MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • INDW vs AUSW: ప‌ట్టు బిగించిన భార‌త్.. హాఫ్ సెంచరీలతో అద‌ర‌గొట్టిన న‌లుగురు ప్లేయ‌ర్లు

INDW vs AUSW: ప‌ట్టు బిగించిన భార‌త్.. హాఫ్ సెంచరీలతో అద‌ర‌గొట్టిన న‌లుగురు ప్లేయ‌ర్లు

INDW vs AUSW Test: ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న టెస్టు మ్యాచ్ లో భార‌త ప్లేయ‌ర్లు బ్యాటింగ్ లో అద‌ర‌గొట్టారు. స్మృతి మంధాన, రిచా ఘోష్, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ హాఫ్ సెంచరీలు చేయ‌డంతో భారత మ‌హిళా జ‌ట్టు టెస్టు క్రికెట్ లో మరో 400+ స్కోరు సాధించింది. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Dec 23 2023, 12:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

INDW vs AUSW Test : భారత మహిళల జట్టు బ్యాట్ తో మరో అద్భుత ప్రదర్శన చేసింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్ లో భారత్ తొలి ఇన్నింగ్స్ లో 406 పరుగులు చేసి 187 పరుగుల ఆధిక్యం సాధించింది. 
 

25

ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో న‌గులురు ప్లేయ‌ర్లు ఆఫ్ సెంచ‌రీల‌తో రాణించారు. స్మృతి మంధాన, రిచా ఘోష్, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ హాఫ్ సెంచరీలు చేయ‌డంతో భార‌త్ మ‌రోసారి 400ల‌కు పైగా స్కోర్ చేసింది. 
 

35

భారత్ తరఫున దీప్తి 78 పరుగులు చేయగా, స్మృతి మంధాన 106 బంతుల్లో 74 పరుగులు చేసింది. స్నేహ్ రాణా (9), హర్మన్ప్రీత్ కౌర్ (0), యస్తికా భాటియా (1) మినహా దాదాపు ప్రతి భారత బ్యాట్స్ మెన్ శుభారంభం చేశారు.  ఫాస్ట్ బౌలర్ పూజా వస్త్రాకర్ కూడా లోయర్ ఆర్డర్లో విలువైన సహకారం అందించి. 126 బంతుల్లో 47 పరుగులు చేసి భారత్ స్కోరును 400 పరుగులు దాటేలా చేసింది. రిచా ఘోష్ 52 ప‌రుగుల‌తో రాణించింది. రోడ్రిగ్స్ 73 ప‌రుగులు చేసింది. 
 

45

టెస్టు మ్యాచ్ ల్లో భారత్ తొలి ఇన్నింగ్స్ లో 400+ స్కోరు చేయడం ఇది రెండోసారి. గత టెస్టులో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ తో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 428 పరుగులు చేసింది. ఆ మ్యాచ్ లో నలుగురు భారత బ్యాట్స్ మెన్ హాఫ్ సెంచరీలు సాధించి మ్యాచ్ కు టోన్ సెట్ చేశారు. రెండు ఇన్నింగ్స్ ల్లోనూ భారత బౌలర్లను ఎదుర్కోవడంలో విఫలమైన ఇంగ్లండ్ రెండు ఇన్నింగ్స్ ల్లో 136, 131 పరుగులకే ఆలౌటైంది.

55

ప్ర‌స్తుత టెస్టు మ్యాచ్ లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 219 పరుగులు చేసింది. బౌలర్లలో ఫాస్ట్ బౌలర్ పూజా వక్స్ట్రాకర్ 4 వికెట్లు పడగొట్టింది. ఆస్ట్రేలియా జట్టులో ఆఫ్ స్పిన్నర్ ఆష్లే గార్డనర్ 4 వికెట్లు తీసింది. మూడో రోజు లంచ్ బ్రేక్ స‌మయానికి ఆస్ట్రేలియా  రెండో ఇన్నింగ్స్ లో 63/2 (17) ప‌రుగులు చేసింది. భార‌త్ తొలి ఇన్నింగ్స్ లో 406 పరుగులు చేసింది. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Meha Patel : ఎవరీ మెహా పటేల్? అక్షర్ పటేల్ భార్య ఏం చేస్తారో తెలుసా?
Recommended image2
T20 World Cup: ఫైనల్‌కు వచ్చేది ఆ జట్టే.. తాట తీస్తారు కాచుకోండి.! ఇది పే..ద్ద వార్నింగే
Recommended image3
IND vs ENG : సెమీస్‌లో భారత్‌కు అసలైన ముప్పు.. ఎవడ్రా వీడు ఇలా ఉన్నాడు !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved