- Home
- Sports
- Cricket
- యజ్వేంద్ర చాహాల్‌ని ఎలా వాడాలో సంజూ శాంసన్‌ని అడుగు... టీమిండియా కెప్టెన్ రిషబ్ పంత్‌కి...
యజ్వేంద్ర చాహాల్‌ని ఎలా వాడాలో సంజూ శాంసన్‌ని అడుగు... టీమిండియా కెప్టెన్ రిషబ్ పంత్‌కి...
సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో లక్కీగా కెప్టెన్సీ దక్కించుకున్న రిషబ్ పంత్, మొదటి మ్యాచ్‌లో కెప్టెన్‌గా పాస్ మార్కులు తెచ్చుకోగలిగాడు కానీ అద్భుతః అని మాత్రం అనిపించుకోలేకపోయాడు. కారణం బౌలర్ల పేలవ ప్రదర్శన మాత్రమే కాదు స్పిన్నర్లను వాడడంలో పంత్ పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు...

పవర్ ప్లేలోనే నాలుగో ఓవర్‌లో యజ్వేంద్ర చాహాల్‌కి బౌలింగ్ ఇచ్చాడు రిషబ్ పంత్. అయితే క్వింటన్ డి కాక్, డ్వేన్ ప్రిటోరియస్ కలిసి 6, 4, 4 బాది... చాహాల్ ఓవర్‌లో 16 పరుగులు రాబట్టారు..
తిరిగి 8వ ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చిన యజ్వేంద్ర చాహాల్ మొదటి మూడు బంతుల్లో పరుగులేమీ ఇవ్వకుండా వాన్ దేర్ దుస్సేన్‌ని నిలువరించినా ఆ తర్వాత ఫోర్ బాదిన సఫారీ బ్యాటర్... 6 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత 20వ ఓవర్ వరకూ యజ్వేంద్ర చాహాల్ అనే బౌలర్ ఉన్న విషయాన్నే మరిచిపోయాడు రిషబ్ పంత్..
Chahal Rajasthan
మొదటి 2 ఓవర్లలో 22 పరుగులు ఇచ్చాడని యజ్వేంద్ర చాహాల్‌ని పక్కనబెట్టేసిన రిషబ్ పంత్, రెండో ఓవర్‌లో భారత ప్రధాన స్పిన్నర్ 6 పరుగులు మాత్రమే ఇచ్చిన విషయాన్ని కూడా గుర్తించలేకపోయాడు...
‘యజ్వేంద్ర చాహాల్ లాంటి స్పిన్నర్‌కి కేవలం 2.1 ఓవర్లు మాత్రమే ఇవ్వడం కరెక్ట్ కాదు. అక్షర్ పటేల్‌తో పూర్తి కోటా వేయించినప్పుడు, చాహాల్‌తోనూ వేయిస్తే పోయేదిగా... అక్కడే రిషబ్ పంత్ తప్పు చేశాడు...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్, గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశీష్ నెహ్రా...
Chahal-Sanju Samson
ఐపీఎల్ 2022 సీజన్‌లో 27 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ గెలిచాడు యజ్వేంద్ర చాహాల్. రాజస్థాన్ రాయల్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన చాహాల్‌ను ఆ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ బాగా వాడుకున్నాడు...
యజ్వేంద్ర చాహాల్‌ని ఎలా, ఏ సమయాల్లో వాడాలనే విషయంపై క్లారిటీ లేకపోతే, తన ఫ్రెండ్ సంజూ శాంసన్‌ని అడిగి తెలుసుకోవాలని రిషబ్ పంత్‌కి సలహాలు ఇస్తున్నారు టీమిండియా అభిమానులు...