- Home
- Sports
- Cricket
- ఆ ముగ్గురినీ ఎలా వాడుకోవాలో మాకు బాగా తెలుసు... టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రావిడ్..
ఆ ముగ్గురినీ ఎలా వాడుకోవాలో మాకు బాగా తెలుసు... టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రావిడ్..
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు టీమిండియా ఫ్యాన్స్‌ని భయపెడుతున్న విషయం భారత స్టార్ ప్లేయర్ల ఫామ్. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ ఇద్దరూ ఐపీఎల్ 2022 సీజన్‌లో అట్టర్ ఫ్లాప్ పర్ఫామెన్స్ ఇచ్చారు... సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ఆరంభానికి ముందు మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనికి గురించి వివరణ ఇచ్చాడు భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్...

Image Credit: PTI
ఐపీఎల్ 2022 సీజన్‌లో 600+ పరుగులు చేసిన కెఎల్ రాహుల్, ఆరెంజ్ క్యాప్ రేసులో జోస్ బట్లర్ తర్వాతి ప్లేస్‌లో నిలిచాడు. వరుసగా మూడు సీజన్లలో 600లకు పైగా పరుగులు చేసిన ఏకైక బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు కెఎల్ రాహుల్...
600లకు పైగా పరుగులు చేసినప్పటికీ కెఎల్ రాహుల్ బ్యాటింగ్ స్టైల్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో కూడా దూకుడు పెంచకుండా సేఫ్ గేమ్ ఆడి, ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు కెఎల్ రాహుల్...
Image credit: PTI
‘ఫామ్‌లో ఉన్నా లేకపోయినా మా టాప్ త్రీ ప్లేయర్ల క్వాలిటీ గురించి మాకు బాగు తెలుసు. వాళ్లు టాప్ క్లాస్ ప్లేయర్లు. అయితే సౌతాఫ్రికాతో జరిగే సిరీస్‌లో మా టాప్ త్రీ ఆర్డర్ మారింది...
Image credit: PTI
మేం పాజిటివ్ ఎనర్జీని సిరీస్‌ని ప్రారంభించాలని అనుకుంటున్నాం. పరిస్థితులకు తగ్గట్టుగా ఆడే వాళ్లు కావాలి. హై స్కోరింగ్ గేమ్ అయితే స్ట్రైయిక్ రేటు తగ్గకుండా చూసుకుంటూ బ్యాటింగ్ చేయాలి. వికెట్ బ్యాటింగ్‌కి సహకరించకపోతే సింగిల్స్ తీస్తూ స్ట్రైయిక్ రొటేట్ చేయాలి...
టీమ్‌లో ఉన్న ప్రతీ ఒక్కరికీ వారి రోల్‌పై క్లారిటీ ఇచ్చేశాం. తుది జట్టులోకి వచ్చిన ప్రతీ ఒక్కరూ తమ రోల్‌కి తగ్గట్టు రాణించడానికి సిద్ధమై ఉంటారు. కెఎల్ రాహుల్‌కి కెప్టెన్సీ కొత్తేమీ కాదు...
రోహిత్ శర్మ ఆల్ ఫార్మాట్ ప్లేయర్. అలాంటి ప్లేయర్లు ప్రతీ సిరీస్‌కి అందుబాటులో ఉండాలని కోరుకోవడం అత్యాశే అవుతుంది. అందుకే రోహిత్ శర్మకు ఈ సిరీస్‌లో విశ్రాంతినిచ్చాం...
Rahul Dravid
ఇంగ్లాండ్‌తో టెస్టు మ్యాచ్ ఆడబోతున్నాం. ఆ మ్యాచ్‌కి బెస్ట్ టీమ్ అందుబాటులో ఉండాలి. అందుకే కీలక ప్లేయర్లకు ఈ సిరీస్‌లో విశ్రాంతినిచ్చాం. అయితే టీ20 సిరీస్‌ని తేలిగ్గా తీసుకోవడం లేదు...’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్...