MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • డీజీపీ కూతురికి లైన్ వేసిన మయాంక్ అగర్వాల్... ఆశితా సూద్‌‌తో ఈ చంటిగాడి లవ్‌స్టోరీ వింటే...

డీజీపీ కూతురికి లైన్ వేసిన మయాంక్ అగర్వాల్... ఆశితా సూద్‌‌తో ఈ చంటిగాడి లవ్‌స్టోరీ వింటే...

‘ఏ డీజీపీ కూతురు అయితే ప్రేమించకూడదా? కమిషనర్ కూతురుకి మొగుళ్లు రారా...’ అటు హీరో రవితేజ, డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కెరీర్ గ్రాఫ్‌ని మార్చేసిన ‘ఇడియట్’ సినిమాలో ఫేమస్ డైలాగ్ ఇది... కాలేజీ స్టూడెంట్ అయితే డీజీపీ కూతురుని ప్రేమించడానికి ధైర్యం కావాలేమో కానీ, ఇంటర్నేషనల్ క్రికెటర్‌‌గా గుర్తింపు తెచ్చుకున్నోడికి అవసరం లేదుగా... మయాంక్ అగర్వాల్ లవ్ స్టోరీ కూడా ఇలాగే మొదలైంది...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jan 10 2022, 03:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111

మయాంక్ అగర్వాల్ భార్య ఆశితా సూద్, జనవరి 9న తన 29వ పుట్టినరోజు జరుపుకుంది... భర్తతో కలిసి సఫారీ టూర్‌లో ఉన్న ఆశితా సూద్, కేప్ టౌన్‌లో బర్త్ డే జరుపుకుంది...

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
211

కర్ణాటక రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) ప్రవీణ్ సూద్ గారాల కూతురే ఈ ఆశితా సూద్...  ఆశితాను డిగ్రీ చదివే సమయంలో కలిశాడు మయాంక్ అగర్వాల్...

311

అప్పటి నుంచి మంచి స్నేహితులుగా ఉన్న ఈ ఇద్దరూ, ఆ తర్వాత ప్రేమికులుగా మారారట. లండన్‌లోని ప్రఖ్యాత ‘ది లండన్ ఐ’ టవర్ మీద మోకాళ్ల మీద కూర్చొని మరీ ప్రపోజ్ చేశాడు మయాంక్ అగర్వాల్..

411

ఆశితా వెంటనే మయాంక్ అగర్వాల్ ప్రేమను ఒప్పుకోవడంతో ఈ ఇద్దరి ప్రేమకథ పెళ్లికి దారి తీసింది. నిజానికి ‘మన్మథుడు’ సినిమాలో నాగ్ చెప్పినట్టు ‘ఐఫిల్ టవర్ మీద ప్రపోజ్ చేస్తే... నో చెప్పదని’ ఐడియాను ఫాలో అయ్యాడట మయాంక్..

511

‘లండన్ ఐ’ నుంచి అందమైన లండన్ నగరాన్ని చూపిస్తూ... ‘నా జీవితంలో నవ్వుంటే ఇంతకంటే అందంగా ఉంటుందని’ ప్రపోజ్ చేశాడట మయాంక్...

611

మయాంక్ ప్రపోజ్ చేసిన విధానానికి ఫ్లాట్ అయిన ఆశితా... వెంటనే ఒకే చెప్పేసింది. డిసెంబర్ 30, 2017న ఆశితాకు ప్రపోజ్ చేసిన మయాంక్, 2018, జూన్ 4న వివాహం చేసుకున్నాడు.

711

క్రికెట్‌తో పాటు మయాంక్ అగర్వాల్, ఆయన భార్య ఆశితాకు ట్రావెల్ అంటే చాలా ఇష్టం. ఈ ఇద్దరూ కలిసి పారిస్, మాల్దీవులు వంటి ఎన్నో పర్యాటక ప్రదేశాలను చుట్టి వచ్చారు.

811

ఐపీఎల్‌లో గత రెండు సీజన్లలో పంజాబ్ కింగ్స్‌కి కీలక ఆటగాడిగా మారిన మయాంక్ అగర్వాల్‌ను ఆ జట్టు రిటైన్ చేసుకుంది. మయాంక్ అగర్వాల్‌తో పాటు అన్‌క్యాప్డ్ ప్లేయర్ అర్ష్‌దీప్ సింగ్‌ని మాత్రమే అట్టిపెట్టుకుంది పంజాబ్ కింగ్స్...

911

టీమిండియా క్రికెటర్, పంజాబ్ కింగ్స్ ప్లేయర్ మయాంక్ అగర్వాల్ సతీమణి ఆశితా సూద్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు...

1011

టీమిండియా క్రికెటర్, పంజాబ్ కింగ్స్ ప్లేయర్ మయాంక్ అగర్వాల్ సతీమణి ఆశితా సూద్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు...

1111

టీమిండియా క్రికెటర్, పంజాబ్ కింగ్స్ ప్లేయర్ మయాంక్ అగర్వాల్ సతీమణి ఆశితా సూద్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు...

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Hardik Pandya: ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ పాయే.. ఇప్పుడు టీమిండియా నుంచి ఔట్? హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్
Recommended image2
IPL 2026: ముంబైకి కేకేఆర్ షాక్.. ప్లేఆఫ్స్ రేసులోకి కోల్‌కతా.. ఆ ఫోర్త్ బెర్త్ ఎవరిదో?
Recommended image3
Kohli Mental Health : ఇంపోస్టర్ సిండ్రోమ్ తో బాధపడుతున్న విరాట్ కోహ్లీ .. లక్షణాలేంటో తెలుసా..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved