- Home
- Sports
- Cricket
- Shane Warne: చనిపోయే ముందు కొద్దిసేపటి దాకా దాని గురించే మాట్లాడాడు.. వార్న్ మిత్రుడి షాకింగ్ కామెంట్స్
Shane Warne: చనిపోయే ముందు కొద్దిసేపటి దాకా దాని గురించే మాట్లాడాడు.. వార్న్ మిత్రుడి షాకింగ్ కామెంట్స్
IPL 2022: క్రికెట్ ప్రపంచాన్ని విషాధంలోకి నెట్టుతూ ఈ నెల 4న కన్నుమూసిన దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ తన ఆఖరి శ్వాసకు కొద్దిసేపటి ముందు వరకు కూడా...

ఈ నెల 4న థాయ్లాండ్ లోని తన విల్లాలో గుండెపోటు తో కన్నుమూసిన ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ ప్రపంచాన్ని విషాదంలో నింపాడు. ఈ లెజెండరీ స్పిన్నర్ మరణానికి సంబంధించి రోజుకో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో తాజాగా మరో ఆసక్తికరమైన వార్త వెల్లడైంది.
థాయ్లాండ్ లోని విల్లాలో తనతో పాటే ఉంటున్న మిత్రులలో ఒకరైన టామ్ హాల్.. వార్న్ మరణానికి కొద్దిసేపటిదాకా ఐపీఎల్ లో తన ప్రయాణం ఎలా సాగింది..? విజేతగా నిలిచినప్పుడు తన ఫీలింగ్ ఏంటి..? అనే విషయాలపై స్నేహితులతో చర్చించినట్టు వెల్లడించాడు.
వార్న్ మరణానంతరం ఓ వెబ్ సైట్ కు కథనం రాస్తూ... ‘ఐపీఎల్ లో తమ తొలి మ్యాచ్ ఓడిన తర్వాత రాజస్థాన్ రాయల్స్ యజమాని మనోజ్ బదలె దిగాలుగా ఉండటాన్ని చూసిన వార్న్.. దిగులువద్దు మిత్రమా.. అంతా సర్దుకుంటుంది అని చెప్పాడని మాతో అన్నాడు.
ఆ గేమ్ తర్వాత రాజస్థాన్ రాయల్స్ అద్భుతం సృష్టించింది. తర్వాత మ్యాచులన్నీ గెలుస్తూ వాళ్లు ఏకంగా ఐపీఎల్ తొలి (2008) టైటిల్ నెగ్గారు.
ఈ సందర్భంగా అనామక జట్టుతో తాను టైటిల్ నెగ్గిన విధానాన్ని వార్న్ మాతో చర్చించాడు. ఐపీఎల్, రాజస్థాన్ రాయల్స్ గురించి మేం చాలా మాట్లాడుకున్నాం..’ అని రాసుకొచ్చాడు.
‘వార్న్ నాతో కొద్దికాలంగా కలిసి ఓ స్పోర్ట్స్ ఛానెల్ లో కలిసి పనిచేస్తున్నాడు. అతడు నాకు 2005 లో యాషెస్ టెస్టులో వాడిన జంపర్, 2008లో వాడిన ఐపీఎల్ షర్ట్, వన్డే ఇంటర్నేషనల్ షర్ట్.. క్యాప్ ఇచ్చాడు. అవన్నీ నాకు ఎంతో ప్రత్యేకం. వాటన్నింటినీ చూసినప్పుడు నాకు ఎంతో సంతోషమనిపిస్తుంది.
ఇక వార్న్ చనిపోవడానికి కొద్దిసేపటి ముందు మేం క్రికెట్ గురించి పిచ్చాపాటి మాట్లాడుకున్నాం. తన క్రికెట్ కెరీర్ లో తీసుకున్న కొన్ని అరుదైన ఫోటోలను వార్న్ మాకు చూపించాడు..
ఇక మేం డిన్నర్ చేద్దాం అని నిర్ణయించుకున్నాం. మేం వెళ్లి అందుకు సిద్ధమయ్యాం. కానీ వార్న్ మాత్రం రాలేదు. ఎంతసేపటికీ రాకపోవడంతో మేం లోపలికి వెళ్లి చూసేసరికి ఇలా జరిగిపోయింది...’ అని తన కథనంలో రాసుకొచ్చాడు టామ్ హాల్..