- Home
- Sports
- Cricket
- INDvsENG 3rd Test: ఎట్టకేలకు టాస్ గెలిచిన విరాట్ కోహ్లీ... మరోసారి రవి అశ్విన్‌కి....
INDvsENG 3rd Test: ఎట్టకేలకు టాస్ గెలిచిన విరాట్ కోహ్లీ... మరోసారి రవి అశ్విన్‌కి....
ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టులో టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు... ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరిగిన లార్డ్స్ టెస్టు తర్వాత జరుగుతున్న టెస్టు మ్యాచ్ కావడంతో లీడ్స్ టెస్టుపై భారీ అంచనాలు ఉన్నాయి...

లార్డ్స్ టెస్టులో ఘోర పరాజయం తర్వాత తుది జట్టులో మరోసారి మార్పులు చేసింది ఇంగ్లాండ్. డామ్ సిబ్లీ వరుసగా ఫెయిల్ అవుతుండడంతో అతని స్థానంలో నెం.1 టీ20 బ్యాట్స్‌మెన్ డేవిడ్ మలాన్‌కి తుదిజట్టులో చోటు కల్పించింది..
అలాగే రెండో టెస్టులో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ స్థానంలో క్రేగ్ ఓవర్‌టన్‌కి అవకాశం దక్కింది...
మూడో టెస్టులో రవిచంద్రన్ అశ్విన్‌కి చోటు దక్కుతుందని ప్రచారం జరిగినా... రెండో టెస్టులో ఆడిన టీమ్‌నే కొనసాగిస్తున్నట్టు ప్రకటించాడు విరాట్ కోహ్లీ...
ఇంగ్లాండ్‌లో గత 8 టెస్టుల్లో టాస్ ఓడిపోయిన విరాట్ కోహ్లీ, ఎట్టేకేలకు టాస్ గెలిచాడు. టాస్ గెలవడం తనకి కూడా సర్‌ప్రైజింగ్‌గా ఉందని కామెంట్ చేశాడు కోహ్లీ..
భారత జట్టు: రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, ఛతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ, అజింకా రహానే, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, జస్ప్రిత్ బుమ్రా
ఇంగ్లాండ్ జట్టు: రోరీ బర్న్స్, హసీబ్ హమీద్, డేవిడ్ మలాన్, జో రూట్, జానీ బెయిర్ స్టో, మొయిన్ ఆలీ, జోస్ బట్లర్, సామ్ కుర్రాన్, క్రీగ్ ఓవర్‌టన్, ఓల్లీ రాబిన్‌సన్, జేమ్స్ అండర్సన్.