Flipkart BBD 2025 : నథింగ్ ఫోన్లు, ఇయర్‌బడ్స్, వెరబుల్స్ పై భారీ డిస్కౌంట్లు
Flipkart Big Billion Days 2025: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో నథింగ్ ఫోన్లు, ఇయర్‌బడ్స్, వెరబుల్స్ పై భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. భారీ తగ్గింపులతో నథింగ్ గ్యాడ్జెట్స్ అందుబాటులో ఉన్నాయి.

Flipkart BBD 2025 లో నథింగ్ గ్యాడ్జెట్స్ పై బిగ్ డిస్కౌంట్లు
భారతదేశంలో అతిపెద్ద ఆన్లైన్ ఫెస్టివ్ సీజన్ సేల్ అయిన ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Billion Days Sale 2025) సెప్టెంబర్ 23న ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో చాలా ఉత్పత్తులపై భారీ ధర తగ్గింపులను ప్రకటించారు. వరుసగా కొన్ని వస్తువుల ధరలు రివీల్ చేస్తున్నారు. తాజాగా టెక్ కంపెనీ నథింగ్ (Nothing) తమ ఫోన్లు, ఇయర్‌బడ్స్, వెరబుల్స్ పై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది.
నథింగ్ ఫోన్లపై బిగ్ డిస్కౌంట్లు
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ (Flipkart BBD 2025) సేల్‌లో Nothing Phone 3a, Phone 3a Pro ఆఫర్లు ఉన్నాయి. వీటి ధరలు తగ్గాయి.
• Nothing Phone 3a – రూ. 22,999 నుండి రూ. 20,999 తగ్గింది
• Nothing Phone 3a Pro – రూ. 27,999 నుండి రూ. 24,999 తగ్గింది
అలాగే, CMF Phone 2 Pro 8జీబీ ర్యాబ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ అసలు ధర రూ. 18,999 వుండగా, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో ఇది రూ. 14,999 లకే లభిస్తోంది. వీటితో వినియోగదారులు ఫెస్టివ్ సీజన్ ప్రారంభానికి ముందు తక్కువ ధరలో పొందవచ్చు.
నథింగ్ ఆడియో డివైస్ లపై కూడా ఆఫర్లు
నథింగ్ తమ ఆడియో ఉత్పత్తులను కూడా సేల్‌లో చేర్చింది. వాటి ధరలు కూడా తగ్గాయి.
• Nothing Ear – రూ. 11,999 నుండి రూ. 7,499 తగ్గింది
• Nothing Ear (a) – రూ. 7,999 నుండి రూ. 4,499 తగ్గింది
• Nothing Ear Open – రూ. 9,999
• CMF Buds Pro 2 – రూ. 3,199
ఈ ఆఫర్ల ద్వారా వినియోగదారులు బడ్జెట్ ఫ్రెండ్లీ TWS ఆప్షన్లను సులభంగా కొనుగోలు చేయవచ్చు.
నథింగ్ వెరబుల్స్, అప్‌గ్రేడ్ ఆప్షన్స్
నథింగ్ వేర్‌బుల్స్ కూడా ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఉన్నాయి.
• CMF Watch Pro 2 – రూ. 4,999 నుండి రూ. 3,999 తగ్గింది
అలాగే, నథింగ్ ఫోన్ 1 (Nothing Phone 1), నథింగ్ ఫోన్ 2 (Nothing Phone 2) యూజర్స్ నథింగ్ ఫోన్ 3 (Nothing Phone 3) కి రూ. 34,999లో అప్‌గ్రేడ్ చేసుకునే ప్రోగ్రాంను కూడా ప్రకటించారు. నథింగ్ ఫోన్ 3 జూలైలో రూ. 79,999 ప్రారంభ ధరలో మార్కెట్‌లో వచ్చింది. ఇప్పుడు ఈ ఫోన్ పై కూడా ధర తగ్గింపులు ప్రకటించారు.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ : వీటిపై లుక్కేయవచ్చు
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో నథింగ్ గ్యాడ్జెట్ల పై ఓ లుక్కేయండి.. ఎందుకంటే సేల్ ప్రారంభం అయిన తర్వాత కూడా ఇంకా ధరలు తగ్గవచ్చు అనే టాక్ నడుస్తోంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart BBD 2025) ఈ సంవత్సరం అత్యంత చవకైన షాపింగ్ పీరియడ్ అవుతుంది. ఫోన్లు, ఆడియో డివైస్లు, వెరబుల్స్ ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి. వినియోగదారులు ముందస్తుగా కొనుగోళ్లను ప్రణాళిక చేసుకుని ఈ పరిమిత కాల ఆఫర్లను ఉపయోగించవచ్చు.