విరాట్ కోహ్లీ గాయంపై అనుమానాలు... బీసీసీఐపై ప్రతీకారం తీర్చుకునేందుకే...
సెంచూరియన్ టెస్టు గెలిచిన భారత జట్టు, జోహన్‌బర్గ్‌లో జరుగుతున్న రెండో టెస్టులో మొదటి రోజే తడబడింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ వెన్నునొప్పితో బరిలో దిగకపోవడంపై అభిమానులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు...

Virat Kohli
టీమిండియాలో మిగిలిన ప్లేయర్లతో పోలిస్తే విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ విషయంలో చాలా శ్రద్ధ చూపిస్తాడు. క్రీజులో ఫీల్డింగ్ చేస్తూ గాయపడినా, అలాగే కొనసాగిన సందర్భాలు కూడా కోకొల్లలు...
అలాంటి విరాట్ కోహ్లీ, మ్యాచ్ ఆరంభానికి ముందు గాయంతో బరిలో దిగకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.
రెండో టెస్టు ఆరంభానికి ముందు ఫిజియోతో కలిసి కనిపించిన విరాట్, మ్యాచ్ మొదలయ్యే గంట ముందే తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం...
అయితే చాలామంది టీమిండియా ఫ్యాన్స్ మాత్రం విరాట్ కోహ్లీ గాయంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిజంగా విరాట్‌కి గాయమైందా? లేక కావాలనే ఈ మ్యాచ్ నుంచి తప్పుకున్నాడా? అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు...
జోహన్‌బర్న్‌లో టెస్టు మ్యాచ్ ఆడి ఉంటే, కేప్ టౌన్‌లో 100వ టెస్టు ఆడేవాడు విరాట్ కోహ్లీ. అయితే స్వదేశంలో, అదీ సొంతిల్లు లాంటి బెంగళూరులో నూరో టెస్టు ఆడాలనే ఉద్దేశంతో రెండో టెస్టుకి దూరమయ్యాడంటున్నవాళ్లూ లేకపోలేదు...
విరాట్ కోహ్లీని వన్డే సిరీస్ నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. ఈ నిర్ణయం తర్వాత భారత క్రికెట్ బోర్డుకీ, విరాట్‌కీ మధ్య వైరం నడుస్తోందని టాక్...
అందుకే విరాట్, జోహన్‌బర్గ్ టెస్టు కావాలని తప్పుకున్నాడని, తను లేకపోతే టీమిండియా పరిస్థితి ఏంటో చూపించాలనే ఇలా నిర్ణయించుకున్నాడని ఆరోపిస్తున్నవాళ్లూ లేకపోలేదు...
అయితే ఫిట్‌నెస్ ఫ్రీక్‌గా గుర్తింపు పొందిన విరాట్ కోహ్లీని కొన్నాళ్లుగా వెన్నునొప్పి సమస్య వేధిస్తోందట. చాలాసార్లు క్రీజులోనే వెన్నుకి ఫిజియో ట్రీట్‌మెంట్ తీసుకుంటూ కనిపించాడు విరాట్...
రెండో టెస్టుకి ముందు నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాడని, అతను మంచి టచ్‌లో కనిపిస్తున్నాడని విరాట్ కోహ్లీ గురించి కామెంట్ చేశాడు టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్...
హెవీ ప్రాక్టీస్ కారణంగా విరాట్ కోహ్లీ వెన్ను నొప్పి మరింత తీవ్రమైందని, అందుకే ఆఖరి నిమిషాల్లో రెండో టెస్టు నుంచి తప్పుకున్నాడని సమాచారం...