MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Sports
  • Cricket
  • ఫాస్టెస్ట్ సెంచ‌రీ.. చ‌రిత్ర సృష్టించిన స్మృతి మంధాన

ఫాస్టెస్ట్ సెంచ‌రీ.. చ‌రిత్ర సృష్టించిన స్మృతి మంధాన

india women vs ireland women: స్మృతి మంధాన నేతృత్వంలోని భారత మహిళల జట్టు 304 పరుగుల తేడాతో ఐర్లాండ్‌ను ఓడించి మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకుంది. మూడో వ‌న్డేలో మంధాన, ప్రతీకా రావల్ సెంచరీలతో చెలరేగారు. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jan 15 2025, 10:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Image Credit: Getty Images

Image Credit: Getty Images

india women vs ireland women: ఐర్లాండ్ తో జ‌రిగిన వ‌న్డే సిరీస్ లో భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో దుమ్మురేపింది. 3వ వన్డేలో భారత మహిళలు 304 పరుగుల తేడాతో ఐర్లాండ్ మహిళలను ఓడించి 3-0తో వైట్‌వాష్ చేశారు.

స్మృతి మంధాన, ప్రతీకా రావల్ సెంచరీలతో చెలరేగడంతో భారత్‌ 435/5తో భారీ స్కోరు చేసింది. వన్డేల్లో భారత్ (పురుషుల జ‌ట్టు, మహిళల జ‌ట్టు) చేసిన అత్యధిక స్కోరు ఇదే. భారీ ఛేదనలో ఐర్లాండ్ 131 పరుగులకే ఆలౌటైంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఫాస్టెస్ట్ సెంచ‌రీ కొట్టిన స్మృతి మంధాన

స్మృతి మంధాన వన్డే చరిత్రలో భారత మహిళా బ్యాటింగ్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డును బుధవారం బద్దలుకొట్టింది. బుధవారం రాజ్‌కోట్‌లో ఐర్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో మంధాన 70 బంతుల్లో సెంచరీ చేసి హర్మన్‌ప్రీత్ కౌర్ పేరిట ఉన్న మునుపటి రికార్డును అధిగమించింది.

మహిళల వన్డేల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన రికార్డు ఆస్ట్రేలియా క్రీడాకారిణి మెగ్ లానింగ్ పేరిట ఉంది, ఈ మైలురాయిని చేరుకోవడానికి ఆమె 45 బంతులు ఆడింది. 

36
Smriti Mandhana

Smriti Mandhana

కెప్టెన్ గా సూప‌ర్ ఇన్నింగ్స్ ఆడిన స్మృతి మంధాన

రెగ్యులర్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ గైర్హాజరీలో మంధాన జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తూనే ఈ సిరీస్‌లో అద్భుతమైన ఫామ్ ను కొన‌సాగించారు. కెప్టెన్ గా ఉంటూ ఫాస్టెస్ సెంచ‌రీతో అద‌ర‌గొట్టారు. 

స్మృతి మంధాన 80 బంతుల్లో 12 ఫోర్లు, ఏడు సిక్సర్లతో 135 పరుగుల ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ ఆడింది. టాస్ గెలిచి భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్న తర్వాత ప్రతీకా రావల్‌తో కలిసి 233 పరుగుల భాగస్వామ్యాన్ని నెల‌కొల్పింది.

46
Smriti Mandhana, Pratika Rawal

Smriti Mandhana, Pratika Rawal

హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ రికార్డు బ్రేక్ చేసిన స్మృతి మంధాన

గత ఏడాది బెంగళూరులో దక్షిణాఫ్రికాపై హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ 87 బంతుల్లో సెంచరీ చేసింది. అది భార‌త మ‌హిళా వ‌న్డే క్రికెట్ లో ఫాస్టెస్ట్ సెంచ‌రీ. అయితే, బుధవారం స్మృతి మంధాన ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ హ‌ర్మ‌త్ ప్రీత్ ఫాస్టెస్ట్ సెంచ‌రీ రికార్డు బ‌ద్ద‌లు అయింది. మహిళల వన్డే చరిత్రలో భారత బ్యాటింగ్‌లో అత్యంత వేగవంతమైనన సెంచ‌రీని స్మృతి మంధాన సాధించింది.

మొత్తంమీద, మాజీ ఇంగ్లండ్ క్రికెటర్ షార్లెట్ ఎడ్వర్డ్స్‌తో కలిసి మహిళల వ‌న్డే క్రికెట్ లో మంధాన చేసిన సెంచరీ ఉమ్మడి-ఏడవ వేగవంతమైన సెంచ‌రీగా నిలిచింది.

56
Smriti Mandhana

Smriti Mandhana

కెరీర్ లో 10 సెంచ‌రీ కొట్టిన స్మృతి మంధాన

స్మృతి మంధాన త‌న వ‌న్డే క్రికెట్ కెరీర్ లో 10వ సెంచ‌రీ సాధించారు. స్మృతి మంధాన ఇంగ్లండ్‌కు చెందిన టామీ బ్యూమాంట్‌తో పాటు మహిళల వ‌న్డే క్రికెట్ లో అత్యధిక సెంచరీల ఆల్-టైమ్ జాబితాలో ఉమ్మడి మూడవ స్థానానికి చేరుకుంది.

ఈ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మెగ్ లానింగ్ (15), న్యూజిలాండ్‌కు చెందిన సుజీ బేట్స్ (13) అత్య‌ధిక సెంచ‌రీల వ‌న్డే ప్లేయ‌ర్ల జాబితాలో మొద‌టి రెండు స్థానాల్లో ఉన్నారు. 

66
Smriti Mandhana

Smriti Mandhana

అద్భుత‌మైన ఫామ్ లో స్మృతి మంధాన 

ఐర్లాండ్ తో జ‌రిగిన సిరీస్ మొత్తంగా స్మృతి మంధాన మంచి ఇన్నింగ్స్ ల‌ను ఆడారు. 28 ఏళ్ల ఈ ప్లేయ‌ర్ భార‌త్-ఐర్లాండ్ వ‌న్డే సిరీస్ లోని తొలి మ్యాచ్ లో 41 పరుగుల ఇన్నింగ్స్ ఆడారు. రెండో వన్డేలో 73 పరుగులు చేయడంతో భారత్ 2-0 ఆధిక్యంలో నిలిచింది.

నిరంజన్ షా స్టేడియంలో జరిగిన మూడో మ్యాచ్ లో అద్భుత విజ‌యంతో 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. భారత్‌ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. స్మృతి మంధాన, ప్ర‌తీకా రావల్ తొలి వికెట్‌కు డబుల్ సెంచరీతో కలిసి ఐరిష్ బౌలింగ్ ను చిత్తుచేశారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్

Latest Videos
Recommended Stories
Recommended image1
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image2
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Recommended image3
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved