MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Sports
  • Cricket
  • డేవిడ్ వార్నర్‌ను తొలగించడానికి కారణం ఇదే, పర్పామెన్స్ కాదు... - సంజయ్ మంజ్రేకర్...

డేవిడ్ వార్నర్‌ను తొలగించడానికి కారణం ఇదే, పర్పామెన్స్ కాదు... - సంజయ్ మంజ్రేకర్...

ఐపీఎల్ 2021 ఫస్టాఫ్‌లోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో చాలా మార్పులు జరిగాయి. ముఖ్యంగా సీజన్ మధ్యలో కెప్టెన్‌ని మారుస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది ఆరెంజ్ ఆర్మీ. ఈ డేరింగ్ స్టెప్ కారణంగానే సన్‌రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో ఉంది...

2 Min read
Author : Chinthakindhi Ramu
| Updated : Oct 05 2021, 07:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

ఓ ప్లేయర్ అంకితభావంతో ఎలా ఉండాలో డేవిడ్ వార్నర్‌ను చూస్తే తెలుస్తుంది. ప్లేయర్లతో మేనేజ్‌మెంట్‌ ఎలా నడుచుకోవాలో తెలియాలంటే సన్‌రైజర్స్ హైదరాబాద్‌ టీమ్‌ను చూస్తే తెలుస్తుందని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్... 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ కోసం అటు బ్యాటింగ్‌లో, ఇటు కెప్టెన్సీలో ఎంతో చేసి, ఓసారి టైటిల్ కూడా అందించిన డేవిడ్ వార్నర్‌ను కేవలం ఆరంటే ఆరు మ్యాచుల్లో పర్పామెన్స్ బాగోలేదని జట్టు నుంచి తొలగించడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది...

39

‘డేవిడ వార్నర్‌ను తుది జట్టులో నుంచి తీసేయడానికి అతని పర్ఫామెన్స్ కారణం కాదని నా ఉద్దేశం. ఎందుకంటే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఎన్నో సీజన్లుగా అద్భుతమైన ప్రదర్శన ఇస్తున్నాడు వార్నర్...

49

ఐపీఎల్‌లోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్లలో డేవిడ్ వార్నర్ ఒకడు. ఫామ్‌లో లేకున్నా, మహా అయితే రెండు మూడు మ్యాచుల్లో మంచి కమ్‌బ్యాక్ ఇచ్చేవాడు...

59

ఈ విషయం సన్‌రైజర్స్ హైదరాబద్‌ మేనేజ‌మెంట్‌కి తెలియనది కాదు. అయినా అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పించి, జట్టులో నుంచి తీసేశారంటే ఎక్కడో తప్పు జరుగుతోందని తెలుస్తోంది...’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్...

69

బయటికి తెలియకపోయినా, డేవిడ్ వార్నర్‌కి టీమ్ మేనేజ్‌మెంట్‌కి జరిగిన గొడవలే అతన్ని కెప్టెన్సీ నుంచి, ఆ తర్వాత తుదిజట్టులో నుంచి తొలగించడానికి కారణమని తెలుస్తోంది...

79

మనీశ్ పాండే నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తున్నాడనే ఉద్దేశంతో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తన స్థానంలో విరాట్ సింగ్‌కి  అవకాశం ఇవ్వడం... అతను 14 బంతులాడి కేవలం 4 పరగులే చేయడంతో ఆ మ్యాచ్‌లో విజయం అంచల దాకా వచ్చి సూపర్ ఓవర్‌లో ఓడింది సన్‌రైజర్స్...

89

అతని స్థానంలో మనీశ్ పాండే ఉన్నా, ఆరెంజ్ ఆర్మీ గెలిచి ఉండేదని కామెంట్లు వినిపించాయి. మ్యాచ్ అనంతరం ‘మనీశ్ పాండేని ఎందుకు పక్కనబెట్టారో తెలీదు, అతను మంచి ఫామ్‌లో ఉన్నాడు... టీమ్ సెలక్షన్ ఏ ఉద్దేశంతో చేశారో తెలీదు’ అంటూ కామెంట్ చేశాడు డేవిడ్ వార్నర్...

99

ఈ కామెంట్లతోనే సన్‌రైజర్స్ హైదరాబాద్‌ మేనేజ్‌మెంట్‌కీ, డేవిడ్ వార్నర్‌కీ మధ్య మనస్పర్థలు వచ్చి... అతన్ని కెప్టెన్సీ నుంచి తొలగించడానికా కారణంగా మార్చుకుందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి..

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ వరల్డ్ రికార్డు.. శ్రీలంకపై సెంచరీతో ద్రవిడ్ 27 ఏళ్ల ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు
Recommended image2
భారత్ శ్రీలంక టెస్టులో ప్లేయర్స్ మధ్య వాగ్వాదం.. అసలేం జరిగింది? తొలిరోజు ఆధిప‌త్యం ఎవ‌రిదంటే
Recommended image3
AUS vs BAN : రెండు రోజుల్లోనే టెస్ట్ మ్యాచ్ ఖతం.. బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా రివెంజ్ విజయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved