- Home
- Sports
- Cricket
- IPL 2021: ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ వర్సెస్ ‘కింగ్’ కోహ్లీ... రికార్డుల్లో ముంబై టాప్ అయినా...
IPL 2021: ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ వర్సెస్ ‘కింగ్’ కోహ్లీ... రికార్డుల్లో ముంబై టాప్ అయినా...
ఐపీఎల్ 2021 సీజన్‌కి మరికొన్ని గంటల్లో తెరలేవనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్‌లో 14వ సీజన్ ప్రారంభం కానుంది. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ వర్సెస్ ‘కింగ్’ కోహ్లీ మధ్య మ్యాచ్‌లో గెలుపు ఎవరిదంటే...

ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్‌లో మొదటి మ్యాచ్ జరగడం ఇది మూడోసారి. 2008లో ముంబై, ఆర్‌సీబీ మధ్య జరిగిన మొదటి మ్యాచ్‌లో బెంగళూరు 5 వికెట్లతో గెలిచింది.

మళ్లీ 2013 సీజన్‌లో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ మధ్య మొదటి మ్యాచ్ జరగగా అందులో ఆర్‌సీబీ 2 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయాన్ని అందుకుంది.

ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ప్రత్యర్థులుగా తలబడడం ఇది 14వ సారి. కోహ్లీ సేనపై 10 సార్లు విజయాన్ని అందుకున్న రోహిత్ టీమ్, ఆర్‌సీబీపై మంచి ఆధిక్యం అందుకుంది.

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మధ్య జరిగిన మ్యాచుల్లో ఆర్‌సీబీ కెప్టెన్ ఏడు సార్లు టాస్ గెలిస్తే, ముంబై కెప్టెన్ ఏడుసార్లు టాస్ గెలవడం విశేషం....

ఓవరాల్‌గా ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ మధ్య 27 మ్యాచులు జరగగా ఆర్‌సీబీ 10 మ్యాచుల్లో, ముంబై 17 మ్యాచుల్లో విజయాన్ని అందుకుంది...

ముంబై ఇండియన్స్ జట్టు మూడు సార్లు 200+ స్కోర్లు చేయగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండు సార్లు ఈ ఫీట్ సాధించింది...

ఐపీఎల్ ప్రారంభమ్యాచుల్లో ఓడిపోవడం, ఆ తర్వాత అదిరిపోయే ఆటతీరుతో ఛాంపియన్‌లో నిలవడం ఆనవాయితీగా వస్తోంది. ఐపీఎల్‌లో వరుసగా 8 సార్లు, మొదటి మ్యాచ్‌లో ఓటమి పాలైంది ముంబై ఇండియన్స్...

2013 నుంచి ఇప్పటిదాకా ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లో విజయాన్ని అందుకోలేకపోయింది ముంబై ఇండియన్స్. గత సీజన్‌లో సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైంది ముంబై...

చెన్నై గ్రౌండ్‌లో 291 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా టాప్‌లో ఉన్నాడు. ఏబీడీ 228 పరుగులు, రోహిత్ శర్మ 152 పరుగులు చేశారు...

ముంబై, ఆర్‌సీబీ మధ్య జరిగిన మ్యాచుల్లో 4 సార్లు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు రోహిత్ శర్మ. పోలార్డ్ రెండుసార్లు, ఏబీ డివిల్లియర్స్ రెండు సార్లు ఈ ఫీట్ సాధించారు...

2008 నుంచి చెపాక్ స్టేడియంలో 8 మ్యాచులు ఆడిన ముంబై ఇండియన్స్, కేవలం ఒకే మ్యాచ్‌లో ఓడింది. ఓడిన ఒకే మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో కావడం విశేషం...