INDvsSL: టాస్ గెలిచిన శ్రీలంక జట్టు... పూర్తి జట్టుతో బరిలో టీమిండియా...
శ్రీలంక, టీమిండియా మధ్య జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక జట్టు, ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత జట్టు చరిత్రలో మొట్టమొదటిసారిగా రిజర్వు బెంచ్‌లో ఎవ్వరూ లేకుండా పూర్తి జట్టుతో బరిలో దిగుతోంది.
కృనాల్ పాండ్యాకి కరోనా పాజిటివ్ రావడం, అతనితో క్లోజ్ కాంటాక్ట్ ఉన్న 8 మందిని కూడా ఐసోలేషన్‌కి తరలించడంతో భారత జట్టు 9 మంది ప్లేయర్లు లేకుండా రెండో టీ20 బరిలో దిగుతోంది.
శ్రీలంక టూర్‌కి ఎంపికైన 20 మంది ప్లేయర్లలో 9 మంది మిస్ కాగా, మిగిలిన 11 మందితో రెండో టీ20 మ్యాచ్ ఆడబోతోంది భారత జట్టు...
శిఖర్ ధావన్, దేవ్‌దత్ పడిక్కల్, సంజూ శాంసన్, నితీశ్ రాణా, రుతురాజ్ గైక్వాడ్ మాత్రమే భారత జట్టులో బ్యాట్స్‌మెన్లు... మిగిలిన ఆరుగురు బౌలర్లే...
దేవ్‌దత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, నితీశ్ రాణా, చేతన్ సకారియా నేటి మ్యాచ్ ద్వారా టీ20 ఆరంగ్రేటం చేయబోతున్నారు...
వీరిలో నితీశ్ రాణా, చేతన్ సకారియా వన్డేల్లో ఎంట్రీ ఇవ్వగా దేవ్‌దత్ పడిక్కల్, రుతురాజ్‌లకు ఇదే మొట్టమొదటి అంతర్జాతీయ మ్యాచ్...
మనీశ్ పాండే, హార్ధిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, పృథ్వీషా వంటి బ్యాట్స్‌మెన్లు కూడా ఐసోలేషన్‌లో ఉన్నవారిలో ఉండడంతో భారత బ్యాటింగ్ విభాగం వీక్‌గా కనిపిస్తోంది...
భారత జట్టు: శిఖర్ ధావన్, దేవ్‌దత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, నితీశ్ రాణా, సంజూ శాంసన్, చేతన్ సకారియా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహార్, నవ్‌దీప్ సైనీ
శ్రీలంక జట్టు: ఆవిష్క ఫెర్నాండో, మినోద్ భనుక, ధనంజయ డి సిల్వ, సదీరా సమరవిక్రమ, ధనుస్ శనక, రమేష్ మెండీస్,వానిందు హసరంగ, చమిత్ కరుణరత్నే, ఉదాన, అఖిల ధనంజయ, చమీరా