- Home
- Sports
- Cricket
- IPL 2021: అవకాశం ఉంది, కానీ అందనంటోంది... విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల ముందు ఆఖరి లీగ్ మ్యాచ్‌లో...
IPL 2021: అవకాశం ఉంది, కానీ అందనంటోంది... విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల ముందు ఆఖరి లీగ్ మ్యాచ్‌లో...
ఐపీఎల్ 2021 సీజన్ క్లైమాక్స్‌కి చేరుతుంది. నేడు జరిగే రెండు మ్యాచులతో లీగ్ స్టేజ్ పూర్తికానుంది. ఇక మిగిలింది రెండు ప్లేఆఫ్స్, ఓ ఫైనల్... అయితే నేటి మ్యాచ్‌లు రెండు జట్లకీ చాలా కీలకం కానున్నాయి...

వరుసగా రెండు సీజన్లలో టైటిల్ గెలిచి, హ్యాట్రిక్ కొట్టాలని భారీ ఆశలతో ఐపీఎల్ 2021 సీజన్‌ను ఆరంభించింది ముంబై ఇండియన్స్...
భారీ హిట్టర్లు, స్టార్ ఆల్‌రౌండర్లు, మ్యాచ్ విన్నర్లు పుష్కలంగా ఉన్న ముంబై ఇండియన్స్, ఈ సీజన్‌లో ఛాంపియన్ రేంజ్ పర్ఫామెన్స్ మాత్రం ఇవ్వలేకపోయింది...
ఫస్టాఫ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీ లక్ష్యాన్ని ఛేదించి ఫామ్‌లోకి వచ్చినట్టు కనిపించిన ముంబై ఇండియన్స్, బ్రేక్ తర్వాత ప్రారంభమైన సెకండాఫ్‌లోనూ ఇబ్బంది పడింది...
కీలక సమయంలో విజయాలు సాధించి కమ్‌బ్యాక్ ఇచ్చినా, రన్‌రేట్ సరిపోలేదు. ఇప్పుడు పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్‌కి ప్లేఆఫ్స్ చేరేందుకు అవకాశం ఉంది...
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తొలుత బ్యాటింగ్ చేసి 203+ పరుగులు చేయాల్సి ఉంటుంది... అది మాత్రం సరిపోదు...
సన్‌రైజర్స్‌ను 30 పరుగులోపు ఆలౌట్ చేసి 170+ పరుగుల తేడాతో విజయం అందుకోవాల్సి ఉంటుంది. ఎంతటి ఫామ్‌లో ఉన్న జట్టుకైనా ఈ అసాధ్యమైన టాస్క్... ఒకవేళ సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి, తొలుత బ్యాటింగ్ ఎంచుకుందా... ఎలాంటి అవకాశం లేకుండా ప్లేఆఫ్స్ నుంచి తప్పుకుంటుంది ముంబై ఇండియన్స్...
అలాగే ఆఖరి సీజన్‌లో నాలుగో స్థానంలో నిలిచినా లక్కీగా ప్లేఆఫ్ చేరిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఈసారి ఎలాగైనా టాప్ 2 లీగ్ స్టేజ్‌ను ముగించాలని ఆశపడింది...
అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిన ఆర్‌సీబీ, ఇప్పుడు 16 పాయింట్లతో ఉంది. ఆఖరి లీగ్ మ్యాచ్‌లో గెలిస్తే, సీఎస్‌కేతో సమంగా 18 పాయింట్లు ఖాతాలో చేరతాయి...
అయితే సీఎస్‌కేకి పాజిటివ్ రన్‌రేట్ ఉండగా, ఆర్‌సీబీ రన్‌రేట్ నెగిటివ్‌లో ఉంది... ఇప్పుడు వాళ్లు పాజిటివ్ నెట్ రన్‌రేట్‌లోకి రావాలంటే టేబుల్ టాపర్ ఢిల్లీ క్యాపిటల్స్‌పై 163 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకోవాల్సి ఉంటుంది...
ఢిల్లీతో ఫస్టాఫ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో గెలిచి, ఊపిరి పీల్చుకున్న ఆర్‌సీబీ... వారిపై 163 పరుగుల తేడాతో విజయాన్ని అందుకోవాలంటే స్కోరు బోర్డు మీద 300+ స్కోరు ఉంచాల్సిందే...
ఈ రెండు జట్ల పరిస్థితులు చూస్తుంటే... అవకాశం ఉంది, కానీ అందనట్టుగా ఉంది. కేకేఆర్ ఇప్పటికే ప్లేఆఫ్స్ చేరినా, అధికారికంగా ముంబైతో మ్యాచ్ టాస్‌తో తేలిపోయింది. అలాగే కేకేఆర్‌తో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడేందుకు ఆర్‌సీబీ రెఢీ అయిపోవాల్సిందే..