- Home
- Sports
- Cricket
- ఇండియాపై గెలిస్తే చాలు, వరల్డ్ కప్ ఓడిపోయినా పట్టించుకోరు! పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ కామెంట్స్..
ఇండియాపై గెలిస్తే చాలు, వరల్డ్ కప్ ఓడిపోయినా పట్టించుకోరు! పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ కామెంట్స్..
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌కి హైప్ విపరీతంగా వచ్చేసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో 1 లక్షా 30 వేల మందికి పైగా ప్రేక్షకుల మధ్య ఇండియీ vs పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది..

India vs Pakistan
ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీల్లో టీమిండియాకి పాకిస్తాన్‌పై ఘనమైన రికార్డు ఉంది. అయితే 2021 టీ20 వరల్డ్ కప్‌లో తొలిసారిగా భారత్‌ని ఓడించింది పాకిస్తాన్. ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో పాక్‌ని ఓడించి కమ్‌బ్యాక్ ఇచ్చింది టీమిండియా...
టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో భారత జట్టు గ్రూప్ స్టేజీకే పరిమితమైతే, పాకిస్తాన్ సెమీస్ ఆడింది. ఆసియా కప్ 2022 టోర్నీలో టీమిండియా, సూపర్ 6 రౌండ్ నుంచే నిష్కమిస్తే... పాకిస్తాన్ ఫైనల్ ఆడింది. అలాగే టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో పాకిస్తాన్ ఫైనల్‌కి వెళితే, భారత జట్టు సెమీ ఫైనల్‌లో ఓడింది..
India vs Pakistan
‘వరల్డ్ కప్‌లో టీమిండియాతో మ్యాచ్ మాకు చాలా ముఖ్యం. ఇండియాపై మ్యాచ్ గెలిస్తే చాలు, వరల్డ్ కప్ గెలవకపోయినా మా వాళ్లు పెద్దగా పట్టించుకోరు. అయితే మాకు మాత్రం ఇండియాతో మ్యాచ్ గెలవడం ఒక్కటే ముఖ్యం కాదు, ప్రతీ మ్యాచ్ గెలుస్తూ ఐసీసీ టైటిల్ గెలవడమే లక్షం..
ఎక్కడ వరల్డ్ కప్ జరిగినా ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇండియాలో వరల్డ్ కప్ ఆడడం ఇదే మొదటిసారేం కాదు. పీసీబీలో ఏం జరుగుతుందో మాకు అనవసరం. మా ఫోకస్ అంతా క్రికెట్‌పైనే ఉంటుంది..
ఏయే మ్యాచులు ఆడబోతున్నామో మా దగ్గర పూర్తి షెడ్యూల్ ఉంది. దానికి అనుగుణంగా ప్రణాళికలు రచించుకుంటూ ముందుకు సాగడంపైనే ఫోకస్ పెడతాం... ’ అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్..