ఆర్‌సీబీని ఓడిస్తే అంతే... రాజస్థాన్ రాయల్స్‌ని ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్...
ఐపీఎల్ 2022 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ అదిరిపోయే పర్ఫామెన్స్‌తో ఫైనల్‌కి దూసుకొచ్చింది. టేబుల్ టాప్ 2గా ప్లేఆఫ్స్‌కి వచ్చిన రాజస్థాన్ రాయల్స్, మొదటి క్వాలిఫైయర్‌లో టైటాన్స్ చేతుల్లో ఓడినా రెండో క్వాలిఫైయర్‌లో ఆర్‌సీబీని ఓడించి... ఫైనల్‌కి ఎంట్రీ ఇచ్చింది.. అయితే ఫైనల్‌లో చిత్తుగా ఓడి, రన్నరప్‌తో సరిపెట్టుకుంది..

ఐపీఎల్‌లో ఆర్‌సీబీని ప్లేఆఫ్స్‌లో ఓడించిన ఏ జట్టూ కూడా ఫైనల్‌లో టైటిల్ గెలవలేకపోయాయి. ఐపీఎల్‌లో 8 సార్లు ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించిన ఆర్‌సీబీ, మూడు సార్లు ఫైనల్ ఆడింది...
ప్లేఆఫ్స్‌కి ఆర్‌సీబీని ఓడించిన ఐదు జట్లు కూడా ఫైనల్‌లో టైటిల్ గెలవలేకపోయాయి. 2010 సీజన్‌లో ప్లేఆఫ్స్‌కి చేరిన ఆర్‌సీబీ, ముంబై ఇండియన్స్ చేతుల్లో ఓడింది... ఆర్‌సీబీని ఓడించి ఫైనల్ చేరిన ముంబై ఇండియన్స్, సీఎస్‌కే చేతుల్లో ఓడి టైటిల్ గెలవలేకపోయింది...
2015 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ఆర్‌సీబీని ఓడించి ఫైనల్‌కి దూసుకెళ్లింది. 2015 ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ చేతుల్లో పరాజయం పాలైంది...
2020 సీజన్‌లో వరుసగా ఆరు మ్యాచుల్లో ఓడినప్పటికీ నెట్ రన్ రేట్ కారణంగా ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించగలిగింది ఆర్‌సీబీ. అయితే ఆ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆర్‌సీబీని ఓడించి రెండో క్వాలిఫైయర్‌కి అర్హత సాధించింది. అయితే రెండో క్వాలిఫైయర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతుల్లో ఓడి మూడో స్థానానికి పరిమితమైంది సన్‌రైజర్స్...
ఐపీఎల్ 2021 సీజన్‌లోనూ నాలుగో స్థానంతో ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించిన ఆర్‌సీబీ, ఎలిమినేటర్ మ్యాచ్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ చేతుల్లో ఓడింది. రెండో క్వాలిఫైయర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ని ఓడించి ఫైనల్ చేరిన కేకేఆర్, సీఎస్‌కే చేతుల్లో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది...
ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్‌ని కూడా ఆర్‌సీబీ సెంటిమెంట్ దెబ్బతీసిందని అంటున్నారు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్.. కనీసం ఆర్‌సీబీ ఫైనల్‌కి అర్హత సాధించి ఉంటే, టైటాన్స్‌కి మంచి పోటీ అయినా ఇచ్చేదని అంటున్నారు అభిమానులు...