వైజాగ్ టెస్ట్: ఎల్గర్, డికాక్ వీరోచిత పోరాటం...మూడోరోజు సఫారీలదే

First Published Oct 4, 2019, 5:20 PM IST

విశాఖపట్నం వేదికన జరుగుతున్న మొదటిటెస్ట్ లో మూడోరోజు సౌతాఫ్రికా ఆధిక్యం కొనసాగింది. భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఆ జట్టు పాలోఆన్ స్థాయినుండి ఆధిక్యం సాధించే స్థాయిలో నిలిచింది.  

మహాత్మా గాంధీ-నెల్సన్ మండేలా ఫ్రీడమ్ ట్రోపీలో భాగంగా భారత్-సౌతాఫ్రికాల మధ్య  మూడు టెస్టుల సీరిస్ జరుగుతోంది. ఇప్పటికే విశాఖపట్నంలో మొదటి మ్యాచ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. అక్టోబర్ 2వ తేదీ నుండి జరుగుతున్న ఈ  మ్యాచ్ లో మొదటి  రెండురోజులు భారత్ హవా కొనసాగగా మూడోరోజు సౌతాఫ్రికా జోరు కొనసాగుతోంది. టీమిండియా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఫాలోఆన్ ఆడాల్సిన స్థితినుండి భారత్ పై ఆధిక్యాన్ని సాధించే దిశగా ఆ జట్టు ఇన్నింగ్స్ కొనసాగుతోంది.

సౌతాఫ్రికా ఓపెనర్ ఎల్గర్ అద్భుత ప్రదర్శనవల్లే సఫారీ ఇన్నింగ్స్ గాడినపడింది. ఓ వైపు వికెట్లు పడుతున్నా ఎలాంటి ఒత్తిడికి లోనవకుండా అతడు భారీ సెంచరీ(160 పరుగులు) బాదాడు. ఎల్గర్ తో పాటు క్వింటన్ డికాక్ (111 పరగులు) కూడా సెంచరీతో చెలరేగడంతో సౌతాఫ్రికా మంచి స్కోరు దిశగా సాగుతోంది. కెప్టెన్ డుప్లెసిస్ కూడా 55 పరుగులతో తన వంతు సహకారం అందించాడు.

భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 5 వికెట్లు పడగొట్టగా  జడేజాకు 2, ఇషాంత్ శర్మ కు 1 వికెట్ దక్కింది. ప్రస్తుతం సౌతాఫ్రికా 118 ఓవర్లలో  8  వికెట్ల నష్టానికి 385 పరుగుల వద్ద నిలిచింది. టీమిండియాను అధిగమించాలంటే ఆ జట్టు ఇంకా 117 పరుగులు చేయాల్సి వుండగా చేతిలో కేవలం 2 వికట్లుమాత్రమే వున్నాయి.

విశాఖపట్నంలోని ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఓపెనింగ్ జోడి అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారీ పరుగులు అందించారు. టెస్టుల్లో మొదటిసారి ఓపెనింగ్ చేస్తున్న రోహిత్, యువ ఓపెనర్ మయాంక్ లు అద్భుతంగా రాణించారు. రోహిత్ సెంచరీ,మయాంక్ హాఫ్ సెంచరీతో నాటౌగ్ గా నిలవడంతో 202 పరుగుల వద్ద మొదటిరోజు ఆట ముగిసింది.

ఇలా 202 పరగుల ఓవర్ నైట్ స్కోర్ వద్ద గురువారం రెండోరోజు మ్యాచ్ ప్రారంభమయ్యింది. ఇందులో కూడా ఓపెనర్ల హవానే కొనసాగింది. అయితే 176 పరుగుల వద్ద రోహిత్ ఔటవడంతో 317 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యానికి తెరపడింది. కానీ ఆ తర్వాత మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ పరుగుల వేగాన్ని మరింత పెంచి డబుల్ సెంచరీని సాధించాడు. 215 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అతడు ఔటయినా అప్పటికే భారత్ భారీ స్కోరు కు చేరుకుంది.

భారత  ఓపెనర్లు సెంచరీలతో చెలరేగగా మిగతా ఆటగాళ్లు మాత్రం ఆ స్థాయిలో రాణించలేకపోయారు. రవీంద్ర జడేజా 30నాటౌట్, అశ్విన్ 1నాటౌట్, వృద్దిమాన్ సాహా 21, కోహ్లీ 20, రహానే 15, విహార 10, పుజారా 6 పరుగులు  మాత్రమే చేయగలిగారు. అయితే వీరు రాణించకున్నా భారత స్కోరు 502/7 కు చేరుకుంది. దీంతో కెప్టెన్ కోహ్లీ ఇదే స్కోరు వద్ద ఫస్ట్ ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసి సౌతాఫ్రికాకు బ్యాటింగ్ అప్పగించారు.

రెండోరోజు టీమిండియా బౌలర్లు కూడా హవా కొనసాగింది. అయితే భారత ఓపెనర్లు సెంచరీలతో చెలరేగిన పిచ్ పైనే సఫారీ ఆటగాళ్ళు మొదట తడబడుతున్నారు. ఓపెనర్ మక్రమ్ (5 పరుగులు), డి బ్రూన్ (4 పరుగులు) కనీసం సింగిల్ డిజిట్ పరుగులయినా సాధించి ఔటయ్యారు. కానీ డి బ్రూన్ మాత్రం పరుగులేమీ సాధించకుండానే డకౌటయ్యాడు. దీంతో సౌతాఫ్రికా కేవలం 39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాలతో రెండో రోజు ఆటను ముగించింది.

అయితే మూడో రోజు మాత్రం సఫారీ ఆటగాళ్లు అద్భుతంగా బ్యాటింగ్ చేసి మళ్ళీ పోటీలోకి వచ్చారు. ఓపెనర్ ఎల్గర్ 27 పరుగులతో బ్యాటింగ్ ప్రారంభించి 160 పరుగులు చేసి వద్ద ఔటయ్యాడు. అతడికి టీ20 కెప్టెన్ డికాక్ (111 పరుగులు) సెంచరీ, టెస్ట్ కెప్టెన్ డుప్లెసిస్(55 పరుగులు) హాఫ్ సెంచరీలతో సహకారం అందించి సపారీ టీంను  పటిష్ట స్థాయిలో నిలబెట్టారు.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?