INDvsSL 1st T20: టాస్ గెలిచిన శ్రీలంక... పృథ్వీషా, వరుణ్ చక్రవర్తిలకు ఛాన్స్...
శ్రీలంక, ఇండియా మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన లంక జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ ద్వారా ఇద్దరు ప్లేయర్లు టీ20 ఆరంగ్రేటం చేయనున్నారు.
శ్రీలంక టూర్‌లో వన్డే సిరీస్‌ను సొంతం చేసుకున్న శిఖర్ ధావన్ టీం, టీ20 సిరీస్‌లో విజయంతో ఆరంభించాలని భావిస్తుంటే, ఆఖరి వన్డేలో అద్భుత విజయం సాధించిన లంక జట్టు టీ20 సిరీస్‌ను పాజిటివ్ ఎనర్జీతో మొదలెట్టాలని చూస్తోంది.
ఈ మ్యాచ్ ద్వారా భారత జట్టు తరుపున పృథ్వీషా, స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి టీ20ల్లో ఆరంగ్రేటం చేస్తున్నారు.
పృథ్వీషా ఇప్పటికే టెస్టు, వన్డే మ్యాచులు ఆడగా, వరుణ్ చక్రవర్తికి ఇదే మొట్టమొదటి అంతర్జాతీయ మ్యాచ్...
శ్రీలంక జట్టు: ఆవిష్క ఫెర్నాండో, మినోద్ భనుక, ధనంజయ డి సిల్వ, చరిత్ అసలంక, ధనుస్ శనక, అసెన్ బండారా,వానిందు హసరంగ, చమిత్ కరుణరత్నే, ఉదాన, అఖిల ధనంజయ, చమీరా
భారత జట్టు: శిఖర్ ధావన్, పృథ్వీషా, ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా, సంజూ శాంసన్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహార్, చాహాల్, వరుణ్ చక్రవర్తి.