- Home
- Sports
- Cricket
- ఆసియా కప్ 2025 : భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు? ఎక్కడ లైవ్ స్ట్రీమింగ్ ఫ్రీగా చూడొచ్చు?
ఆసియా కప్ 2025 : భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు? ఎక్కడ లైవ్ స్ట్రీమింగ్ ఫ్రీగా చూడొచ్చు?
India vs Pakistan Asia Cup 2025: ఆసియా కప్ 2025లో సెప్టెంబర్ 14న దుబాయ్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. అయితే, ఈ మ్యాచ్ ను ఎక్కడ లైవ్ చూడొచ్చు? ఏ టీవీ ఛానెల్ లో ప్రత్యక్ష ప్రసారం కానుంది? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఆసియా కప్ 2025: భారత్ vs పాకిస్తాన్ మధ్య హైవోల్టేజీ మ్యాచ్
ఆసియా కప్ 2025లో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న మ్యాచ్ భారత్ vs పాకిస్తాన్ పోరు. ఈ హైవోల్టేజీ మ్యాచ్ ఆదివారం (సెప్టెంబర్ 14, 2025న) జరగనుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక కానుంది.
గ్రూప్ ఏ లో భారత్, పాకిస్తాన్ రెండు జట్లు తమ తొలి మ్యాచ్ ను విజయంతో ప్రారంభించాయి. గ్రూప్ Aలో ప్రారంభ ఆధిపత్యాన్ని నిర్ణయించే ఈ మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు.
భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ టైమింగ్స్ ఏంటి?
భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 8:00 గంటలకు ప్రారంభమవుతుంది. టాస్ సాయంత్రం 7:30 గంటలకు జరుగుతుంది. ఇది జీఎంటీ సమయం ప్రకారం మధ్యాహ్నం 2:30 (14:30 UTC). దుబాయ్ స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6:30కు మ్యాచ్ మొదలవుతుంది. ప్రపంచ స్థాయి సౌకర్యాలు కలిగిన దుబాయ్ స్టేడియం మళ్లీ ఈ హైవోల్టేజీ క్రికెట్ పోరాటానికి వేదికగా మారుతోంది.
భారత్, పాకిస్తాన్ మ్యాచ్ లైవ్ స్ట్రీమ్ ఎక్కవ చూడాలి?
భారత, పాకిస్తాన్ మ్యాచ్ సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. సోనీLIV యాప్, వెబ్‌సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది. అలాగే FanCode, Airtel Xstream Play ప్లాట్‌ఫార్మ్స్ ద్వారా లైవ్ చూడవచ్చు.
పాకిస్తాన్‌లో అధికారిక స్పోర్ట్స్ ప్రసార సంస్థ PTV Sports టెలివిజన్ లో ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ ను ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు. అలాగే, Tamasha యాప్ లో లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది.
భారత్ vs పాకిస్తాన్: ప్రపంచవ్యాప్తంగా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ను ఉపఖండం వెలుపల ఉన్న క్రికెట్ అభిమానులు కూడా లైవ్ చూడవచ్చు. యునైటెడ్ కింగ్‌డమ్, ఐర్లాండ్‌లో TNT Sports 1, Discovery+ లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. అమెరికా, కెనడాలో Willow TV టెలివిజన్, డిజిటల్ స్ట్రీమింగ్ ఉంటుంది. మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా (MENA) ప్రాంతంలో CricLife MAX, STARZPLAY via eLife TV లో ప్రసారం ఉంటుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో అభిమానులు YuppTV లో భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ ను లైవ్ చూడవచ్చు.
భారత్ vs పాకిస్తాన్: జట్ల పరిస్థితి ఎలా ఉంది?
భారత్, పాకిస్తాన్ రెండు జట్లు తమ తొలి మ్యాచ్‌లలో విజయాలతో ఆసియా కప్ 2025 టోర్నీని ప్రారంభించాయి. యూఏఈపై తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచి భారత్ మంచి ఆరంభం చేసింది. పాకిస్తాన్ జట్టు కూడా ఒమన్‌పై ఘనవిజయం సాధించింది.
కాగా, ఆసియా కప్ లో అత్యంత విజయవంతమైన జట్టు భారత్. ఇప్పటివరకు ఎనిమిది సార్లు ఆసియా కప్ గెలిచింది. ఈసారి తొమ్మిదో టైటిల్ కోసం కొత్త జట్టుతో రంగంలోకి దిగుతోంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని జట్టులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు లేరు. పాకిస్తాన్ జట్టును సల్మాన్ ఆఘా నడిపిస్తున్నాడు. ఈ టోర్నమెంట్ భారత్‌లో జరగాల్సింది కానీ, రాజకీయ ఉద్రిక్తతల కారణంగా యూఏఈలో నిర్వహిస్తున్నారు.
ఆసియా కప్ లో భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ ల చరిత్ర
ఆసియా కప్ చరిత్రలో భారత్ vs పాకిస్తాన్ 19 సార్లు తలపడ్డాయి. భారత్ 10 విజయాలు సాధించగా, పాకిస్తాన్ 6 విజయాలు అందుకుంది. T20 ఫార్మాట్‌లో భారత్ 4లో 3 మ్యాచ్‌లు గెలిచింది. చివరిసారి జూన్ 9, 2024న న్యూయార్క్‌లో రెండు జట్లు తలపడ్డాయి. భారత్ ఆ మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో గెలిచింది.
భారత్ జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), అర్ష్‌దీప్ సింగ్, రింకూ సింగ్, హర్షిత్ రాణా.
పాకిస్తాన్ జట్టు: సల్మాన్ ఆఘా (కెప్టెన్), సహిబ్‌జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, ఫఖర్ జమాన్, హసన్ నవాజ్, మహ్మద్ హారిస్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ ఆఫ్రిదీ, హారిస్ రౌఫ్, అబ్రార్ అహ్మద్, మహ్మద్ వసీమ్ జూనియర్, హసన్ అలీ, హుస్సేన్ తలాత్, ఖుష్దిల్ షా, సల్మాన్ మిర్జా, సుఫియాన్ ముకీమ్.