ఇదే కరెక్ట్ టైమ్... ఐపీఎల్‌లో మార్పులు చేయాలి... రాహుల్ ద్రావిడ్ కామెంట్!

First Published 15, Nov 2020, 10:51 AM

IPL 2020 సీజన్ సూపర్ సక్సెస్ అయ్యింది. కరోనా విపత్కర పరిస్థితులను ఎదుర్కొని, యూఏఈలో నిర్వహించిన 2020, 13వ సీజన్‌ మ్యాచులు చూడడానికి మ్యాచులు రాకపోయినా టీవీల్లో, మొబైల్ యాప్‌ల్లో రికార్డు వ్యూయర్‌షిప్ వచ్చింది. దీంతో వచ్చే సీజన్ నుంచి ఐపీఎల్‌లో మార్పులు చేయాలని అంటున్నాడు ‘ది గ్రేట్ వాల్’ రాహుల్ ద్రావిడ్.

‘ఐపీఎల్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రతీ యేటా ఇండియన్ ప్రీమియర్ లీగ్ వీక్షకుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రతిభపరంగా చూస్తే ఐపీఎల్‌ను విస్తరించాల్సిన సమయం వచ్చింది... ’ అన్నాడు రాహుల్ ద్రావిడ్.

‘ఐపీఎల్‌లో వచ్చే సంఖ్య పెంచితే, మరింత మంది యువకులకు అవకాశం లభిస్తుంది... తమ టాలెంట్ చూపించడానికి ఎక్కువమందికి ఛాన్స్ దొరుకుతుంది... లీగ్‌ క్వాలిటీ మిస్ కాకుండా మరిన్ని జట్లను చేర్చాల్సిన సమయం వచ్చింది...’ అంటూ చెప్పుకొచ్చాడు ద్రావిడ్.

సత్తా ఉన్న యంగ్ క్రికెటర్లను రంజీలకు ఎంపిక చేయాలంటే... రాష్ట్రాల క్రికెట్ బోర్డులపై ఆధారపడాల్సి ఉంటుంది.. ఇంతకుముందు టాలెంట్ ఉన్నా, అవకాశం దొరకబుచ్చుకోవడం చాలా కష్టంగా ఉండేది...

కానీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. టాలెంట్ ఉంటే చాలు, కోట్లు పెట్టి కొనుగోలు చేయడానికి ప్రాంఛైజీలు సిద్ధపడుతున్నాయి...

కోచ్‌లు కూడా ఆటగాళ్లకు కొంతవరకే సహకరించగలరు, కానీ సీనియర్లతో కలిసి ఆడితేనే ఆ అనుభవం యువ ఆటగాళ్లకు చాలా నేర్చుకునే అవకాశం లభిస్తుంది..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆరంగ్రేటం చేసిన దేవ్‌దత్ పడిక్కల్... మొట్టమొదటి సీజన్‌లోనే అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. దీనికి కారణం సీనియర్ బ్యాట్స్‌మెన్ ఏబీ డివిల్లియర్స్, విరాట్ కోహ్లీ అనుభవంతో నేర్పిన పాఠాలే...

మిగిలిన చాలా మంది ప్లేయర్లు ఐపీఎల్ 2020 సీజన్‌లో సత్తా చాటారు. ఈ అనుభవం భారత జట్టు తరుపున ఆడేందుకు ఉపయోగపడుతుంది...

ఇంతకుముందు చాలామంది యువ క్రికెటర్లు ఐపీఎల్‌లో రాణించి, భారత జట్టుకి ఎంపికయ్యారు... ఈ సీజన్‌లో నటరాజన్ కూడా అలాగే ఆసీస్ టూర్‌లో ఆడబోతున్నాడు... ’ అంటూ చెప్పాడు ద్రావిడ్.

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఐదుసార్లు టైటిల్ నిలిచిన ముంబై ఇండియన్స్‌ను అభినందించిన రాహుల్ ద్రావిడ్... టాప్ క్లాస్ ఆటగాళ్లతో నిండిన ముంబై ఇండియన్స్ చాలా పటిష్టంగా కనిపిస్తోందన్నారు.

ఐపీఎల్ 2021 మెగా వేలం వచ్చే ఏడాది ప్రారంభంలో జరగబోతోంది... ఈ మెగా వేలంలో ఇద్దరు విదేశీ క్రికెటర్లు, ముగ్గురు స్వదేశీ క్రికెటర్లు తప్ప మిగిలిన ప్లేయర్లను వేలానికి విడుదల చేయాల్సి ఉంటుంది అన్ని ప్రాంఛైజీలు.

2021 సీజన్‌లో అదనంగా ఒకటి లేదా రెండు జట్లను జత చేయాలని ఆలోచనలో ఉంది బీసీసీఐ. అహ్మదాబాద్ మరియు కేరళ రాష్ట్రానికి చెందిన సిటీకి చెందిన జట్లు ఎంటర్ చేయబోతున్నట్టు టాక్ వినబడుతోంది.