- Home
- Sports
- Cricket
- మీరెక్కడ తగిలార్రా బాబూ... ఆర్‌సీబీకి అడ్డుగోడగా మారిన ఆరెంజ్ ఆర్మీ... ఐపీఎల్‌లో ప్రతీసారీ...
మీరెక్కడ తగిలార్రా బాబూ... ఆర్‌సీబీకి అడ్డుగోడగా మారిన ఆరెంజ్ ఆర్మీ... ఐపీఎల్‌లో ప్రతీసారీ...
రియల్ లైఫ్, రీల్ లైఫ్‌లోనే కాదు క్రికెట్‌లోనూ, అందులో ఐపీఎల్‌లోనూ కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి.. ఐపీఎల్ కొందరు ప్లేయర్లకు ఫేవరెట్ టీమ్స్ ఉంటాయి, మరికొన్ని టీమ్స్‌కి ఫేవరెట్ ప్రత్యర్థులు కూడా ఉంటాయి... మిగిలిన మ్యాచుల్లో ఫెయిల్ అయినా ఫెవరెట్ టీమ్‌తో మ్యాచ్ వచ్చేసరికి అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తూ ఉంటారు.. ఆరెంజ్ ఆర్మీకి అలాంటి ఫెవరెట్ టీమ్ ఆర్‌సీబీ...

ఐపీఎల్ 2021 సీజన్ లీగ్ ఆఖర్లో వరుసగా రెండు మ్యాచులు గెలిచి, టాప్ 2లో ముగించాలని భావించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...
టేబుల్ పొజిషన్‌లో టాప్ 2లో ఉన్న జట్లకి క్వాలిఫైయర్‌లో ఓడినా, ఎలిమినేటర్ రూపంలో మరో ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి క్వాలిఫైయర్ 1లో ఓడినా కమ్‌బ్యాక్ ఇచ్చే అవకాశం ఉంటుంది...
అయితే వారి ఆశలపై నీళ్లుచల్లింది ఆరెంజ్ ఆర్మీ. ఈ సీజన్‌లో దారుణంగా ఫెయిల్ అవుతూ, మొదటి 12 మ్యాచుల్లో రెండంటే రెండు విజయాలు మాత్రమే అందుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్...
అలాంటి టీమ్ చేతుల్లో ఇప్పటికే ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడుతుందని ఎవ్వరూ ఊహించలేదు. అయితే ఫామ్‌లో లేని ఆరెంజ్ ఆర్మీ ఆ పని చేసి చూపించింది...
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ ఓడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాప్ 2లో ముగించే అవకాశాన్ని కోల్పోయింది. ఇక మిగిలిన మ్యాచ్‌లో టేబుల్ టాపర్ ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించినా టాప్ 2లోకి రావాలంటే ఎన్నో గణాంకాలు తోడుకావాల్సి ఉంటుంది...
ఆర్‌సీబీకి బ్రేకులు వేయడం సన్‌రైజర్స్‌కి ఇది మొదటిసారి కాదు. ఐపీఎల్ కెరీర్‌లో రాయల్ ఛాలెంజర్స్‌కి హైదరాబాద్ చేతుల్లో కీ టైమ్‌లో ఊహించని దెబ్బలు తగిలాయి...
2009 ఐపీఎల్ సీజన్‌లో ఫైనల్ చేరింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అయితే ఫైనల్‌లో ఆర్‌సీబీని చిత్తు చేసిన డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్, టైటిల్ గెలిచింది...
ఆ తర్వాత 2012లో హైదరాబాద్, ఆర్‌సీబీ మధ్య ఆఖరి లీగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఓడిన ఆర్‌సీబీ, నెట్ రన్‌రేట్ తక్కువగా ఉండడంతో ప్లేఆఫ్ స్పాట్‌ను కోల్పోయింది. సీఎస్‌కే, ఆర్‌సీబీకి సమాన పాయింట్లు ఉన్నా, రన్‌రేట్ మెరుగ్గా ఉండడంతో ధోనీ సేన ప్లేఆఫ్స్‌కి చేరింది...
2013లో ఆఖరి లీగ్ మ్యాచ్‌లో గెలిచిన హైదరాబాద్, ప్లేఆఫ్స్‌కి క్వాలిఫై సాధించింది. సన్‌రైజర్స్ గెలుపుతో, ఆర్‌సీబీ ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించలేకపోయింది...
2015లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతుల్లో ఓడింది. ఈ విజయంతో ముంబై టాప్ 2లోకి వెళ్లగా, ఆర్‌సీబీ టాప్ 3లోకి పడిపోయి రెండో ఎలిమినేటర్‌లో ఓడింది...
2016లో విరాట్ కోహ్లీ అసాధారణ బ్యాటింగ్ కారణంగా ఫైనల్ చేరింది ఆర్‌సీబీ. అయితే ఫైనల్‌లో కోహ్లీ ఐపీఎల్ టైటిల్ ఆశలకు బ్రేకులు వేసింది సన్‌రైజర్స్... 208 టార్గెట్‌తో బరిలో దిగి 200 పరుగులకు పరిమితమైంది...
2020 సీజన్‌లో మొదటి 9 మ్యాచుల్లో 7 విజయాలు అందుకుని, ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అయితే ఎలిమినేటర్‌లో ఆర్‌సీబీని చిత్తు చేసిన సన్‌రైజర్స్, విరాట్ టీమ్‌ని నాలుగో స్థానానికి పరిమితం చేసింది...
2021 సీజన్‌లోనూ మరోసారి ఫామ్‌లో లేని సన్‌రైజర్స్ హైదరాబాద్ కారణంగానే టాప్ 2లో ముగించలేకపోయింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...
అయితే ఇంత జరిగినా ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను ఓడించి, డిఫెండింగ్ ఛాంపియన్‌ను ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించకుండా ఆరెంజ్ ఆర్మీ అడ్డుకోవాలని కోరుకుంటున్నారు మిగిలిన జట్ల అభిమానులు...