- Home
- Sports
- Cricket
- ఆవేశ్ ఖాన్ ప్లేస్‌లో దీపక్ చాహార్... పాక్‌తో మ్యాచ్‌లో టీమిండియా సర్‌ప్రైజ్ ఇవ్వనుందా...
ఆవేశ్ ఖాన్ ప్లేస్‌లో దీపక్ చాహార్... పాక్‌తో మ్యాచ్‌లో టీమిండియా సర్‌ప్రైజ్ ఇవ్వనుందా...
ఆసియా కప్ 2022 టోర్నీ సూపర్ 4 రౌండ్‌లో భాగంగా నేడు భారత జట్టు, దాయాది పాకిస్తాన్‌తో తలబడనుంది. ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో భారత జట్టు 5 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది. అయితే ఆఖరి ఓవర్ వరకూ భారత్‌ని నిలువరించిన పాక్ జట్టు మంచి పోటీ ఇచ్చింది. అయితే సూపర్ 4 మ్యాచ్‌కి ముందు ఇరు జట్లను గాయాలు వెంటాడుతున్నాయి...

పాక్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 పరుగులు చేసి, విరాట్ కోహ్లీతో కలిసి టాప్ స్కోరర్‌గా నిలిచిన రవీంద్ర జడేజా.. గాయం కారణంగా ఆసియా కప్ 2022 టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అతను టీ20 వరల్డ్ కప్ 2022కి అందుబాటులో ఉండడం కూడా కష్టమేనని టాక్ వినబడుతోంది...
Image credit: PTI
అలాగే జస్ప్రిత్ బుమ్రా, హర్షల్ పటేల్ గాయాలతో బాధపడుతుండడంతో భారత జట్టుకి ప్రధాన ఫాస్ట్ బౌలర్‌గా మారిన ఆవేశ్ ఖాన్ జ్వరంతో బాధపడుతున్నాడు. ఆవేశ్ ఖాన్, పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడడం అనుమానమేనని టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తెలియచేశాడు...
Image credit: PTI
ఆవేశ్ ఖాన్ బరిలో దిగకపోతే భారత జట్టు ఫాస్ట్ బౌలింగ్ విభాగం వీక్ అయిపోయింది. భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, హార్ధిక్ పాండ్యా మాత్రమే ఫాస్ట్ బౌలర్లుగా ఉంటారు. హార్ధిక్ పాండ్యా తొలి మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసి 3 వికెట్లు తీసినా అతనిపై పూర్తి ప్రెషర్ పెట్టడం కరెక్ట్ కూడా కాదు...
Deepak Chahar
దీంతో రిజర్వు బెంచ్‌లో ఉన్న దీపక్ చాహార్‌ని బరిలో దింపాలని టీమిండియా భావిస్తోందట. పాకిస్తాన్ మ్యాచ్ ఆరంభానికి ముందు నెట్స్‌లో దీపక్ చాహార్ ప్రాక్టీస్ చేయడం కనిపించింది. ఆరు నెలల విరామం తర్వాత గాయం నుంచి కోలుకుని జింబాబ్వేతో సిరీస్ ఆడిన దీపక్ చాహార్, మంచి పర్పామెన్స్ ఇచ్చాడు...
ఆవేశ్ ఖాన్ కంటే దీపక్ చాహార్‌కి అనుభవం ఎక్కువ. స్వింగ్ బౌలింగ్‌తో వరల్డ్ క్లాస్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టగలడు. దీంతో దీపక్ చాహార్, తుదిజట్టులోకి వస్తే.. టీమిండియా ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ కష్టాలు సగం తీరినట్టే...
అయతే రిజర్వు బెంచ్‌లో ఉన్న ప్లేయర్‌ని ఆడించాలంటే ఆవేశ్ ఖాన్‌కి కంకూషన్ సబ్‌స్టిట్యూట్‌గా అతన్ని జట్టులోకి తీసుకుంటున్నట్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే రవీంద్ర జడేజా స్థానంలో స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్, భారత జట్టుతో చేరిన విషయం తెలిసిందే.