ఐపీఎల్ ముగిసిన తర్వాత సౌతాఫ్రికాతో టీ20 సిరీస్... వైజాగ్‌లో మూడో టీ20...
ఐపీఎల్ 2022 సీజన్ మెగా సీజన్ మే 29న జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ముగియనున్న విషయం తెలిసిందే. 74 రోజుల పాటు సాగే ఈ సుదీర్ఘ సీజన్ ముగిసిన తర్వాత 10 రోజుల గ్యాప్‌లో సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడనుంది భారత జట్టు...

జూన్ నెలలో భారత పర్యటనకు వచ్చే సౌతాఫ్రికా జట్టు ఇక్కడ ఐదు టీ20 మ్యాచుల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌కి సంబంధించిన షెడ్యూల్‌ని ఖరారు చేసింది బీసీసీఐ...
జూన్ 9 గురువారం, ఢిల్లీలో ఇండియా, సౌతాఫ్రికా మధ్య తొలి టీ20 మ్యాచ్ జరుగుతుంది. ఆ తర్వాత జూన్ 12న కటక్ వేదికగా రెండో టీ20 జరుగుతుంది..
జూన్ 14 మంగళవారం, వైజాగ్ వేదికగా భారత్, సౌతాఫ్రికా మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. చాలా ఏళ్ల తర్వాత తెలుగురాష్ట్రాల్లో ఓ నగరం... అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌కి ఆతిథ్యం ఇవ్వనుంది...
ఇంతకుముందు టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌ను హైదరాబాద్ వేదికగా నిర్వహించాలని షెడ్యూల్ చేసింది బీసీసీఐ. అయితే కరోనా థర్డ్ వేవ్ కారణంగా ఆ టోర్నీ యూఏఈకి మారిన విషయం తెలిసిందే...
రాజ్‌కోట్ వేదికగా జూన్ 17 శుక్రవారం రోజున భారత్, సౌతాఫ్రికా మధ్య నాలుగో టీ20 జరుగుతుంది. ఆ తర్వాత జూన్ 19న బెంగళూరులో ఆఖరి టీ20 మ్యాచ్ జరగనుంది...
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్తుంది టీమిండియా. జూన్ 26న, జూన్ 28న ఐర్లాండ్‌తో డబ్లిన్ వేదికగా రెండు టీ20 మ్యాచులు ఆడుతుంది...
ఆ తర్వాత జూలై 1న ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఐదో టెస్టు, ఆ తర్వాత జూలై 7 నుంచి 10 వరకూ మూడు టీ20 మ్యాచుల సిరీస్, జూన్ 12 నుంచి 17 వరకూ మూడు మ్యాచుల వన్డే సిరీస్ జరుగుతుంది.