- Home
- Sports
- Cricket
- వాళ్ల కంటే రిషబ్ పంత్ చాలా బెటర్ కెప్టెన్... టీమిండియా సారథికి పార్థివ్ పటేల్ సపోర్ట్...
వాళ్ల కంటే రిషబ్ పంత్ చాలా బెటర్ కెప్టెన్... టీమిండియా సారథికి పార్థివ్ పటేల్ సపోర్ట్...
అనుకోకుండా కెప్టెన్సీ దక్కించుకున్నా, అదృష్టానికి తోడు తనలో కెప్టెన్సీ స్కిల్స్ కూడా ఉన్నాయని నిరూపించుకుంటున్నాడు రిషబ్ పంత్. తొలి రెండు టీ20ల్లో ఓడినా, మూడో మ్యాచ్‌లో గెలిచి సిరీస్ ఆశలను సజీవంగా నిలిపాడు...

Image credit: PTI
స్వదేశంలో సౌతాఫ్రికాని టీ20ల్లో ఓడించిన రెండో భారత సారథిగా విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో నిలిచాడు రిషబ్ పంత్. ఇంతకుముందు ఎమ్మెస్ ధోనీ కూడా సౌతాఫ్రికాపై స్వదేశంలో టీ20 మ్యాచ్ గెలవలేకపోయాడు...
Image credit: PTI
మొదటి రెండు మ్యాచుల్లో పెద్దగా పర్ఫామెన్స్ చూపించలేకపోయిన హర్షల్ పటేల్, యజ్వేంద్ర చాహాల్‌లను మూడో మ్యాచ్‌లోనూ కొనసాగించిన రిషబ్ పంత్, వారి నుంచి అద్భుతమైన రిజల్ట్ రాబట్టగలిగాడు...
Image credit: PTI
‘రిషబ్ పంత్ బౌలింగ్ మార్పులు చాలా బాగున్నాయి. మిగిలిన చాలామంది కంటే రిషబ్ పంత్ చాలా బెటర్ కెప్టెన్. సౌతాఫ్రికా బ్యాటర్లు ప్రమాదకరంగా మారుతున్నారు? భాగస్వామ్యం నిర్మిస్తున్నారని గుర్తించిన ప్రతీసారి అటాకింగ్ మోడ్‌తో ఎదురుదాడి చేశాడు...
ముఖ్యంగా యజ్వేంద్ర చాహాల్‌ని చక్కగా వాడుకున్నాడు. అక్షర్ పటేల్‌కి ఓ ఓవర్ ఇచ్చినా, కరెక్ట్ సమయంలో ఆ నిర్ణయం తీసుకున్నాడు. రిషబ్ పంత్ కెప్టెన్సీని ఎవ్వరైనా మెచ్చుకొని తీరాల్సిందే...
టీ20ల్లో గెలవాలంటే బౌలింగ్ అటాక్ దుర్భేద్యంగా ఉండాలి. అప్పుడే ఎలాంటి మ్యాచుల్లో అయినా విజయం సాధించవచ్చు. ఐదుగురు బౌలర్లతో బరిలో దిగితే అనుకున్న రిజల్ట్ రాబట్టడం కష్టమవుతుంది...
హార్ధిక్ పాండ్యా రూపంలో టీమిండియాకి ఓ బౌలింగ్ ఆప్షన్ అదనంగా ఉంది. అలాగే శ్రేయాస్ అయ్యర్ కూడా బౌలింగ్ వేయగలడు. హార్ధిక్ పాండ్యా 4 ఓవర్లు వేయగలిగితే భారత జట్టుకి అది శుభపరిణామమే...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్...
Rishabh Pant
రిషబ్ పంత్.. మిగిలిన వారి కంటే బెటర్ కెప్టెన్ అనడం బాగానే ఉంది కానీ ఇంతకీ ఆ మిగిలిన కెప్టెన్లు అని ఎవరిని ఉద్దేశించి పార్థివ్ పటేల్ కామెంట్ చేసి ఉంటాడని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు టీమిండియా ఫ్యాన్స్. విరాట్ కోహ్లీని ట్రోల్ చేసి ఉంటాడని కొందరు అంటుంటే, కెఎల్ రాహుల్‌ని విమర్శించి ఉంటాడని అంటున్నారు మరికొందరు నెటిజన్లు...