ఏడాదంతా బాదుడే... క్రికెట్ ఫ్యాన్స్‌కి పండగే పండగ... 2021లో టీమిండియా ఫుల్లు బిజీ...

First Published Jan 6, 2021, 4:08 PM IST

కరోనా వైరస్ కారణంగా టీమిండియాకి దాదాపు ఏడు నెలల విశ్రాంతి లభించింది. లాక్‌డౌన్‌తో సర్వం నిలిచిపోవడంతో క్రికెటర్లు ఇంటికే పరిమితమయ్యారు. విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యా లాంటి కొందరు ఈ లాక్‌డౌన్‌ని సరిగ్గా వాడుకుంటే, మరికొందరు ఇంట్లో పనులు చేస్తూ, టిక్‌టాక్ వీడియోలు చేస్తూ గడిపేశారు. అయితే ఈ ఏడాది అలా కాదు, సిరీస్ తర్వాత సిరీస్‌లతో 2021లో ఫుల్లు బిజీగా గడపబోతోంది టీమిండియా.

రేపటి నుంచి (జనవరి 7) ఆస్ట్రేలియాతో మూడో టెస్టు ఆడబోతున్న టీమిండియా, సంక్రాంతి తర్వాత (జనవరి 15) నాలుగో టెస్టు ఆడుతంది.

ఈ రెండు టెస్టులతో టీమిండియా సుదీర్ఘ ఆసీస్ టూర్ ముగుస్తుంది... ఆ తర్వాత భారత జట్టు స్వదేశానికి రానుంది...

జస్ప్రిత్ బుమ్రా, నటరాజన్, జడేజా, అశ్విన్ వంటి క్రికెటర్లు దాదాపు ఐదు నెలల తర్వాత స్వదేశానికి రానున్నారు. సెప్టెంబరులో మొదలైన ఐపీఎల్ కోసం యూఏఈ వెళ్లిన వీళ్లు, అటు నుంచి ఆసీస్ టూర్‌కి వెళ్లిన సంగతి తెలిసిందే.

ఆస్ట్రేలియా నుంచి వచ్చిన తర్వాత 15 రోజుల గ్యాప్‌లో ఇంగ్లాండ్‌తో సుదీర్ఘ స్వదేశీ టూర్ మొదలు కానుంది...

శ్రీలంక టూర్ ముగించుకుని ఇండియాకి వచ్చే ఇంగ్లాండ్ జట్టు, టీమిండియాతో నాలుగు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచులు ఆడనుంది...

ఫిబ్రవరి 5న మొదటి టెస్టుతో మొదలయ్యే ఇంగ్లాండ్ టూర్ ముగిసేసరికి మార్చి నెల పూర్తి అవుతుంది. మార్చి 28న ఇంగ్లాండ్, ఇండియా మధ్య చివరి వన్డే జరుగుతుంది.

షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ ప్రారంభంలోనే ఐపీఎల్ ప్రారంభం కానుంది. మూడు రోజులు కూడా విశ్రాంతి తీసుకోకుండా ఐపీఎల్ సీజన్ 14కి రెఢీ అవుతారు భారత క్రికెటర్లు...

ఐపీఎల్ ముగిసిన తర్వాత జూన్‌లో శ్రీలంక టూర్‌కి వెళ్లనుంది టీమిండియా. అక్కడ మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచులు ఆడబోతోంది భారత క్రికెట్ జట్టు...

శ్రీలంకతో సిరీస్ ముగిసిన తర్వాత లంక వేదికగానే ఆసియా కప్ ప్రారంభం కానుంది. జూలైలో జరిగే ఈ టోర్నీలో పాక్, ఆఫ్ఘాన్, బంగ్లా, శ్రీలంకలతో తలబడనుంది టీమిండియా...

ఆసియా కప్ 2021 ముగిసిన తర్వాత జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది టీమిండియా. 2016లో జింబాబ్వేతో సిరీస్ ఆడిన టీమిండియా, ఐదేళ్ల తర్వాత మళ్లీ ఆ జట్టుతో తలబడనుంది.

జింబాబ్వే టూర్ నుంచి ఇంగ్లాండ్ టూర్‌కి వెళ్తుంది భారత జట్టు. ఆగస్టు 4 నుంచి మొదలయ్యే ఈ టూర్‌లో ఐదు టెస్టులు ఆడుతుంది భారత జట్టు...

ఇంగ్లాండ్ టూర్ నుంచి వచ్చిన తర్వాత దక్షిణాఫ్రికాతో స్వదేశంలో మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచులు ఆడబోతోంది భారత క్రికెట్ టీమ్...

దక్షిణాఫ్రికా సిరీస్ ముగిసిన తర్వాత పెద్దగా విశ్రాంతి లేకుండానే టీ20 ప్రపంచకప్ మొదలుకానుంది. ఈ ఏడాది అక్టోబర్‌లో మొదలయ్యే ఈ టోర్నీకి ఇండియానే ఆతిథ్యం ఇవ్వనుంది.

టీ20 వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత న్యూజిలాండ్‌తో సిరీస్ మొదలవుతుంది. స్వదేశంలో కివీస్‌తో రెండు టెస్టులు, మూడు టీ20 మ్యాచుల సిరీస్ ఆడుతుంది టీమిండియా...

ఆ తర్వాత డిసెంబర్‌లో సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది టీమిండియా... దక్షిణాఫ్రికాలో మూడు టెస్టులు, టీ20 సిరీస్ ఆడుతుంది భారత జట్టు...

ఇంత బిజీ షెడ్యూల్‌ నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలు చేస్తోంది. ఈ మధ్యలో టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ కూడా వచ్చే అవకాశం ఉంది...

నిజానికి ఈ ఏడాది జూన్‌ 14న టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరగాలి. కానీ కరోనా బ్రేక్ కారణంగా గత ఏడాది పెద్దగా మ్యాచులు జరగలేదు. కాబట్టి టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ను వాయిదా వేసే అవకాశమూ లేకపోలేదు.

టెస్టు ఛాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న టీమిండియా, ఇదే పొజిషన్‌ను మరో ఆరు నెలలు కాపాడుకోగలిగితే టాప్‌లో ఉన్న ఆస్ట్రేలియా లేదా ప్రస్తుతం మూడో స్థానంలో న్యూజిలాండ్‌తో కలిసి ఫైనల్ ఆడే అవకాశం ఉంటుంది. న్యూజిలాండ్ మరో సిరీస్ గెలిస్తే రెండో స్థానానికి ఎగబాకుతుంది కాబట్టి కివీస్‌కి కూడా అవకాశం చాలా ఉంది.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?