ధర్మశాల టీ20: అనుభవమా లేక ఆటతీరా..... తుది భారత జట్టు ఇదేనా...?

First Published 15, Sep 2019, 4:14 PM IST

భారత్-సౌతాఫ్రికాల మధ్య ధర్మశాల వేదికన మొదటి టీ20 మ్యాచ్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత తుది జట్టులో చోటు దక్కించుకునే ఎవరన్న దానిపై అభిమానుల్లో చర్చ జరుగుతోంది.   

ప్రపంచ కప్ అనంతరం వెస్టిండిస్ పర్యటనలో అదరగొట్టిన భారత జట్టు సౌతాఫ్రికాతో తలపడేందుకు సిద్దమైంది. ఇప్పటికే విదేశాల్లో తిరుగులేని ప్రదర్శనలో అద్భుత విజయాలను అందుకున్న కోహ్లీసేన ఇకపై స్వదేశంలో ఆ పని చేయాలనుకుంటోంది. అందులోభాగంగా సౌతాఫ్రికాతో జరగనున్న టీ20 సీరిస్ లో సత్తాచాటేందుకు పక్కా వ్యూహాలతో బరిలోకి దిగుతున్నట్లు కెప్టెన్ కోహ్లీ తెలిపాడు. ఆ వ్యూహాల్లో అతి ప్రదానమైనది ఆటగాళ్ల ఎంపిక.

టీ20 సీరిస్ కోసం సెలెక్షన్ కమిటీ 15మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించింది. అందులోంచి తుదిజట్టులో చోటు దక్కనుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ విషయంలో టీమిండియీ మేనేజ్ మెంట్ అనుభవానికి ఓటేస్తుందా లేక ఆటతీరునే ప్రామాణికంగా తీసుకుంటుందా అన్నది మరికొద్దిగంటల్లో తేలనుంది

ముందుగా టీమిండియా ఓపెనర్ల విషయానికి వస్తే శిఖర్ ధవన్ కు తుది జట్టులో చోటు దక్కడం కాస్త అనుమానంగానే కనిపిస్తోంది. బొటనవేలి గాయంతో ప్రపంచ కప్ కు దూరమైన అతడు ఆ తర్వాత కూడా ఆశించిన మేర రాణించలేకపోయాడు. దీంతో అతడి స్థానంలో రోహిత్ తో కలిసి రాహుల్ ఓపెనింగ్ చేసినా ఆశ్యర్యపోవాల్సిన అవసరం లేదు.

ఇక ఫస్ట్ డౌన్ లో యధావిదిగా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ రావడం ఖాయం. ఆ తర్వాత ఎవరు బ్యాటింగ్ కు వస్తారన్నదే అభిమానులను గందరగోళంలోకి నెడుతోంది. వెస్టిండిస్ పై వన్డే సీరిస్ లో చెలరేగిన శ్రేయాస్ అయ్యర్, ఇదే టూర్ లో విఫలమైన మనీష్ పాండేలలో ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి. ఈ విషయంలో శ్రేయాస్ అయ్యర్ కే తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు ఎక్కవుగా వున్నాయి.

వెస్టిండిస్ పర్యటనలో విఫలమైనప్పటికి రిషబ్ పంత్ కు మరో అవకాశం లభించింది. వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్ మెన్ గా రాణిస్తాడన్న నమ్మకంతోనే సెలెక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. వారి నమ్మకాన్ని అతడు నిలబెట్టుకుంటాడో...లేదో ఈ సీరిస్ ద్వారా తేలనుంది.

టీ20 ఫార్మాట్ కు సరిగ్గా సరిపోయే ఆటగాళ్లు పాండ్యా బ్రదర్స్. ఆల్ రౌండర్లయిన హార్దిక్, కృనాల్ ఇద్దరికీ తుది జట్టులో చోటు దక్కనుంది. వీరు అటు బ్యాట్స్ మెన్ గానూ ఇటు పార్ట్ టైమ్ బౌలర్లుగానూ జట్టుకు ఉపయోగపడతారు.

బౌలర్లలో నవదీప్ సైనీకి తుది జట్టులో చోటు ఖాయంగా కనిపిస్తోంది. ఇక దీపక్ చాహర్, ఖలీల్ అహ్మద్ లలో ఎవరో ఒకరికి మాత్రమే ఈ మ్యాచ్ ఆడే అవకాశం రావచ్చు. స్పిన్నర్లలో సీనియర్ రవీంద్ర జడేజాతో యువకులు వాషింగ్టన్ సుందర్, రాహుల్ చాహర్ లు పోటీ పడుతున్నారు. అయితే టీమిండియా మేనేజ్ మెంట్ అనుభవానికి ఓటుస్తే జడేజాకు... ఆటతీరు, ఫామ్ ను దృష్టిలో వుంచుకుంటే రాహుల్, సుందర్ లకు తుది జట్టులో చోటు దక్కుతుంది.

loader