- Home
- Sports
- Cricket
- ఏడేళ్లు వేచి, నిరాశగా వీడ్కోలు... అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన శ్రీశాంత్...
ఏడేళ్లు వేచి, నిరాశగా వీడ్కోలు... అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన శ్రీశాంత్...
టీమిండియాలోకి సంచలనంలా ఎంట్రీ ఇచ్చి, వివాదాల్లో ఇరుక్కున్న శ్రీశాంత్... అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. 2007లో టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు శ్రీశాంత్...

2005, అక్టోబర్ 25న శ్రీలంకతో జరిగిన వన్డే ద్వారా అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన శ్రీశాంత్, ఆ తర్వాత ఏడాది టెస్టు, టీ20ల్లో ఎంట్రీ ఇచ్చాడు...
తన కెరీర్‌లో 27 టెస్టులు ఆడిన శ్రీశాంత్, 87 వికెట్లు పడగొట్టాడు. మూడుసార్లు ఐదేసి వికెట్లు తీశాడు. వన్డేల్లో 53 మ్యాచుల్లో 75 వికెట్లు తీశాడు. 10 టీ20 మ్యాచుల్లో 7 వికెట్లు తీశాడు...t
టీ20 వరల్డ్ కప్ 2007లో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆసీస్ ఓపెనర్లు ఆడమ్ గిల్‌క్రిస్ట్, మాథ్యూ హేడెన్‌లను పెవిలియన్ చేర్చాడు శ్రీశాంత్...
పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో బౌలింగ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ మిస్బా వుల్ హక్ ఇచ్చిన క్యాచ్‌ను అందుకుని, భారత్‌కి విజయాన్ని అందించాడు శ్రీశాంత్...
ఐపీఎల్ ద్వారా ఎందరో స్టార్లు వెలుగులోకి వస్తే, టీమిండియాలో స్టార్‌గా ఎదుగుతున్న శ్రీశాంత్ కెరీర్ మాత్రం తీవ్ర వివాదాల్లో ఇరుక్కుంది...
2008లో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ పూర్తయిన తర్వాత హర్భజన్ సింగ్ చెంప దెబ్బ కొట్టడంతో శ్రీశాంత్ కన్నీళ్లు పెట్టుకోవడం... ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వివాదాస్పదమైన సంఘటనగా నిలిచిపోయింది.
2013లో రాజస్థాన్ రాయల్స్ టీమ్‌మేట్స్ అజిత్ చంఢీలా, అంకిత్ ఛావన్‌లతో కలిసి శ్రీశాంత్ స్పాట్ ఫిక్సింగ్‌కి పాల్పడినట్టు ఆరోపణలు రావడం.. క్రికెట్ ప్రపంచంలో సంచలనం క్రియేట్ చేసింది...
స్పాట్ ఫిక్సింగ్ కేసు కారణంగా ఏడేళ్ల పాటు క్రికెట్‌కి దూరమైన శ్రీశాంత్, 2021 జనవరిలో సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీ ద్వారా రీఎంట్రీ ఇచ్చాడు...
ఐపీఎల్ 2021 సీజన్, ఐపీఎల్ 2022 సీజన్ వేలానికి శ్రీశాంత్ తన పేరు రిజిస్టర్ చేయించుకున్నప్పటికీ షార్ట్ లిస్టులో చోటు దక్కించుకోలేకపోయాడు...
39 ఏళ్ల వయసులోనూ టీమిండియాలోకి తిరిగి రీఎంట్రీ ఇస్తానని ఆశాభావం వ్యక్తం చేసిన శ్రీశాంత్, సోషల్ మీడియా ద్వారా రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు...
‘భావి క్రికెటర్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో దేశవాళీ క్రికెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నాను. ఇది పూర్తిగా నా నిర్ణయం. ఈ నిర్ణయం నాకు బాధను కలిగించినా, ఇక తప్పదని తెలుసుకున్నా...’ అంటూ కామెంట్ చేశాడు శ్రీశాంత్..
తనపై బ్యాన్ పడిన ఏడేళ్ల కాలంలో అటు సినిమాలు, ఇటు రియాల్టీ షోలు, డ్యాన్స్ షోలు, రాజకీయాలు అంటూ అన్ని రంగాల్లోనూ ప్రయత్నాలు చేశాడు శ్రీశాంత్...
హిందీలో రెండు సినిమాలు, మలయాళం, కన్నడలో రెండు సినిమాలు చేసిన శ్రీశాంత్, ‘బిగ్‌బాస్ 12’ సీజన్‌లో రన్నరప్‌గా నిలిచాడు..
సౌతాఫ్రికాతో జరిగిన టెస్టులో ఫాస్ట్ బౌలర్ ఆండ్రూ నిల్ బౌలింగ్‌లో సిక్సర్ బాదిన తర్వాత అతని ముందుకు వచ్చి శ్రీశాంత్ వేసిన డ్యాన్స్... క్రికెట్ ఫ్యాన్స్ అందరిలో చిరస్మరణీయంగా గుర్తుండిపోతుంది...
2011లో చివరిసారిగా టీమిండియా తరుపున చివరి టెస్టు మ్యాచ్ ఆడిన శ్రీశాంత్, 11 ఏళ్ల సుదీర్ఘ ఎదురుచూపుల తర్వాత క్రికెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు.