IPL 2021: ఆ పనితో ఓ మెట్టు ఎక్కేసిన విరాట్ కోహ్లీ... ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో...
IPL 2021: విరాట్ కోహ్లీ మోస్ట్ అగ్రెసివ్ కెప్టెన్. కోపం వస్తే, మన జట్టు వాడా? లేక ప్రత్యర్థి జట్టు ప్లేయరా? అని కూడా ఆలోచించకుండా నోరు పారేసుకునేవాడు. అయితే ఇప్పుడు అతని యాటిట్యూడ్‌లో చాలా మార్పు కనిపిస్తోంది...
టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ తర్వాత టీ20 ఫార్మాట్‌లో కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన విరాట్ కోహ్లీ, ఐపీఎల్‌లో ఆర్‌సీబీ కెప్టెన్‌గానూ ఇదే ఆఖరి సీజన్ అని ప్రకటించిన విషయం తెలిసిందే...
ఇప్పుడు అతనిపై కెప్టెన్సీ ప్రెషర్ కనిపించడం లేదు. ఏదో బరువు దించేసుకున్నట్టుగా కూల్ అండ్ కామ్‌గా కనిపిస్తున్నాడు విరాట్ కోహ్లీ... ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీలో రెండు మార్పులు కనిపించాయి...
ముంబై బౌలర్ ఆడమ్ మిల్నే, బౌన్సర్‌తో విరాట్ కోహ్లీని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. కోహ్లీ దగ్గరికొచ్చి ఏదో కామెంట్ కూడా చేసినట్టు కనిపించింది... సాధారణంగా అయితే విరాట్ కోహ్లీ ఇలాంటి వాటికి చాలా ఘాటుగా సమాధానం ఇస్తాడు...
సెడ్జింగ్ చేయాలనుకునేవాళ్లే నోరు మూసుకునేలా ఫైరింగ్ రిప్లై ఇస్తాడు.. అయితే ముంబైతో మ్యాచ్‌లో మాత్రం విరాట్ కోహ్లీ చాలా కూల్‌గా నవ్వుతూ మిల్నేకి రిప్లై ఇచ్చాడు...
ఈ సంఘటనతో ఒకింత ఆశ్చర్యానికి లోనైన క్రికెట్ ఫ్యాన్స్, ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీ చేసిన పనికి ఫిదా అయిపోయారు...
టీ20 వరల్డ్‌కప్‌కి ఎంపికైన భారత జట్టులో సభ్యుడైన ముంబై ఇండియన్స్ ప్లేయర్ ఇషాన్ కిషన్, ఫేజ్ 2లో పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతున్నాడు..
Ishan Kishan
ఫేజ్ 2లో జరిగిన మూడు మ్యాచుల్లో కలిపి కేవలం 34 పరుగులు మాత్రమే చేశాడు. ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లోనూ ఇషాన్ కిషన్ కేవలం 9 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...
బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఇషాన్ కిషన్ ఓ స్ట్రైయిట్ షాట్ ఆడగా, అది నేరుగా వెళ్లి రోహిత్ శర్మ చేతికి బలంగా తగిలింది. ఈ సంఘటన తర్వాత నొప్పితో విలవిలలాడిన రోహిత్, భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు...
తనవల్లే రోహిత్ గాయపడడం, సరిగా పరుగులు చేయలేకపోతుండడంతో బాధపడుతున్న ఇషాన్ కిషన్ దగ్గరికి వెళ్లిన విరాట్ కోహ్లీ, అతనితో కొద్దిసేపు మాట్లాడి ఓదార్చాడు...
దాదాపు ఏడ్చేస్తున్న ఇషాన్ కిషన్ భుజంపై చేతులు వేసి, కూల్‌గా మాట్లాడి ధైర్యం చెప్పాడు విరాట్ కోహ్లీ... ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి...
ఈ సంఘటనతో టీమిండియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ మరో మెట్టు ఎక్కేశాడని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్... ఇదే ఎమ్మెస్ ధోనీయో, లేక రోహిత్ శర్మనో చేసి ఉంటే వాళ్లని పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్టులు కనిపించేవి...
అయితే భారత్‌లో టీమిండియాలోని కొందరు ప్లేయర్ల వల్లే హేటర్స్‌ను తెచ్చుకున్న విరాట్, సానుకూల హృదయంతో ప్రత్యర్థి ఆటగాడిని ఓదార్చినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని అంటున్నారు ‘కింగ్’ కోహ్లీ ఫ్యాన్స్...