ఆవేశ్ ఖాన్ ఆ ఒక్క ఓవర్ వేస్ట్ చేయకుంటే... సంజూ శాంసన్‌కి స్ట్రైయిక్ ఇవ్వకుండా...
సౌతాఫ్రికా, టీమిండియా మధ్య జరిగిన మొదటి వన్డే, క్రికెట్ ఫ్యాన్స్‌కి కావాల్సిన మజాని అందించింది. వర్షం కారణంగా 40 ఓవర్లకు కుదించిన ఈ వన్డేలో దాదాపు 34-35 ఓవర్ల వరకూ టీమిండియా లక్ష్యంవైపు సాగుతున్నట్టు కనిపించనేలేదు. అయితే ఆఖర్లో సంజూ శాంసన్ సెన్సేషనల్ ఇన్నింగ్స్‌తో దాదాపు మ్యాచ్ గెలిచినంత పని చేశాడు...

sanju samson
ఆసియా కప్ 2022 టోర్నీలో బాల్‌తో అట్టర్ ఫ్లాప్ పర్ఫామెన్స్ ఇచ్చి విమర్శలు ఎదుర్కొన్న ఆవేశ్ ఖాన్, ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో చేసిన మిస్టేక్‌కి టీమిండియా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. శార్దూల్ ఠాకూర్, సంజూ శాంసన్ కలిసి ఆరో వికెట్‌కి 93 పరుగుల అమూల్యమైన భాగస్వామ్యం నెలకొల్పారు...
Sanju Samson
అయితే 15 బంతుల్లో 39 పరుగులు కావాల్సిన దశలో శార్దూల్ ఠాకూర్ వికెట్ కోల్పోయింది టీమిండియా. అప్పటికే సంజూ శాంసన్ మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. అయితే శాంసన్‌కి స్ట్రైయిక్ ఇవ్వాలనే ఆలోచన లేని లోయర్ ఆర్డర్ బ్యాటర్లు అనవసర షాట్లకి వెళ్లి, టీమిండియా ఓటమికి కారణమయ్యారు. వస్తూనే బంతిని గాల్లోకి లేపిన కుల్దీప్ యాదవ్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు...
Image credit: PTI
ఆ తర్వాత వచ్చిన ఆవేశ్ ఖాన్ మొదటి బంతికి సింగిల్ తీసి స్ట్రైయిక్ ఇచ్చాడు. దీంతో ఆవేశ్ ఖాన్ ఇలా స్ట్రైయిక్ రొటేట్ చేసి సంజూ శాంసన్‌కి బ్యాటింగ్ ఇస్తే చాలనుకున్నారంతా. అయితే ఇన్నింగ్స్ 39వ ఓవర్‌లో ఆవేశ్ ఖాన్ ఆవేశం కారణంగా భారత జట్టు, తొలి మ్యాచ్‌లో ఓడిపోవాల్సి వచ్చింది...
Sanju Samson
తొలి రెండు బంతుల్లో సింగిల్ తీయలేకపోయిన ఆవేశ్ ఖాన్, మూడో బంతికి 2 పరుగలు తీశాడు. ఇక్కడ సింగిల్ తీసి సంజూ శాంసన్‌కి స్ట్రైయిక్ ఇచ్చినా అతనికి మరో మూడు బంతులు ఫేస్ చేసే అవకాశం దక్కేది. అయితే ఆవేశ్ ఖాన్ అలా చేయలేదు. నాలుగో బంతికి కూడా పరుగులేమీ రాకపోగా ఐదో బంతికి మరో భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు ఆవేశ్ ఖాన్...
Sanju Samson
ఆ తర్వాత బంతికే రవి భిష్ణోయ్ కూడా ఇదే పని చేశాడు. వస్తూనే బంతిని గాల్లోకి లేపి క్యాచ్ ఇచ్చాడు అయితే అది నో బాల్ కావడంతో భిష్ణోయ్ బతికిపోయాడు. ఆ తర్వాతి బంతికి ఫోర్ వచ్చింది. మొత్తంగా ఈ ఓవర్‌లో 7 పరుగులు రాగా సంజూ శాంసన్ ఒక్క బంతిని కూడా ఫేస్ చేయలేకపోయాడు...
shreyas iyer
ఆఖరి ఓవర్‌లో టీమిండియా విజయానికి 30 పరుగులు కావాల్సి రాగా మూడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 20 పరుగులు రాబట్టాడు. మరో రెండు బంతులు ఆడి ఉంటే మ్యాచ్ రిజల్ట్‌ని మార్చేసేవాడినని సంజూ శాంసన్ స్వయంగా ధీమా వ్యక్తం చేశాడు...
Sanju Samson
దీంతో ఆవేశ్ ఖాన్ ఆవేశపడకుండా 39వ ఓవర్‌లో ఓ రెండు బంతులనైనా సంజూ శాంసన్‌ని ఆడనిచ్చి ఉంటే మ్యాచ్ రిజల్ట్ వేరేగా ఉండేదని అతన్ని ట్రోల్ చేస్తున్నారు టీమిండియా ఫ్యాన్స్...