IPL 2020: మయాంక్ మామూలోడు కాదండోయ్... మనోడి లవ్‌స్టోరి వింటే...
IPL 2020 సీజన్ 13లో అద్భుతంగా రాణిస్తున్నాడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్. మొదటి మ్యాచ్‌లో ఒంటరి పోరాటం చేసి మ్యాచ్‌ను ములపు తిప్పిన మయాంక్, రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో అదరగొట్టాడు. ఎంతో పద్ధతైన కుర్రాడిలా కనిపించే మయాంక్ లవ్ స్టోరీ తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే..
భారత జట్టు తరుపు టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చిన మయాంక్ అగర్వాల్, సౌతాఫ్రికాతో డబుల్ సెంచరీ కూడా చేశాడు.
రంజీల్లో త్రిబుల్ సెంచరీ బాదిన మయాంక్ అగర్వాల్, దేశవాళీ క్రికెట్‌లో అనేక రికార్డులు నెలకొల్పాడు.
మయాంక్ అగర్వాల్ సతీమణి పేరు అశితా సూద్...
అశితాను తాను డిగ్రీ చదివే సమయంలో కలిశాడు మయాంక్ అగర్వాల్.
అప్పటి నుంచి మంచి స్నేహితులుగా ఉన్న అశితాకు లండన్‌లో ప్రఖ్యాత ‘ది లండన్ ఐ’ టవర్ మీద ప్రపోజ్ చేశాడు మయాంక్ అగర్వాల్..
ఆశితా వెంటనే మయాంక్ అగర్వాల్ ప్రేమను ఒప్పుకోవడంతో ఈ ఇద్దరి ప్రేమకథ పెళ్లికి దారి తీసింది.
నిజానికి ‘మన్మథుడు’ సినిమాలో నాగ్ చెప్పినట్టు ‘ఐఫిల్ టవర్ మీద ప్రపోజ్ చేస్తే... నో చెప్పదని’ ఐడియాను ఫాలో అయ్యాడట మయాంక్..
‘లండన్ ఐ’ నుంచి అందమైన లండన్ నగరాన్ని చూపిస్తూ... ‘నా జీవితంలో నవ్వుంటే ఇంతకంటే అందంగా ఉంటుందని’ ప్రపోజ్ చేశాడట మయాంక్.
మయాంక్ ప్రపోజ్ చేసిన విధానానికి ఫ్లాట్ అయిన అశితా... ఒకే చెప్పేసింది.
డిసెంబర్ 30, 2017న అశితాకు ప్రపోజ్ చేసిన మయాంక్, 2018, జూన్ 4న వివాహం చేసుకున్నాడు.
క్రికెట్‌తో పాటు మయాంక్ అగర్వాల్, ఆయన భార్య ఆశితాకు ట్రావెల్ అంటే చాలా ఇష్టం.
ఈ ఇద్దరూ కలిసి పారిస్, మాల్దీవులు వంటి ఎన్నో పర్యాటక ప్రదేశాలను చుట్టి వచ్చారు.
టెస్టు జట్టులో మంచి ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్న మయాంక్ అగర్వాల్, వన్డే జట్టులో మాత్రం పెద్దగా రాణించలేకపోయాడు.
ధావన్ గాయపడడంతో జట్టులోకి వచ్చిన మయాంక్, న్యూజిలాండ్ సిరీస్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.
ఐపీఎల్ 2020లో అతని ప్రదర్శన ఆధారంగా టీ20 జట్టులో మాయంక్‌కి అవకాశం దక్కొచ్చు.