- Home
- Sports
- Cricket
- రెండే ముక్కలు చెప్పి, 9 జట్లకి చుక్కలు చూపించి... టైటాన్స్ కోచ్ ఆశీష్ నెహ్రా రికార్డు...
రెండే ముక్కలు చెప్పి, 9 జట్లకి చుక్కలు చూపించి... టైటాన్స్ కోచ్ ఆశీష్ నెహ్రా రికార్డు...
ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలం ముందు నాటి సంగతి. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా, కోచ్‌గా ఆశీష్ నెహ్రా ఎంపిక కావడంపై క్రికెట్ విశ్లేషకులు నోర్లు విరిచారు. మెగా వేలంలో ప్లేయర్ల కొనుగోలు చేసిన విధానంపై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి... గుజరాత్ టైటాన్స్, ఈ సీజన్‌లో ఆఖరి స్థానంలో నిలుస్తుందని భావించారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్... అయితే రిజల్ట్ మాత్రం వేరేగా వచ్చింది. ఆరంగ్రేటంలోనే అదిరిపోయే పర్ఫామెన్స్‌తో సీజన్ మొత్తం పూర్తి ఆధిపత్యం చూపించి టైటిల్ ఎగరేసుకుపోయింది టైటాన్స్..

ఐపీఎల్‌లో టైటిల్ గెలిచిన మొట్టమొదటి భారత హెడ్ కోచ్‌గా రికార్డు క్రియేట్ చేశాడు ఆశీష్ నెహ్రా... 2008 నుంచి షేన్ వార్న్, డారెన్ లెహ్మన్, స్టీఫెన్ ఫ్లెమ్మింగ్, ట్రేవర్ బేలిస్, జాన్ రైట్, రికీ పాంటింగ్, మహేళ జయవర్థనే, టామ్ మూడీ వంటి విదేశీ హెడ్ కోచ్‌లు మాత్రమే ఐపీఎల్ టైటిల్ గెలవగలిగారు. ఆశీష్ నెహ్రా ఆ లిస్టులో చేరిన మొట్టమొదట భారత హెడ్ కోచ్...
కేకేఆర్ హెడ్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ వంటి కోచ్‌లు కంప్యూటర్లలో కుస్తీపడుతూ ప్లేయర్ల గురించి స్టడీ చేస్తూ, ఎవరిని ఎలా అవుట్ చేయాలి? ఎవరిని ఆడించాలని పెద్ద పెద్ద లెక్కలే వేశారు... అయితే గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశీష్ నెహ్రా మాత్రం సీజన్ మొత్తం చాలా కూల్ అండ్ కామ్‌గా తన పని చేసుకుంటూ పోయాడు.
చిన్న పేపర్‌పై పెన్నుతో టీమ్‌ని సెలక్ట్ చేసేసిన నెహ్రా, జట్టు ఓడిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు మిగిలిన హెడ్ కోచ్‌ల్లా ఆవేశంతో ఊగిపోకుండా, కంగారుపడకుండా కొబ్బరిబొండాం తాగుతూ ఛిల్ అవుతూ కనిపించాడు...
విజయాలు వచ్చిన తర్వాత ఎగిరి గంతులు వేయకుండా, గాల్లో ఎగురుతూ సంబరాలు చేసుకోకుండా చాలా కామ్‌గా ఉండే ఆశీష్ నెహ్రా... టీమ్ కాంబినేషన్ చెడిపోకుండా చాలా జాగ్రత్త పడ్డాడు... రిజల్ట్ టైటిల్ ఛాంపియన్...
ఇంత చేసీ ఏమీ తెలియనట్టు సింపుల్‌గా ఓ నవ్వు నవ్వేసే ఆశీష్ నెహ్రా, డ్రెస్సింగ్ రూమ్‌లో ప్లేయర్లకు ఏం చెప్పాడో తెలుసా... ‘బాగా తినండి, ఫుల్లుగా నిద్రపొండి... కప్ తీసుకు వచ్చేయండి...’ అని.. అవును! ప్లేయర్లను మోటివేట్ చేయడానికి పెద్ద పెద్ద స్పీచ్‌లు, లెక్చర్స్ ఇవ్వకుండా సింపుల్‌గా మూడే మూడు ముక్కల్లో ప్రెషర్ తీసుకోకుండా ఆడమని చెప్పి, సూపర్ సక్సెస్ అయ్యాడు నెహ్రా...
2019 సీజన్‌లో ఆర్‌సీబీ హెడ్ కోచ్‌గా ఉన్న గ్యారీ కిర్‌స్టన్, బౌలింగ్ కోచ్‌గా ఉన్న ఆశీష్ నెహ్రా... బెంగళూరు డబుల్ హ్యాట్రిక్ పరాజయాలతో ఆఖరి స్థానంలో నిలిచిన తర్వాత ఆ పొజిషన్ నుంచి తప్పించబడ్డారు. ఇప్పుడు ఆ ఇద్దరూ కలిసి గుజరాత్ టైటాన్స్‌కి టైటిల్ అందివ్వడం విశేషం...