5 నెలల తర్వాత రీఎంట్రీ, ఒక్క మ్యాచ్ ఆడగానే మళ్లీ వెన్ను గాయం... శ్రేయాస్ అయ్యర్ ఫ్యూచర్ ఏంటి?
విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్న సమయంలోనే టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్‌గా కనిపించాడు శ్రేయాస్ అయ్యర్. అయితే ఒక్క గాయం, అతని కెరీర్‌ని తలకిందులు చేసింది. 2021 ఐపీఎల్ ముందు గాయపడిన శ్రేయాస్ అయ్యర్, రీఎంట్రీ ఇవ్వడానికి దాదాపు ఏడాది సమయం తీసుకున్నాడు..
శ్రేయాస్ అయ్యర్ ప్లేస్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన రిషబ్ పంత్, టీమ్ మేనేజ్‌మెంట్‌ని ఇంప్రెస్ చేసి.. సారథిగా సెటిల్ అయ్యాడు. దీంతో శ్రేయాస్ అయ్యర్, కెప్టెన్సీ వెతుక్కుంటూ టీమ్ మారాల్సి వచ్చింది..
Shreyas Iyer
మళ్లీ ఐపీఎల్ 2023 సీజన్‌కి ముందు కూడా శ్రేయాస్ అయ్యర్ గాయపడ్డాడు. గాయంతో ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి దూరమైన శ్రేయాస్ అయ్యర్, 5 నెలల తర్వాత ఆసియా కప్ 2023 టోర్నీలో రీఎంట్రీ ఇచ్చాడు..
పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో 9 బంతుల్లో 2 ఫోర్లతో 14 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్, హారీస్ రౌఫ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. నేపాల్‌తో మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసే అవసరం కూడా రాలేదు. సూపర్ 4లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్‌కి తుది జట్టులో చోటు దక్కలేదు.
Shreyas Iyer
శ్రేయాస్ అయ్యర్ వెన్ను నొప్పితో బాధపడుతుండడంతో అతని ప్లేస్‌లో కెఎల్ రాహుల్‌ని తుది జట్టులోకి తీసుకొచ్చినట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ప్రకటించాడు. ఇది కొత్త కొత్త అనుమానాలను రేకెత్తిస్తోంది. ఆరేళ్ల క్రితం అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన శ్రేయాస్ అయ్యర్ ఇప్పటిదాకా 44 వన్డే మ్యాచులే ఆడాడు...
గత మూడేళ్లుగా శ్రేయాస్ అయ్యర్ ఆడిన మ్యాచుల కంటే గాయంతో తప్పుకున్న మ్యాచులే ఎక్కువ. 5 నెలలు చికిత్స తీసుకుని, కోలుకుని రీఎంట్రీ ఇచ్చాక ఒక్క మ్యాచ్‌కీ మళ్లీ వెన్ను నొప్పితో టీమ్‌కి దూరం కావడంతో... అయ్యర్ కూడా బుమ్రాలా ఏడాదిపాటు టీమ్‌కి దూరం కావాల్సిందేనా? అనే అనుమానాలు రేపుతోంది..
ఇషాన్ కిషన్ గత మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై 82 పరుగులు చేసి అదరగొట్టాడు. కెఎల్ రాహుల్‌ని తుది జట్టులోకి తేవాలంటే, ఇషాన్ కిషన్‌ని టీమ్ నుంచి తప్పించాల్సి ఉంటుంది. టాపార్డర్‌లో బాగా ఆడిన ఇషాన్ కిషన్‌ని టీమ్ నుంచి తప్పించడం కరెక్ట్ కాదని మేనేజ్‌మెంట్ భావించి ఉండొచ్చు..
శ్రేయాస్ అయ్యర్‌ని తప్పించి, కెఎల్ రాహుల్‌ని తుది జట్టులోకి తీసుకొచ్చినా... విమర్శలు రావచ్చు. నాలుగో స్థానంలో అయ్యరే సరైనవాడు అని, అతని కోసం ఇన్నాళ్లు ఎదురుచూసి, ఇప్పుడు రిజర్వు బెంచ్‌లో కూర్చోబెడతారా? అంటూ ట్రోల్స్ రావచ్చు.
Shreyas Iyer
అందుకే గాయం వంకతో శ్రేయాస్ అయ్యర్‌ని రిజర్వు బెంచ్‌లో కూర్చోబెట్టి, కెఎల్ రాహుల్‌ని టీమ్‌లోకి తీసుకొచ్చారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయ్యర్ గాయం నిజమైతే మాత్రం వన్డే వరల్డ్ కప్ 2023 జట్టులో అయ్యర్ ప్లేస్‌పై మళ్లీ చర్చ మొదలవుతుంది.