- Home
- Sports
- Cricket
- టీ20 సిరీస్ మొత్తానికి దూరమైన సౌతాఫ్రికా టాప్ బ్యాటర్... నాలుగో టీ20 బరిలో క్వింటన్ డి కాక్...
టీ20 సిరీస్ మొత్తానికి దూరమైన సౌతాఫ్రికా టాప్ బ్యాటర్... నాలుగో టీ20 బరిలో క్వింటన్ డి కాక్...
మొదటి రెండు మ్యాచుల్లో గెలిచి, మూడో టీ20లో పరాజయం ఎదుర్కొన్న సౌతాఫ్రికా.. రాజ్‌కోట్‌లో జరిగే నాలుగో టీ20 కోసం ఎదురుచూస్తోంది. అయితే నాలుగో టీ20కి ముందు ఫ్యాన్స్‌కి ఓ గుడ్ న్యూస్, అలాగే ఓ బ్యాడ్ న్యూస్ తెలిపింది సౌతాఫ్రికా...

టీ20 సిరీస్ ఆరంభానికి ముందు కరోనా బారిన పడిన అయిడిన్ మార్క్‌రమ్, మిగిలిన రెండు మ్యాచులకు కూడా దూరమయ్యాడు...
ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ఆడి అదరగొట్టిన సఫారీ ప్లేయర్ అయిడిన్ మార్క్‌రమ్, తొలి టీ20 మ్యాచ్ ఆరంభానికి ముందు నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలాడు...
ఐపీఎల్ 2022 సీజన్‌లో మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన అయిడిన్ మార్క్‌రమ్ దూరమైనా డేవిడ్ మిల్లర్, వాన్ దేర్ దుస్సేన్, హెన్రీచ్ క్లాసెన్ అద్భుత ఇన్నింగ్స్‌లతో రాణించి సౌతాఫ్రికాకి తొలి రెండు మ్యాచుల్లో విజయాలు అందించారు...
వారం రోజుల పాటు క్వారంటైన్‌లో గడిపిన అయిడిన్ మార్క్‌రమ్, ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో అతను మిగిలిన రెండు మ్యాచులకు కూడా దూరం కానున్నాడని ప్రకటించింది సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు...
Image Credit: PTI
అలాగే మొదటి టీ20 మ్యాచ్‌లో గాయపడిన క్వింటన్ డి కాక్, గాయం నుంచి కోలుకుని నాలుగో టీ20లో బరిలో దిగబోతున్నాడు. డి కాక్ గాయం కారణంగా దూరం కావడంతో రీజా హెండ్రిక్స్, భవుమాతో కలిసి ఓపెనింగ్ చేశాడు...
Quinton de Kock
ఐపీఎల్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చి 400+ పరుగులు చేసిన క్వింటన్ డి కాక్, ఓ భారీ సెంచరీతో లక్నో సూపర్ జెయింట్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. డి కాక్ రీఎంట్రీ సౌతాఫ్రికా జట్టుకి బలాన్ని చేకూర్చనుంది...