- Home
- Sports
- Cricket
- రాయల్స్ గెలిచింది, ముంబై ఇండియన్స్ కథ ముగిసింది... అధికారికంగా ప్లేఆఫ్స్ రేసు నుంచి అవుట్...
రాయల్స్ గెలిచింది, ముంబై ఇండియన్స్ కథ ముగిసింది... అధికారికంగా ప్లేఆఫ్స్ రేసు నుంచి అవుట్...
ఐపీఎల్ 2022 సీజన్‌లో వరుసగా 8 మ్యాచుల్లో ఓడి, చెత్త రికార్డు మూటకట్టుకున్న ముంబై ఇండియన్స్, అధికారికంగా ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న మొట్టమొదటి జట్టుగా నిలిచింది. టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆడిన మొదటి సీజన్‌లోనే ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్నాడు రోహిత్ శర్మ...

గత సీజన్‌లో నెట్ రన్‌రేట్ కారణంగా ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించలేకపోయింది ముంబై ఇండియన్స్... 7 మ్యాచుల్లో గెలిచి 14 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచి లీగ్ స్టేజీని ముగించింది...
ఐపీఎల్ 2008, 2009 సీజన్ల తర్వాత వరుసగా రెండు సీజన్లలో ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించలేకపోవడం ఇదే మొదటిసారి. వరుసగా 8 మ్యాచుల్లో ఓడిన తర్వాత రెండు విజయాలు అందుకున్నా.. పంజాబ్ కింగ్స్‌పై, రాజస్థాన్ రాయల్స్ విజయంలో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ అవకాశాలు ఆవిరైపోయాయి...
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్, మిగిలిన మ్యాచుల్లో గెలిస్తే స్థానాన్ని కాస్త మెరుగుపర్చుకునే అవకాశం ఉంటుంది. 2009 సీజన్‌లో 7వ స్థానంలో నిలిచిన ముంబై, ప్రతీ సీజన్‌లోనూ 5 కంటే మెరుగైన స్థానాల్లోనే నిలిచింది. ఈసారి ఆ ఛాన్స్ కూడా ముంబైకి లేకుండా పోయింది.
Image Credit: Getty Images
నాలుగు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్, 2020 సీజన్‌లో ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న మొట్టమొదటి జట్టుగా నిలవగా, ఈ సీజన్‌లో ఫైవ్ టైమ్ టైటిల్ విన్నింగ్ టీమ్‌కి ఆ పరిస్థితి వచ్చింది...
ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకోవడంతో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ అవకాశాలు కూడా సన్నగిల్లాయి. 10 మ్యాచుల్లో 3 విజయాలు అందుకున్న సీఎస్‌కే, ప్లేఆఫ్స్ చేరాలంటే మిగిలిన అన్ని మ్యాచులు గెలవడంతో పాటు ఏదైనా అద్భుతం జరగాల్సిందే..
అలాగే గత సీజన్ రన్నరప్ కోల్‌కత్తా నైట్‌రైడర్స్... ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే మిగిలిన నాలుగు మ్యాచుల్లో, పంజాబ్ కింగ్స్ మిగిలిన మూడు మ్యాచుల్లో తప్పక గెలిచి తీరాల్సిందే.