- Home
- Sports
- Cricket
- IPL 2021 RCB vs PBKS: మ్యాక్స్‌వెల్ సిక్సర్ల మోత... మహ్మద్ షమీ మ్యాజిక్... పంజాబ్ కింగ్స్ ముందు...
IPL 2021 RCB vs PBKS: మ్యాక్స్‌వెల్ సిక్సర్ల మోత... మహ్మద్ షమీ మ్యాజిక్... పంజాబ్ కింగ్స్ ముందు...
ఐపీఎల్ 2021 సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న గ్లెన్ మ్యాక్స్‌వెల్, తన మాజీ టీమ్‌పై సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. అయితే కీలక సమయంలో బంతితో కమ్‌బ్యాక్ ఇచ్చిన మహ్మద్ షమీ, ఆర్‌సీబీని భారీ స్కోరు చేయనివ్వకుండా బ్రేకులు వేయగలిగాడు...

నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 164 పరుగుల సోరు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీకి ఓపెనర్లు శుభారంభం అందించారు...
దేవ్‌దత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ కలిసి తొలి వికెట్‌కి 68 పరుగుల విలువైన భాగస్వామ్యం జోడించారు... పవర్ ప్లేలోనే 50+ పరుగులు చేసింది ఆర్‌సీబీ...
24 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 25 పరుగులు చేసిన విరాట్ కోహ్లీని అవుట్ చేసిన హెండ్రిక్స్, ఆ తర్వాతి బంతికే వన్‌డౌన్‌లో వచ్చిన డాన్ క్రిస్టియన్‌ని డకౌట్ చేశాడు...
38 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 పరుగులు చేసిన దేవ్‌దత్ పడిక్కల్ కూడా హెండ్రిక్స్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు... 73 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఆర్‌సీబీని ఏబీడీ, మ్యాక్స్‌వెల్ కలిసి ఆదుకున్నారు...
18 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 23 పరుగులు చేసిన ఏబీ డివిల్లియర్స్ రనౌట్ కాగా గ్లెన్ మ్యాక్స్‌వెల్ 33 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 57 పరుగులు చేశాడు..
మ్యాక్స్‌వెల్‌ను ఆఖరి ఓవర్‌లో అవుట్ చేసిన మహ్మద్ షమీ, ఆ తర్వాత సిక్స్ కొట్టిన షాబజ్ అహ్మద్‌ను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాతి బంతికే జార్జ్ గార్టెన్ కూడా బౌల్డ్ కావడంతో వరుస వికెట్లు కోల్పోయింది ఆర్‌సీబీ..