‌ని కెప్టెన్‌గా అట్టి పెట్టుకుంది. అయితే కేన్ మామ మాత్రం టీ20ల్లో టెస్టు బ్యాటింగ్ ఆడుతూ టీమ్‌కి భారంగా మారాడు...
2019 ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన కేన్ విలియంసన్, టీమ్ కాంబినేషన్ సెట్ చేసేందుకు చాలా మ్యాచుల్లో రిజర్వు బెంచ్‌కే పరిమితమయ్యాడు...
డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టో, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్ వంటి ఫారిన్ ప్లేయర్లకు తుదిజట్టులో చోటు ఇచ్చి భువనేశ్వర్ కుమార్ కెప్టెన్సీలో మ్యాచులను ఆడించాడు. ఇప్పుడు కూడా కేన్ మామ అదే స్ట్రాటెజీ వాడితే బాగుంటుందని అంటున్నారు ఆరెంజ్ ఆర్మీ అభిమానులు...
Glenn Phillips
టాపార్డర్‌లో పరుగులు చేయలేక ఇబ్బందులు పడుతున్న కేన్ విలియంసన్ రిజర్వు బెంచ్‌లో కూర్చొని, గ్లెన్ ఫిలిప్స్ వంటి టీ20 స్టార్ బ్యాటర్‌కి అవకాశం ఇస్తే బాగుంటుందని అంటున్నారు సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు..