MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2021: సన్‌రైజర్స్ మ్యాచ్ తర్వాత స్టేడియంలో కనిపించని డేవిడ్ వార్నర్... ఏడుపు వస్తోందంటూ...

IPL 2021: సన్‌రైజర్స్ మ్యాచ్ తర్వాత స్టేడియంలో కనిపించని డేవిడ్ వార్నర్... ఏడుపు వస్తోందంటూ...

ఐపీఎల్ 2021 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండో విజయాన్ని అందుకుంది. ఎన్నాళ్లో వేచిన ఈ విజయం, క్రికెట్ ఫ్యాన్స్‌కి కావాల్సిన కిక్‌ అందించింది. అయితే డేవిడ్ వార్నర్ ఫ్యాన్స్‌కి మాత్రం తీవ్ర నిరాశ ఎదురైంది...

Chinthakindhi Ramu | Published : Sep 28 2021, 04:27 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
112
Asianet Image

పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 125 పరుగుల టార్గెట్‌ను ఛేదించలేక చతికిలపడిన సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 165 పరుగుల టార్గెట్‌ను ఈజీగా చేధించింది...

212
Asianet Image

డేవిడ్ వార్నర్ స్థానంలో జట్టులోకి వచ్చిన జాసన్ రాయ్, ఎస్‌ఆర్‌హెచ్ తరుపున ఆడిన తన మొట్టమొదటి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు...

312
Asianet Image

జాసన్ రాయ్‌కి తోడు వార్నర్ నుంచి కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న కేన్ విలియంసన్ కూడా కెప్టెన్ ఇన్నింగ్స్‌తో హాఫ్ సెంచరీ చేసి సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి విజయం అందించారు...

412
Asianet Image

ఈ విజయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఇంకా ప్లేఆఫ్ ఆశలు మిలుకు మిలుకుమంటూ సజీవంగానే మిగిలాయి... టాప్ 3లో ఉన్న చెన్నై, ఢిల్లీ, బెంగళూరు కాకుండా మిగిలిన జట్లు, లీగ్‌లో మిగిలిన మ్యాచుల్లో ఓడి, సన్‌రైజర్స్ హైదరాబాద్ మిగిలిన మ్యాచుల్లో విజయాలు అందుకుంటే ప్లేఆఫ్స్ చేరే అవకాశం ఉంటుంది...

512
Asianet Image

అయితే రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌ సమయంలో డేవిడ్ వార్నర్ స్టేడియంలో ఎక్కడా కనిపించలేదు. ఫస్టాఫ్‌లో ఆర్‌ఆర్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ వార్నర్‌కి తుదిజట్టులో చోటు దక్కలేదు...

612
Asianet Image

అయితే ఆ మ్యాచ్‌లో డగౌట్‌లో కూర్చుని కనిపించిన డేవిడ్ వార్నర్, ప్లేయర్లకు డ్రింక్స్ తీసుకెళుతూ... బాల్ అందిస్తూ ఆటలో ఎలాగైనా భాగం కావాలని ఆతృత పడడం కనిపించింది...

712
Asianet Image

సెకండాఫ్‌లో మాత్రం తనకి తుదిజట్టులో చోటు లేదని తెలుసుకున్న డేవిడ్ వార్నర్, తన రూమ్‌లోనే కూర్చొని మ్యాచ్ చూశాడు. అందుకే స్టేడియంలో ఎక్కడా వార్నర్ కనిపించలేదు...

812
Asianet Image

అయితే డేవిడ్ వార్నర్ అభిమానులు మాత్రం అతను స్టేడియంలో కనిపించకపోవడం బాగా హార్ట్ అయ్యారు. ‘స్టేడియంలో ఎక్కడా వార్నర్ భాయ్ కనిపించలేదు. అతను వచ్చే సీజన్‌లో సన్‌రైజర్స్ ఆడతాడా?’ అంటూ సన్‌రైజర్స్ హైదరాబాద్ పోస్టు కింద కామెంట్లు కనిపించాయి...

912
Asianet Image

‘వార్నర్ భాయ్, సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌ను వదిలి వెళ్తున్నాడంటే నాకు ఏడుపు వస్తోంది... అతను ఎందుకు స్టేడియంలో కనిపించలేదు...’ అంటూ కామెంట్ల వర్షం కురిపించారు ఫ్యాన్స్...

1012
Asianet Image

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఏం పోస్టు చేసినా, దానికి వెంటనే స్పందించి, కామెంట్ పెట్టే డేవిడ్ వార్నర్, ఈ కామెంట్లపై స్పందించాడు... ‘సారీ... ఇకపై అలా జరగదు... దయచేసి ఎల్లప్పుడూ మీ సపోర్ట్ కావాలి...’ అంటూ రిప్లై ఇచ్చాడు వార్నర్...

1112
Asianet Image

అయితే డేవిడ్ వార్నర్ కామెంట్‌ను ఇంకోలా అర్థం చేసుకున్న కొందరు... ‘ఇకపై స్టేడియంలోకి రాకపోవచ్చు... మీ సపోర్ట్ కావాలి...’ అంటూ చెబుతున్నట్టుగా అర్థం చేసుకుని, సోషల్ మీడియాలో వార్తలు అల్లేశారు...

1212
Asianet Image

జాసన్ రాయ్ ఫస్ట్ మ్యాచ్‌లోనే సక్సెస్ కావడంతో డేవిడ్ వార్నర్‌కి మిగిలిన నాలుగు మ్యాచుల్లో చోటు దక్కకపోవచ్చని, అలా చూసుకుంటే అతన్ని ఆరెంజ్ ఆర్మీ జెర్సీలో ఇదే ఆఖరు కావచ్చని అంటున్నారు మరికొందరు...

Chinthakindhi Ramu
About the Author
Chinthakindhi Ramu
 
Recommended Stories
Top Stories