MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • India vs South Africa: చెత్త రికార్డు.. ఆరుగురు భార‌త బ్యాట‌ర్స్ డకౌట్

India vs South Africa: చెత్త రికార్డు.. ఆరుగురు భార‌త బ్యాట‌ర్స్ డకౌట్

India vs South Africa Test : టీమిండియా మ‌రో చెత్త రికార్డును మూట‌క‌ట్టుకుంది. సౌతాఫ్రికాతో జరుగుతున్నటెస్టులో భార‌త్ బ్యాట‌ర్లు చేతులెత్తేయడంతో 153 పరుగులకే ఆలౌట్ అయింది.  భార‌త తొలి ఇన్నింగ్స్  చివ‌రి 11 బంతుల్లో ఒక్క ప‌రుగు కూడా చేయ‌కుండా ఏకంగా 6 వికెట్లు కోల్పోయింది.  

1 Min read
Author : Mahesh Rajamoni
Published : Jan 03 2024, 08:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

India vs South Africa 2nd Test: కేప్ టౌన్ లోని న్యూలాండ్స్ వేదిక‌గా జ‌రుగుతున్న భార‌త్ సౌతాఫ్రికా టెస్టులో ఒకే రోజు రెండు జ‌ట్లు తొలి ఇన్నింగ్స్ పూర్తి చేయ‌డంతో మ‌రో సంచ‌ల‌నం న‌మోదైంది. మ‌రీ ముఖ్యంగా తొలిరోజు ఇరు జ‌ట్ల బౌల‌ర్లు నిప్పులు చెరిగారు. దీంతో ప‌రుగులు చేయ‌డానికి బ్యాట‌ర్స్ తీవ్రంగా క‌ష్ట‌ప‌డ్డారు. అయితే, భార‌త్ మ‌రో చెత్త రికార్డును న‌మోదుచేసింది. భార‌త జ‌ట్టు తొలి ఇన్నింగ్స్ లో 153 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది.
 

24
ind vs sa

ind vs sa

భారత జట్టులోని ఆరుగురు ప్లేయర్లు 0 పరుగులకే ఔట్ అయి చెత్త రికార్డును నమోదుచేశారు. మ్యాచ్ చివరి 11 బంతుల్లో ఒక్క పరుగు కూడా చేయకుండా భారత్ 6 వికెట్లను కోల్పోయింది. ఒక్క పరుగు కూడా చేయని భారత ప్లేయర్లలో శ్రేయాస్ అయ్యార్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్, యశస్వి జైస్వాల్ ఉన్నారు. 
 

34

భారత జట్టుకు ఆరంభంలోనే దెబ్బ తగిలింది. మరోసారి ఒక్క పరుగు కూడా చేయకుండా యశస్వి జైస్వాల్ ఔట్ అయ్యి మరోసారి నిరాశపరిచాడు. అయితే, ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన రోహిత్ శర్మ 39 పరుగులు, శుభ్ మన్ గిల్ 36 పరుగులు, విరాట్ కోహ్లీ 46 పరుగులతో రాణించారు. 153 పరుగుల వరకు 4 వికెట్లు కోల్పోయిన భారత్ ఆ తర్వాత వచ్చిన భారత బ్యాటర్లు వరుసగా ఫెవిలియన్ బాట పట్టడంతో అదే స్కోర్ వద్ద భారత్ తన తొలి ఇన్నింగ్స్ ను ముగించింది. 
 

44
IND vs SA

IND vs SA

సౌతాఫ్రికా బౌలర్లలో కసిగో రబాడ, లుంగి ఎంగిడీ, నందే బర్గర్ లు తలా 3 వికెట్లు తీసుకున్నారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్ సౌతాఫ్రికా జట్టు 53 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 6 వికెట్లతో రాణించాడు. ముఖేష్ కుమార్, బుమ్రాలు తలా 2 వికెట్లు తీసుకున్నారు. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
రోహిత్ శర్మ
క్రీడలు
విరాట్ కోహ్లీ
Latest Videos
Recommended Stories
Recommended image1
Rajasthan Royals : షేన్ వార్న్ కుటుంబానికి రూ. 450 కోట్లు.. ఈ మాస్టర్ ప్లాన్ వెనుక అసలు లెక్క ఇదే !
Recommended image2
IPL లో 357 సిక్సర్లు, 6 సెంచరీలతో విధ్వంసం.. కానీ అన్ లక్కీ ప్లేయర్
Recommended image3
IPL లో ఫాస్టెస్ట్ సెంచరీలు కొట్టిన భారతీయులు వీరే.. నంబర్ 1 ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved