- Home
- Sports
- Cricket
- వాలెంటైన్స్ డే ఎంజాయ్ చేస్తున్న క్రికెటర్లు... కెఎల్ రాహుల్. అశ్విన్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా...
వాలెంటైన్స్ డే ఎంజాయ్ చేస్తున్న క్రికెటర్లు... కెఎల్ రాహుల్. అశ్విన్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా...
విశ్వమంతా వ్యాపించిన ప్రేమకి సంవత్సరంలో ఒకే ఒక్క రోజు కేటాయించడం ఏ మాత్రం సరిపోదేమో. ప్రేమికుల రోజున ప్రేయసికి, లేదా ప్రేమికుడికి తన ప్రేమని మరోసారి వ్యక్తం చేయాలని తాపత్రయపడతారు.. దీనికి క్రికెటర్లు కూడా మినహాయింపు కాదు. వాలెంటైన్స్ డే సందర్భంగా సోషల్ మీడియా ద్వారా తన ప్రేయసికి, భార్యకి ప్రేమగా విషెస్ తెలిపారు మన క్రికెటర్లు...

వాలెంటైన్స్ డే కావడం, భారత క్రికెటర్లకి కావాల్సిన బ్రేక్ దొరకడంతో భార్య, ప్రేయసిలతో దిగిన రొమాంటిక్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసి, తమ ప్రేమను మరోసారి వ్యక్తం చేశారు భారత క్రికెటర్లు...
ప్రేమికుల రోజు సందర్భంగా విషెస్ తెలుపుతూ భార్యతో దిగిన ఫోటోను పోస్టు చేసిన భారత క్రికెటర్, తెలుగు క్రికెటర్ కోన శ్రీకర్ భరత్...
వాలెంటైన్స్ డే సందర్భంగా భారత యంగ్ ఆల్‌రౌండర్, చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ దీపక్ చాహార్‌తో ఆయన గర్ల్ ఫ్రెండ్ జయ భరద్వాజ్...
వాలెంటైన్స్ డే సందర్భంగా భారత యంగ్ ఆల్‌రౌండర్, పంజాబ్ కింగ్స్ ప్లేయర్ రాహుల్ చాహార్‌తో ఆయన గర్ల్ ఫ్రెండ్ ఇషానీ...
వాలెంటైన్స్ డే సందర్భంగా భార్య నటాశాతో రొమాంటిక్ ఫోటో షేర్ చేసిన భారత ఆల్‌రౌండర్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా...
వాలెంటైన్స్ డే సందర్భంగా భారత సీనియర్ పేసర్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ప్లేయర్ ఉమేశ్ యాదవ్, ఆయన భార్య తాన్యా...
వాలెంటైన్స్ డే సందర్భంగా భారత ఆల్‌రౌండర్, లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయర్ కృనాల్ పాండ్యా, ఆయన భార్య పంకూరీ శర్మ..
వాలెంటైన్స్ డే సందర్భంగా భారత ఓపెనర్, పంజాబ్ కింగ్స్ ప్లేయర్ మయాంక్ అగర్వాల్‌తో ఆయన భార్య ఆశితా సూద్...
వాలెంటైన్స్ డే సందర్భంగా భార్య ప్రీతిని కౌగిలించుకుని రొమాంటిక్ ఫోటో పోస్టు చేసిన భారత సీనియర్ ఆల్‌రౌండర్, రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్...
వాలెంటైన్స్ డే సందర్భంగా కాబోయే సతీమణి మేహాతో రొమాంటిక్ ఫోటో షేర్ చేసిన భారత యంగ్ ఆల్‌రౌండర్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ అక్షర్ పటేల్..
వాలెంటైన్స్ డే సందర్భంగా గర్ల్‌ఫ్రెండ్ అథియా శెట్టితో కనిపించీ, కనిపించకుండా ఫోటో షేర్ చేసిన భారత ఓపెనర్, లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కెఎల్ రాహుల్...
వాలెంటైన్స్ డే సందర్భంగా భార్య దేవిశా శెట్టితో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన భారత క్రికెటర్, ముంబై ఇండియన్స్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్...