MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఫ్లింటాఫ్ ఆ మాట అనగానే, సిక్సర్లు కొట్టాలని ఫిక్స్ అయ్యా... యువరాజ్ సింగ్ స్పెషల్ ఇన్నింగ్స్‌కి కారణమిదే...

ఫ్లింటాఫ్ ఆ మాట అనగానే, సిక్సర్లు కొట్టాలని ఫిక్స్ అయ్యా... యువరాజ్ సింగ్ స్పెషల్ ఇన్నింగ్స్‌కి కారణమిదే...

యువరాజ్ సింగ్ అనగానే అందరికీ గుర్తొచ్చేది 2007 టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో ఇంగ్లాండ్‌పై స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో బాదిన సిక్సర్ల విధ్వంసమే. టీ20ల్లో సంచలన ఇన్నింగ్స్‌గా గుర్తింపు తెచ్చుకున్న యువీ  సిక్సర్ల మోత వెనకాల చాలా పెద్ద కథే ఉంది...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Dec 12 2021, 01:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

2007 టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్ జట్టుకి ఆండ్రూ ఫ్లింటాఫ్ కెప్టెన్‌గా వ్యవహారించిన విషయం తెలిసిందే. అప్పటికే ముంబైలో మ్యాచ్ విజయం తర్వాత షర్ట్ విప్పి, తిరిగి వార్తల్లో నిలిచాడు ఆండ్రూ ఫ్లింటాఫ్...

210

ఈ సంఘటన కారణంగా లార్డ్ టెస్టులో బారత జట్టు విజయం తర్వాల లార్డ్స్ బాల్కనలో చొక్కా విప్పి, సెలబ్రేట్ చేసుకున్నాడు సౌరవ్ గంగూలీ... నోటి దురుసు ఎక్కువగా ఉండే ఫ్లింటాఫ్, యువరాజ్ సింగ్‌ని 2007 టీ20 వరల్డ్‌ కప్ టోర్నీలో యువరాజ్ సింగ్‌ని సెడ్జింగ్ చేశాడు. 

310

అప్పటికే యంగ్ మెషిన్ గన్‌గా పేరొందిన వీరిద్దరూ గొడవ పడడం టీవీల్లో కూడా కనిపించింది...ఈ సంఘటన తర్వాతే గేర్ మార్చిన యువరాజ్ సింగ్, స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఆరుకి ఆరు సిక్సర్లు బాది సంచలనం క్రియేట్ చేశాడు. ఫ్లింటాఫ్, తనతో ఏమన్నాడో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు యువీ...

410

‘ఫ్లింటాఫ్ బౌలింగ్‌లో రెండు ఫోర్లు కొట్టా. ఆ షాట్స్‌తో అతను తీవ్ర అసహనానికి గురయ్యాడు. లాస్ట్ బాల్ వేసిన తర్వాత నడుచుకుంటూ వెళుతూ నన్ను సెడ్జింగ్ చేశాడు... చెత్త షాట్స్ ఆడావు... అంటూ హేళన చేశాడు...

510

ఆ మాటకు నాకు కోపం వచ్చింది. నేను కూడా గట్టిగా బదులు ఇచ్చా. అంతే మా ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఫ్లింటాఫ్, చాలా కోపంగా నీ గొంతు కోస్తానంటూ బెదిరించాడు. నేను నా బ్యాటుని చూపించి, దీంతో నిన్ను ఎక్కడ కొడతానో నీకు బాగా తెలుసు అంటూ సమాధానం ఇచ్చా...

610

ఈ సంఘటన తర్వాతే నా పవర్ ఏంటో చూపించాలనుకున్నా. ఆ తర్వాతే స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌కి వచ్చాడు. ప్రతీ బంతినీ స్టేడియం బయటపడేయాలని కసిగా బాదాను... నిజానికి ఆ రోజు నేను ఆడిన షాట్స్‌లో కొన్ని నా కెరీర్‌లో ఎప్పుడూ ఆడనివి....

710

స్టువర్ట్ బ్రాడ్‌కి అప్పటికీ పెద్దగా అనుభవం లేదు. అయితే నన్ను కంట్రోల్ చేయడానికి అతను చాలా ప్రయత్నించాడు. యార్కర్లు వేసినా సరే, నేను వాటిని సిక్సర్లుగా మలచగలిగా....

810

ఆఖరి బంతిని కూడా సిక్సర్‌గా మలిచిన తర్వాత ఫ్లింటాఫ్ వైపు చూసి ఓ నవ్వు నవ్వాను. అప్పటికే అతని ముఖం మాడిపోయి ఉంది.... నేను అలా ఆడతానని అతను అస్సలు ఊహంచలేదు. నిజానికి నేను కూడా ఆ ఇన్నింగ్స్ ఊహించలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు యువరాజ్ సింగ్...

910

ఇంగ్లాండ్‌పై 12 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదిన యువరాజ్ సింగ్, క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన అర్ధశతకాన్ని నమోదుచేశాడు. ఇప్పటికీ ఆ రికార్డు చెక్కుచెదరలేదు...

1010

యువరాజ్ సింగ్ విధ్వంసం సృష్టించడంతో భారత్ 20 ఓవర్లలో 218 పరుగుల భారీ స్కోరు చేసింది. 219 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 200 పరుగులు చేయగలిగింది. భారత జట్టు 18 పరుగుల తేడాతో గెలిచింది.

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Priya Saroj : రింకూ సింగ్ కు కాబోయే భార్య.. ఎవరీ ప్రియా సరోజ్, ఎంత తోపో తెలుసా..?
Recommended image2
IND vs ZIM : చెన్నైలో ఇండియా-జింబాబ్వే మ్యాచ్... వర్షం ముప్పు పొంచివుందా..?
Recommended image3
Team India semi final chances : రన్ రేట్ పంచాయితే ఉండదు.. టీమిండియా సెమీస్ కు చేరే ఏకైక మార్గమిదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved