- Home
- Sports
- Cricket
- మేం ఆడినవన్నీ వన్‌సైడెడ్ మ్యాచులే! పాకిస్తాన్‌ని ఉతికి ఆరేసేవాళ్లం.. - టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ
మేం ఆడినవన్నీ వన్‌సైడెడ్ మ్యాచులే! పాకిస్తాన్‌ని ఉతికి ఆరేసేవాళ్లం.. - టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో అక్టోబర్ 15న ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌ని స్టేడియంలో 1 లక్షా 30 వేల మంది వీక్షించబోతున్నారు...

Sourav Ganguly
ఐసీసీ టోర్నీల్లో టీమిండియాకి పాకిస్తాన్‌పై తిరుగులేని రికార్డు ఉంది. టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీకి ముందు వరల్డ్ కప్ టోర్నీల్లో టీమిండియా ఎప్పుడూ పాకిస్తాన్ చేతుల్లో ఓడిపోలేదు. 1992 నుంచి ఇప్పటివరకూ వన్డే వరల్డ్ కప్‌లో ఏడు సార్లు ఇండియా- పాకిస్తాన్ మ్యాచులు జరిగాయి. ఏడింట్లోనూ టీమిండియానే విజయం అందుకుంది..
1999 వన్డే వరల్డ్ కప్‌లో ప్లేయర్‌గా ఆడిన సౌరవ్ గంగూలీ, 2003 వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించాడు. 2020 తర్వాత ఇండియా- పాకిస్తాన్ మధ్య నాలుగు మ్యాచులు జరగగా రెండింట్లో టీమిండియా, రెండింట్లో పాక్ గెలిచాయి.. దీనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ..
India vs Pakistan
‘ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే హైప్ వేరే లెవెల్‌లో ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ రెండు జట్ల క్వాలిటీ ఇంతకుముందులా లేదు. ఎందుకంటే భారత జట్టు, ఇంతకుముందు పాకిస్తాన్‌తో ఆడిన వరల్డ్ కప్ మ్యాచులన్నీ వన్‌సైడెడ్‌వే. పాకిస్తాన్ ఎప్పుడూ ఇండియాపై గెలవలేకపోయింది..
2021 టీ20 వరల్డ్ కప్‌లో మొదటిసారి ఇండియా, పాక్ చేతుల్లో ఓడింది. ఆ టోర్నీలో టీమిండియా పర్ఫామెన్స్ సరిగా లేదు. దానికి ఎన్ని కారణలైనా ఉండొచ్చు... మనం స్థాయికి తగ్గట్టుగా ఆడలేకపోయాం.
నన్ను అడిగితే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కంటే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఈ రెండు జట్లు పటిష్టంగా కనిపిస్తున్నాయి.. ’ అంటూ కామెంట్ చేశాడు బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ..