MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • సీఎస్‌కే బౌలర్లను మోత మోగించిన యశస్వి జైస్వాల్... 19 ఏళ్ల కుర్రాడు కుమ్మి వదిలేశాడు...

సీఎస్‌కే బౌలర్లను మోత మోగించిన యశస్వి జైస్వాల్... 19 ఏళ్ల కుర్రాడు కుమ్మి వదిలేశాడు...

ఐపీఎల్ 2021 సీజన్‌లో భారత కుర్రాళ్లు అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తున్నారు. ఇప్పటికే రుతురాజ్ గైక్వాడ్, ఆవేశ్ ఖాన్, చేతన్ సకారియా, వరుణ్ చక్రవర్తి, వెంకటేశ్ అయ్యర్... ఇలా ఐపీఎల్ 2021 సీజన్‌లో మంచి పర్ఫామెన్స్ ఇవ్వగా, ఇప్పుడీ లిస్టులోకి సంచలన ప్రదర్శనతో ఎంట్రీ ఇచ్చాడు యశస్వి జైస్వాల్...

1 Min read
Author : Chinthakindhi Ramu
| Updated : Oct 02 2021, 11:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 190 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన రాజస్థాన్ రాయల్స్‌కి మెరుపు ఆరంభం అందించారు ఆర్ ఆర్ ఓపెనర్లు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఇవిన్ లూయిస్, యశస్వి జైస్వాల్ బౌండరీల మోత మోగించడంతో 5 ఓవర్లలోనే 75 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్... 19 ఏళ్ల యశస్వి జైస్వాల్, అద్భుతమైన బౌండరీలతో సీఎస్‌కే బౌలర్లకు చుక్కలు చూపించాడు...

38

హజల్‌వుడ్ వేసిన ఐదో ఓవర్‌లో మూడు సిక్సర్లు, ఓ ఫోర్‌తో 22 పరుగులు రాబట్టిన యశస్వి జైస్వాల్, 19 బంతుల్లో తన మొట్టమొదటి హాఫ్ సెంచరీని అందుకున్నాడు...

48

రాజస్థాన్ రాయల్స్ తరుపున 2018లో జోస్ బట్లర్ (18 బంతుల్లో) తర్వాత ఫాస్టెస్ట్ ఫిఫ్టీ బాదిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు యశస్వి జైస్వాల్..

58

పవర్ ప్లేలోనే హాఫ్ సెంచరీ చేసిన ఆరో భారత బ్యాట్స్‌మెన్‌గా, మొదటి రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు యశస్వి జైస్వాల్. 

68

ఇంతకుముందు 2011లో సన్నీ సోహల్, 2014లో రైనా, సాహా, 2018, 2019 సీజన్లలో కెఎల్ రాహుల్ ఈ ఫీట్ సాధించారు...

78

ఐపీఎల్ 2021 సీజన్‌లో పవర్ ప్లేలో 50 కొట్టిన మొదటి ప్లేయర్‌గా నిలిచిన జైస్వాల్ ఇన్నింగ్స్ కారణంగా మొదటి 6 ఓవర్లలో వికెట్ నష్టానికి 81 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

88

ఐపీఎల్ కెరీర్‌లోనే రాజస్థాన్ రాయల్స్‌కి ఇదే అత్యధిక పవర్ ప్లే స్కోరు. 2008 సీజన్‌లో డెక్కన్ ఛార్జర్స్‌పై కొట్టిన 73 పరుగులను అధిగమించింది ఆర్ఆర్...  

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
TG20 League: టీజీ20 లీగ్‌లో కూడా ర‌చ్చ మొద‌లైందిగా.. 32 బంతుల్లో సెంచ‌రీతో చెల‌రేగిన‌
Recommended image2
Womens T20 WC: టీమిండియా సెమీస్ చేరాలంటే ఏం చేయాలి? పూర్తి ఈక్వేషన్స్ ఇవే
Recommended image3
Harmanpreet Kaur: ఇలాంటి ఆటతో ఎట్ల గెలుస్తాం.. హర్మన్‌ప్రీత్ కౌర్ షాకింగ్ కామెంట్స్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved