- Home
- Sports
- Cricket
- IPL 2021: ఆర్‌సీబీ ఎంట్రీతో టాప్ 3 ఫిక్స్... నాలుగో స్థానం కోసం ఆ నాలుగు జట్ల మధ్య...
IPL 2021: ఆర్‌సీబీ ఎంట్రీతో టాప్ 3 ఫిక్స్... నాలుగో స్థానం కోసం ఆ నాలుగు జట్ల మధ్య...
ఐపీఎల్ 2021 సీజన్‌లో అసలు సిసలైన డ్రామా ఇప్పుడే మొదలైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్‌పై విజయాన్ని అందుకుని, ప్లేఆఫ్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకోవడంతో ఇక మిగిలిన నాలుగో స్థానం కోసం తీవ్రమైన పోటీ నెలకొని ఉంది...

ఐపీఎల్ 2021 సీజన్‌లో అసలు సిసలైన డ్రామా ఇప్పుడే మొదలైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్‌పై విజయాన్ని అందుకుని, ప్లేఆఫ్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకోవడంతో ఇక మిగిలిన నాలుగో స్థానం కోసం తీవ్రమైన పోటీ నెలకొని ఉంది...
ప్లేఆఫ్స్‌లో మిగిలిన నాలుగో స్థానం కోసం ఏకంగా నాలుగు జట్ల మధ్య తీవ్రమైన పోటీ జరగనుంది... ఆర్‌సీబీతో జరిగిన కీలక మ్యాచ్‌లో ఓడిన పంజాబ్ కింగ్స్‌కి ఇక మిగిలిన ఒకే ఒక్క గ్రూప్ మ్యాచ్...
అయినా పంజాబ్ కింగ్స్‌కి కూడా ప్లేఆఫ్స్ చేరేందుకు అవకాశాలున్నాయి... అయితే ఇప్పుడు కెఎల్ రాహుల్ టీమ్, ప్లేఆఫ్ చేరాలంటే మిగిలిన జట్ల ప్రదర్శనపై ఆధారపడాల్సి ఉంటుంది...
ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్న మొట్టమొదటి జట్టుగా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్, ప్లేఆఫ్ చేరే నాలుగో జట్టును నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించబోతోంది...
కేకేఆర్‌తో జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలిస్తే... కోల్‌కత్తా, పంజాబ్ జట్లు సమానంగా నిలుస్తాయి. అలాగే రాజస్థాన్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగే మ్యాచ్ కూడా కీలకంగా మారుతుంది... ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిచినా ప్లేఆఫ్ బెర్త్ కన్ఫార్మ్ కాదు...
ఆ తర్వాత అక్టోబర్ 7న పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడిస్తే.. రాజస్థాన్ రాయల్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్ మరింత ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది...
నాలుగో స్థానం కోసం పోటీపడుతున్న పంజాబ్ కింగ్స్‌కి ఒకే మ్యాచ్ మిగిలి ఉండడంతో... అది కూడా సీఎస్‌కేతో కావడంతో, రన్‌రేట్ కూడా మరీ అద్భుతంగా లేకపోవడంతో వాళ్లు ప్లేఆఫ్ చేరే అవకాశాలు కేవలం 20 శాతం మాత్రమే...
లీగ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌కి ఇంకా రెండు మ్యాచులు ఉన్నాయి. ఒక రాజస్థాన్ రాయల్స్‌తో కాగా, మరోటి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో... ఈ రెండు గెలిస్తే వారికి ప్లేఆఫ్ చేరే అవకాశాలు 40 శాతం ఉంటాయి...
ల్‌కత్తా నైట్‌రైడర్స్, ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్ గెలిస్తే, వారికి తర్వాతి మ్యాచ్ రాజస్థాన్‌తో ఉంటుంది... ఈ రెండు జట్లనీ ఓడిస్తే, కేకేఆర్‌కి ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు మిగిలిన జట్ల కంటే ఎక్కువగా (దాదాపు 60 శాతం) ఉంటుంది...
రాజస్థాన్ రాయల్స్ కూడా ప్లేఆఫ్స్ రేసులో ఉంది. ముంబై కంటే మెరుగైన రన్‌రేటుతో ఉన్న రాజస్థాన్ రాయల్స్, తన తర్వాతి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌తోనే మ్యాచ్ ఆడనుంది...
ఆ మ్యాచ్‌లో ముంబైని ఓడిస్తే, ఆ తర్వాత కేకేఆర్‌తో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌పై విజయం సాధిస్తే మాత్రం 14 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కి చేరే అవకాశం ఉంటుంది... అయితే రాజస్థాన్ విజయావకాశాలు, ముంబైతో సమానమే...